ఈ రోజు సాయంత్రం 6 కి రిలీజ్ అవ్వబోతున్న Thank You సినిమా ట్రైలర్ !

0
thank you movie trailer launch

నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమా కాంబినేషన్ అలాంటిది మరి. ఇంతకుముందు నాగచైతన్య గారికి హిట్ అందించిన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఈ థ్యాంక్యూ సినిమా రాబోతోంది.

అందుకే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇంతకుముందు నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

మరి ఈ సినిమా సక్సెస్ ఏంటో మనకు తెలియాలంటే ఈరోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ఆరు గంటల మూడు నిమిషాలకు యూట్యూబ్లో వస్తుంది. దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అన్నిటిలోనూ ట్రైలర్ను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

ఈ Thank You సినిమాలో నటీనటులుగా, నాగచైతన్య సరసన రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటించారు. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చగా, బివిఎస్ రవి స్టోరీని అందించారు.