ఈ ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ఉన్న దానిలో అందరికి తప్పని సరిగా ఆధార్ కార్డ్ చాల అవసరం. చిన్న పిల్లల నుండి పేదవాళ్ళు దాక అందరికి ఎంతో అవసరం. ఏ పనికి అయ్యిన దేనికి అయ్యిన ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. కొన్ని చోట్ల ఆధార్ కార్డ్ లేకుంటే లోపలికి కి ప్రేవేశం కూడా లేదు. పెద్ద పెద్ద దేవాలయలలో కూడా ఆధార్ కార్డ్ లేకుంటే లోపకిలి వెళ్ళనివ్వరు. మనం స్కూల్, కాలేజ్ జాయిన్ కావాలి అన్న ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. మన నిత్య జీవితం లో ఆధార్ కార్డ్ చాల అవసరం. ఆధార్ లేకుంటే మకి ఎలాంటి పనులు సాగవు.
ఈ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి ? ఆధార్ కార్డ్ గురించి క్లుప్తంగా తెలుసుకొందం :
ఈ ఆధార్ అన్నది నిర్దేశిత తనిఖీ ప్రక్రియ సంతృప్తికరంగా ముగిసిన తర్వాత దేశవాసులకు UIDAI జారీచేసే 12 అంకెలతో కూడిన యాదృచ్ఛిక సంఖ్య. లింగభేదం, వయసు వంటి ఎలాంటి సంబంధం లేకుండా దేశవాసులు ఎవరైనా దీనికోసం స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు. అయితే, జనసంఖ్యసంబంధ, (డెమోగ్రాఫిక్) జీవసంబంధ (బయోమెట్రిక్) కనీస సమాచారాన్ని నమోదు సమయంలో అందజేయాలి. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వివరాలు పునరావృతరహితమని రూఢి చేసుకున్న తర్వాత వాటి ఆధారంగా ఒకేఒక విశిష్టమైన సంఖ్యను సృష్టిస్తారు. అందువల్ల జీవితకాలం చెల్లుబాటయ్యే వ్యక్తిగత గుర్తింపు సంఖ్య రూపొందుతుంది. దీన్ని ఆన్‌లైన్‌ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడైనా వాస్తవ సమయంలో తిరుగులేనివిధంగా ప్రమాణీకరించవచ్చు.
ఆధార్ సంఖ్యలో నిఘా లేదా వ్యక్తిగత లేదా జాడ పసిగట్టే సమాచారం ఏదీ ఉండదు. ఇది వ్యక్తిగత గుర్తింపు కోసమే తప్ప పౌరసత్వ ధ్రువీకరణకు ఉపయోగించేది కాదు. దీనిద్వారా ఎలాంటి హక్కులు, లబ్ధికి హామీ లేదు. అయితే, ఆధార్‌ను శాశ్వత ఆర్థిక చిరునామాగా వాడుకోవచ్చు. తద్వారా సమాజంలోని అణగారిన, బలహీనవర్గాల ఆర్థిక సార్వజనీనత కోసం కల్పిస్తున్న లబ్ధిని పొందవచ్చు. అందువల్ల ఆధార్‌ను న్యాయ, సమానత్వ వితరణకు ఒక ఉపకరణంగా చెప్పవచ్చు..
డెమోగ్రాఫిక్ సమాచారము | పేరు,పుట్టిన తేదీ(పరిశీలించబడిన) మరియు వయసు(ప్రకటించబడిన), జెండర్, చిరునామా,మొబైల్ నెంబర్ (ఐచ్ఛికము)/ఈ-మెయిల్ ఐ.డి(ఐచ్ఛికము) |
బయోమెట్రిక్ సమాచారము | పది వ్రేలి ముద్రలు / రెండు కను పాపల ఐరిస్ స్కాన్ , ముఖ చిత్రము. |
ఆధార్ అనగా పునాది, స్తాపన, మూలము అని అర్ధము. కావున ఈ పునాది మీద ఎటువంటి పంపిణీ వ్యవస్థ అయినా నిర్మించవచ్చు. ఏ వ్యవస్థ ఆయినా నివాసిని గుర్తించే ప్రక్రియ ద్వారా పనిచేస్తూ నిరాటంకముగా లభ్ది దారునికి ప్రయోజనాలను చేకూర్చాలనే సంకల్పముతో వుంటే ఆ వ్యవస్తకు ఆధార్ ఆయువుపట్టు. కావున ఆధార్ ఈ క్రింది పధకాల ప్రయోజనాలను అందజేయడానికి ఉపయోగిస్తారు.
- ఆహారము &పోషణ-ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాన బోజన పధకము, సమగ్ర పిల్లల అభివృద్ధి పధకము
- ఉద్యోగము-మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకము, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, ప్ర ధానమంత్రి ఉపాధి హామీ పధకము
- విధ్య- సర్వ శిక్ష అభియాన్, విధ్యా హక్కు
- స్వాలంబన&శాంఘిక భద్రత-జనని సురక్ష యోజన, పురాతన
- ఆరోగ్య పరిరక్షణ-రాష్ట్రీయ స్వస్త్య భీమా యోజన, జనశ్రీ భీమా యోజన, ఆం ఆద్మీ భీమా యోజన
- ఇతర మిగిలిన ప్రయోజనాలు ఆస్తుల లావాదేవీలు, వోటర్ ఐ.డి, పాన్ కార్డు మొదలైనవి.
