Table of Contents
ఆయాసం పోవాలంటే ఏం చేయాలి| What To Do Get Tired
ఆయాసం తగ్గడానికి :- ఆయాసం అనేది మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి.
దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు అన్నీ ఆస్తమా కిందకే వస్తాయి. దీనిని ఉబ్బసం అని కూడా పిలుస్తుంటారు.కొత్తగా నడక లేదా ఏదైనా వ్యాయామం మొదలు పెట్టినప్పుడు ఆస్తమా, ఆందోళన, శారీరక శ్రమ ఎక్కువ కావడం, ఊబకాయం లేదా అధిక బరువు ఉండడం తదితర కారణాల వల్ల ఆయాసం వస్తుంది.
మనిషికి ఆయాసం ఎందుకు వస్తుంది | Why Man Gets Tired
ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతాయి. ఫలితంగా రోగి సరిగ్గా గాలి తీసుకోలేడు. ఆయాసం, దగ్గు ఇబ్బంది పెడతాయి. ఇలా దీర్ఘకాలం పాటు వాయునాళాలు వాపునకు గురయ్యే పరిస్థితినే ‘ఆస్తమా’ అంటారు.
మనికి ఆయాసం అనేది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొందం. ఆయాసం అనేది మనిషి బరువు పెరిగి వారికి నడవడానికి కాకా పాయినపుడు వస్తుంది, అలాగే లావు ఉన్న వారు ఎక్కువ దురం నడిచిన ఆయాసం వస్తుంది.
- కొంత మంది ఎక్కువ సేపు నడడం గని, పరిగెత్తడం చేయరు అలంటి వారు నడిచిన రన్ చేసిన వారికి ఆయాసం అనేది వస్తుంది. అలాగే ఎక్కువ సేపు మాట్లాడుతున్న వారికి కూడా ఆయాసం వస్తుంది.
- శ్వాస అనేది సరిగ్గా ఆడక పాయిన ఆయాసం వస్తుంది, ఉపిరితిత్తులలో ఎం అయ్యిన సమస్య ఉన్న ఆయాసం వస్తుంది.
- ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా ఆస్తమా రావడానికి కారణమని భావిస్తున్నారు.
- తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఉంది.
- ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం, రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఆస్థమా వస్తుంది.
- తల్లికి పొగతాగే అలవాటు ఉన్నా దాని ప్రభావం కడుపులో బిడ్డపై పడి, అది ఆస్తమాకు దారి తీసే అవకాశముంది.
- దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, పువ్వులలోని పుప్పొడి రేణువులు, గడ్డి పోచలు, బూజు వంటివి అలర్జీకి కారణమవుతాయి. అది ఆస్తమాకు దారి తీస్తుంది.
- జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆయాసం రావచ్చు.
- శ్వాస మండలంలో అవరోధం ఏర్పడడం వల్ల.
- శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు కుచించుకుని, గాలి వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల.
ఆయాసం లక్షణాలు | Symptoms Of Fatigue
మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది.
- ఛాతీ బిగుసుకుపోయినట్లు ఉండటం, శ్వాసలో ఇబ్బంది, ఆయాసం, విపరీతమైన దగ్గు, ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత పెరగడం.
- ఎన్ని మందులు తీసుకున్నా దగ్గు నయం కాకపోవడం, గురక, ఊబకాయం, అతి నిద్ర రావడం.
- దీర్ఘకాలిక అలసట లేదా నిద్రలేమి.
- తలనొప్పి.
- తల తిరగడం.
- గొంతు లేదా నొప్పి కండరాలు.
- కండరాల బలహీనత.
- మందగించిన ప్రతిచర్యలు మరియు ప్రతిస్పందనలు.
- బలహీనమైన నిర్ణయాధికారం మరియు తీర్పు.
- మానసిక స్థితి, చిరాకు వంటివి.
ఆయాసం తగ్గడానికి ఆయుర్వేద మందు | Ayurvedic Medicine To Reduce Fatigue
సృష్టిలో ప్రతి జీవికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ పీల్చుకుని మనం కార్బన్ డయాక్సైడ్‌ను విడిచి పెడతాం. ఆక్సిజన్ వల్ల మన శరీరంలోని ఆహారం దహన ప్రక్రియకు గురవుతుంది. దీంతో మనకు శక్తి లభిస్తుంది. అయితే గాలిని పీల్చుకుని వదలడం కొందరికి కష్టంగా ఉంటుంది. దీన్నే ఆయాసం అంటారు.
- ఆయాసం ఉన్నవారు చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు, బెండకాయ, చేమ దుంప, పెరుగు, కొబ్బరి, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, పుల్లని పదార్థాలను తీసుకోరాదు.
- ముల్లంగి, వెలగ పండు, వేడినీళ్లు, తేనె, వెల్లుల్లి, గోధుమలతో చేసిన పదార్థాలను తీసుకోవాలి.
- వామును 50 గ్రాముల మోతాదులో తీసుకుని పెనంపై వేయించాలి. తరువాత దాన్ని పలుచని వస్త్రంలో చుట్టి దాంతో వీపు, పక్క భాగాల్లో కాపడం పెట్టాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఆయాసం తగ్గుతుంది.
- ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు చిటికెల పసుపు, ఒక చిటికె మెత్తని ఉప్పు, రెండు చిటికెల పిప్పళ్ల చూర్ణం తిని వేడినీళ్లు తాగడం మంచిది. దీంతో అలర్జీలు, ఆయాసం తగ్గుతాయి.
- పిప్పళ్లు, మిరియాలు, పసుపు, ద్రాక్ష పండ్లు, నువ్వులు, బెల్లంలను సమాన భాగాల్లో తీసుకుని నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటుంటే ఆయాసం తగ్గుతుంది.
- ఉసిరిక పెచ్చులు, వరి పేలాలు, పటిక బెల్లం, నువ్వులు, నెయ్యిలను సమాన భాగాల్లో తీసుకుని మర్దించి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది.
- వేప నూనె 5 నుంచి 10 చుక్కలు ఒక తమలపాకుపై వేసుకుని నిత్యం తింటుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుంది.
- వేడి టీ డికాషన్‌లో 9 చుక్కల నిమ్మరసం వేసి తేనె కలుపుకుని వేడి వేడిగా తాగడం వల్ల ఆయాసం తగ్గుతుంది.
- వాసారిష్ట 3 టీస్పూన్లు, కనకాసవం 3 టీస్పూన్లు కలుపుకుని మూడు టీస్పూన్ల నీళ్లు కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
కఫం పోవాలి అంటే ఎం చేయాలి |