అలోవెరా జ్యూస్ ఉపయోగాలు ? అలోవేర జ్యూస్ త్రాగడం వలన ఎలాంటి ప్రయోజనం పొందగలం !

0
అలోవెరా జ్యూస్ ఉపయోగాలు

అలోవెరా జ్యూస్ ఉపయోగాలు | Uses Of Aloe Vera Juice In Telugu

అలోవెరా జ్యూస్ ఉపయోగాలు :- ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రి పేర‌టిలోనూ క‌ల‌బంద మొక్క ఉంటోంది. కలబందను ఆయుర్వేద వైద్యంలో, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో విరివిగా యూస్  చేస్తున్నారు. కలబంద చూడటానికి ముళ్ల‌తో పిచ్చి మొక్కలాగా కనబడుతుంది.

ఈ మొక్క మ‌న ఆరోగ్యానికి ఇది చేసే మేలు అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలో క‌ల‌బంద గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. క‌లబందలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి.అందుకే ఉద‌యం క‌ల‌బంద గుజ్జును నీటిలో క‌లిపి తిగితే మేలు.

ఇలా చేయ‌డం వ‌ల్ల వ్యాధులు, వైర‌ల్‌ ఇన్‌ఫెక్ష‌న్లు కూడా ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఈ క‌ల‌బంద జ్యూస్ తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అంతేకాకుండా, శరీరంలో ఉండే విషపదార్థాలు మొత్తం బ‌య‌ట‌కు పంపే శ‌క్తి క‌ల‌బంద‌కి పుష్క‌లంగా ఉంది. ప్ర‌తిరోజు క‌ల‌బంద గుజ్జు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

అలాగే క‌ల‌బంద గుజ్జుకు నీళ్లు క‌లిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా యూజ్ చేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లు, చిగుళ్లు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి, మ‌రియు నోట్లో ఉండే క్రిములు న‌శ‌నం అవుతాయి. ఇక ప్ర‌తిరోజు ఉద‌యం క‌ల‌బంద జ్యూస్ తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. ఆ అలోవెర జ్యూస్ ను బహుముఖ ప్రయోజనకారి అంటారు.

అలోవెరా జ్యూస్ ప్రయోజనాలు | Benefits Of Aloe Vera Juice 

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్ పెట్టే వీలుందని మీకు తెలుసా అవును. ఎండాకాలంలో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఎన్నో సమస్యలను తగ్గిపోతాయి.

రోజులో మన శరీరానికి, చర్మానికి అవసరమైన హైడ్రేషన్‌ని అందించడంతో పాటు మరెన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ రోజు త్రాగడం వలన ఎల్లాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకొందం.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ్చుతుంది :- కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం చాలామందికి తెలిసిన పద్ధతే. అయితే ఇలా చేయడంతో పాటు దాన్ని తాగడం వల్ల మీ చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

రక్తహినతను తగ్గిస్తుంది :- చాలామందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవ్వడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి, రక్తహీనతను తగ్గిస్తుంది.
ఆకలిని పెంచుతుంది :- చాలామందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటివారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది.
తల నొప్పి :- ఎండాకాలంలో మండే ఎండల వల్ల చాలామందికి తలనొప్పి సమస్య ఇబ్బంది పెడుతుంది. ఇలాంటివారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే కలబంద జ్యూస్ తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుంది.

కలబంద వల్ల ఉపయోగాలు | Benefits Of Aloe Vera

కలబంద ఉపయోగాలు:– కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద. దీనిని తరచుగా ‘వండర్ ప్లాంట్’ అని పిలుస్తారు. దీనిలో 500 జాతులు ఉండగా, వీటిలో ఎక్కువ రకాలు ఉత్తర ఆఫ్రికాలో పెరుగుతాయి.

అలోవెరా చాలా కాలం నుండి సౌందర్య సాధనాలు, మూలికా నివారణలు మరియు ఆహార పదార్ధాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

 • కలబంద చిగుళ్ళలో రక్తస్రావం మరియు వాపును తగ్గిస్తుంది. ఇది నోటిని శుభ్రపరిచేటప్పుడు చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రాంతాల్లో కూడా శక్తివంతమైన మందుగా పనిచేస్తుంది.
 • జీర్ణక్రియ సరిగా లేకపోవడం చాలా రకాల రుగ్మతలకి కారణం అవుతుంది. కలబంద జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.
 • ఆలోవెరా జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది.కలబందలో ఉండే పెక్టిన్ తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, జుట్టును శుభ్రంగా మరియు మెత్తగా చేయడానికి గొప్పగా సహాయపడుతుంది.
 • కలబంద గుజ్జు దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. దీనిలో గల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, గొంతు నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
 • పొడిబారిన చర్మాన్ని బాగు చేయడానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది. కలబందను మొటిమలు, మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ చర్మపు చారలు తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు.

అలోవేర జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి | How To Prepare Aloe Vera Juice 

 • ముందుగా ఒక కలబంద ఆకుని తీసుకోండి.
 • తీసుకొని దానిని కడిగి, కడిగిన తర్వాత దానిని సగ్గని కి కట్ చేయండి.
 • కట్ చేశాక ఆ గుజ్జుని జాగ్రతగా ఒక బాక్స్ లోకి తీసుకోండి.
 • ఆ బాక్స్ లో ఉన్న గుజ్జు లోకి నీరు వేసుకొని ఈ రెండు పదార్థాలు ఒక జార్ లోకి వేసుకొని గ్రాండ్ చేయండి.
 • గ్రాండ్ చేశాక అందులోకి కొద్దిగా స్వీటెనర్, నిమ్మరసం వేసుకొని మరొక సరి గ్రాండ్ చేసి ఆ జ్యూస్ ని వడకట్టి ఒక గ్లాస్ లోకి వేసుకొని ఉదయం పూట తాగవచ్చు.
 • ఈ జ్యూస్ ని ఉపయోగించే ముందు గా డాక్టర్ నీ సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-