ఈ ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వాలి ?
- పేరు
- పుట్టిన డేట్
- లింగం
- మీరు నివసించే చిరునామా
- తల్లి తండ్రుల వివరములు
- ఫోన్ నెంబర్, ఈ మెయిల్ మొదలైన వివరములు పేర్కొనాలి.
కావలసిన బోయో మెట్రిక్ సంచారము :
- ఫొటో ముఖ చిత్రం
- పది వెళ్ళు ముద్రలు
- కంటి పాప మొదలైనవి.
ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవడం కోసం పైన పేర్కొన్న పత్రాల ద్వారా ఆధార్ కార్డ్ ని చేపించుకోవాచు.
ఈ ఆధార్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :
- ముందుగా మనం ఆధార్ కార్డ్ official సైట్ ని ఓపెన్ చేయాలి.
- ఓపెన్ చేసిన తర్వత హోం దానిలో my Aadhaar అని ఉంటది.
- మై ఆధార్ అనికూడా ఉంటది. లేదా అక్కడడే కిందకు వస్తే get Aadhaar అని ఉంటది.
- గెట్ ఆధార్ లో డౌన్ లోడ్ ఆధార్ ని ఉంటది, దాని మిద క్లిక్ చేస్తే.
- చేసిన తర్వత అందులో Aadhaar number, Enrolment ID (EID), Virtual ID(VID) ఎలా మూడు రకాలు కనిపిస్తాయి.
- పైన పేర్కొన్న మూడు రకములలో మనం ఏది అయ్యిన ఇవ్వచు.
- AADHAAR NUMBER వద 12 రకాల నెంబర్ ని ఎవ్వవలసి ఉంటది.
- ఇచ్చిన తర్వాత I WANT MASKED AADHAAR ? అనేది మన ఆధార్ కార్డ్ ఎవరికీ కనపడకుండా ఉండనికి లేదా చివరిలో 4 నెంబర్ లు మాత్రమే కనిపించే లాగా ఉండాలి అంటే I WANT MASKED AADHAAR మిద క్లిక్ చేయాలి.
- ఒకవేళ మీకు మొత్తం నెంబర్ కనపడాలి అంటే ఈ ఆప్షన్ ని క్లిక్ చేయకూడదు.
- మరి కింద CAPTCHA ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వత SEND OTP మిద క్లిక్ చేయాలి.
- క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కి మన సెల్ నెంబర్ లింక్ అయ్యిఉండాలి.
- OTP అనేది మన ఆధార్ కార్డ్ కి సెల్ నెంబర్ కి లింక్ అయ్యి ఉండాలి.
- మన సెల్ కి వచ్చిన OTP నెంబర్ ఎంటర్ OTP దానిలో ఎంటర్ చేయాలి.
- చేసిన తర్వత కింద ఉన్న SURVEY మిద కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని రకాల ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి .
- చేసిన తర్వాత VERIFY AND DOWNLOAD మిద క్లిక్ చేయాలి.
- క్లిక్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ ఆధార్ కార్డ్ కు సంభందించిన అన్ని వివరాలు ఆధార్ కార్డ్ ఓపెన్ అవ్తుంది.
- ఓపెన్ చేసిన తర్వత ENTER PASS WORD అని వస్తుంది.
- పాస్ వర్డ్ అనేది మన యొక్క ఆధార్ కార్డ్ లో మన పేరులో ఉండే మొదటి 4 అక్షరాలు కాపిటల్ లో,మరి మన యొక్క పుట్టిన సంవస్తరం ఇవ్వాలి.
- పాస్ వర్డ్ ఎంటర్ చేసిన తర్వత ఓకే అనే దాని మిద క్లిక్ చేయాలి.
- చేసిన తర్వత కొంత సమయo తిసుకొంటది. తీసుకొన్న తర్వత మనం ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవ్తుంది.
- మన ఆధార్ కార్డ్ కొత్త రకంగా వస్తుంది. అందులో మన యొక్క జాతీయ జెండా, QR కోర్డ్, విసువల్ కోర్డ్ ఉంటది. ఇది మన యొక్క ఆధార్ కార్డ్ కి సెక్యూరిటీ కోసం సహాయం చేస్తుంది.
- ఈ విధంగా మనం ఆధార్ కార్డ్ ని డౌన్ లోడ్ చేసుకోవచు.
ఇవి కూడా చదవండి :
- 2022 లో YONO APP నుంచి SBI LOAN తీసుకోవడం ఎలా ?
- Paytm బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ఎలా?
- ఎపిఎస్ఆర్టిసి లో ఆన్లైన్ బస్సు టికెట్స్ ఎలా బుక్ చేయాలి?
- SBI బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ నీ ఎలా చెక్ చేసుకోవాలి?