మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా?
ఇలా చేసి ఒక నెలకు 12 కేజీల బరువు తగ్గండి!! ప్రస్తుతం సమాజంలో, నేటి ఆధునిక పరిస్థితులలో అనేకమంది బాధపడుతున్న సమస్య ఊబకాయం సమస్య.
ఈ ఊబకాయం సమస్యలను తగ్గించుకోవడానికి అనేక మంది అనేక రకాల మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మీ అందరి కోసం 30 రోజుల వెయిట్ లాస్ డైట్ ప్లానింగ్ ఇక్కడ అందిస్తున్నాం.
మొదటి ఆరు రోజులు:-
ఆరు రోజులకు డైట్ ప్లాన్: ఉదయం లేవగానే ఒక లీటరు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా కడుపు శుద్ధి అవుతుంది. ఉదయం కాలకృత్యాలు తీరిన తర్వాత ఒకటిన్నర గంట పాటు మీకు వీలైనన్ని వ్యాయామాలు మరియు ఎక్సర్సైజులు చేసిన తర్వాత మరలా లీటరు పైగా నీటిని తాగాలి.
వీలైనంత వరకు మరోసారి మోషన్ కి వెళ్లడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా పొట్ట పూర్తి శాతం శుద్ధి చేయబడుతుంది. ఇక ఉదయం 9 గంటలకల్లా మీ ప్రక్రియలన్నీ పూర్తి అయి ఉంటాయి. కాబట్టి, 9 – 10 గంటల మధ్య ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగండి.
తర్వాత మరోసారి నిమ్మరసం నీళ్లలోకి తేనె వేసుకుని తాగండి. ఈ తేనె నీళ్లు తాగిన ఒక గంట తర్వాత మంచి నీళ్లు ఒక గ్లాసు తాగాలి. మరలా ఒక గంట విరామం తర్వాత నిమ్మరసంలో కి తేనె వేసుకుని మంచినీళ్లు తాగాలి. ఈ విధంగా ఉదయం మొదలు పెట్టి రాత్రి నిద్రపోయే అంతవరకు కూడా ఇలా చేయాలి.
సాయంత్రం ఒక కొబ్బరి బొండం నీరు తాగాలి. ఈ ప్రక్రియ అంతా కలిసి “హనీ లెమన్ ఫాస్టింగ్” అని అంటారు. విధంగా మొదటి ఆరు రోజులు ఫాస్టింగ్ చేస్తే రెండు కేజీలు బరువు తగ్గుతారు. ఈ ప్రక్రియ వల్ల వెయిట్ లాస్ అవుతూ తేనె నీటి వల్ల మీ శరీరానికి అధిక సంఖ్యలో రోగనిరోధక శక్తి అందుతుంది.
తొమ్మిది రోజులకు డైట్ ప్లాన్:-
ఉదయం రెండు లీటర్ల నీటిని తాగేసి మోషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత, ఉదయం 9 – 10 గంటల మధ్య ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగాలి. రెండవ సారి మోషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత చక్కెర కలుపుకుని కూరగాయల జ్యూస్ తాగాలి. తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. మీకు కూరగాయల జ్యూస్ నచ్చకపోతే పళ్లరసం తాగవచ్చు.
మధ్యాహ్నం రెండు గంటలకి ఇలాగే తాగాలి. సాయంత్రం ఐదు గంటలకు చెరుకు రసం తాగాలి. రాత్రి 7 గంటలకు ఇలాంటి జ్యూస్ తాగాలి. ఈ విధంగా ప్రతి మూడు గంటలకు ఒకసారి జ్యూస్ తాగుతూ ఉండాలి. ఈ జ్యూస్లలో ప్రధానంగా దానిమ్మ, నారింజ, పుచ్చకాయ మాత్రమే తాగాలి. ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు డైట్ పాటిస్తే 2-3 కేజీలు బరువు తగ్గుతారు.
6 డేస్ డైట్ ప్లాన్:-
ఈ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు కేవలం పళ్ళతో ఫాస్టింగ్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు పళ్ళు మాత్రమే ఆహారంగా తినాలి. మధ్యాహ్నం మరియు రాత్రి కూడా డిన్నర్ లో ఫ్రూట్స్ మాత్రమే తినాలి. మూడు రకాల ఫ్రూట్స్ దగ్గర ఉంచుకుని బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకోవచ్చు.
అరటిపండు, బొప్పాయి, పుచ్చకాయ లేదా కర్బూజ వంటివి తినాలి. మధ్యాహ్నం అరటి పండు, జామ కాయ, సాయంత్రం ఆపిల్ లేదా దానిమ్మ తినాలి. ఇలా ఈ ఆరు రోజులు ఫ్రూట్స్ ఫాస్టింగ్ చేయాలి.
చివరి తొమ్మిది రోజులు డైట్ ప్లాన్:-
ఇందులో భాగంగా ఉదయం 10 గంటల వరకు నీటిని మాత్రమే తీసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్లుగా. 10 గంటలకు ఒక జ్యూస్ తాగాలి. 11 గంటల లోపు మూడు రకాల స్ప్రౌట్స్ తినాలి.
మధ్యాహ్నం ఏమీ తినకుండా సాయంత్రం నాలుగు గంటల వరకు నీళ్లు మాత్రమే తాగుతూ ఉండాలి.
సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక జ్యూస్ తాగాలి.
సాయంత్రం 5-6 మధ్య 10 బాదం పప్పులు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, ఎండు ఖర్జూరాలు మరియు రెండు మూడు రకాల ఫ్రూట్స్ తినాలి. ఈ విధంగా చేయడం వల్ల సరాసరి పది నుంచి పన్నెండు కేజీలు బరువు తగ్గడం జరుగుతుంది.
పైన తెలియజేసిన విధంగా 30 రోజులపాటు తప్పనిసరిగా ఈ డైట్ ప్లాన్ పాటిస్తే బరువు తగ్గడం అనేది అతి సులువుగా జరిగిపోతుంది. ఇక 30 రోజుల డైట్ ప్లాన్ తర్వాత, పైన మీరు పాటించిన చివరి తొమ్మిది రోజుల డైట్ ప్లాన్ రా ఫుడ్ డైట్ ప్లాన్ ను కొనసాగించవలసి ఉంటుంది.
ఈ 30 రోజుల డైట్ ప్లాన్ లో మీకు ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే, డ్రై నట్స్, తేనె కలిపిన నిమ్మరసం, పళ్ళ జ్యూస్ లు తాగాలి. బరువు తగ్గాలనే సంకల్పంతో మీరు ఉంటే పైన తెలిపిన ముప్పై రోజుల డైట్ ప్లాన్ పాటిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది.