ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ చిన్ని చిట్కా పాటించండి చాలు

0
ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి
ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి

కేవలం ఐదు నిమిషాలలో మీ ఒంట్లో వేడి తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!!!

మీ ఒంట్లో వేడి చేసిందని మీరు తరచుగా బాధపడుతూ ఉంటారా? వీటికి సహజమైన ఉపశమనాలుగా
నీళ్ల మజ్జిగ తాగడం – చక్కెర నీళ్లు తాగడం
సగ్గుబియ్యం గంజి తాగడం – బార్లీ నీళ్లు తాగడం
పళ్లరసాలు తాగడం వంటివి చేస్తూంటారు.

అన్నింటికంటే ప్రధానంగా శరీరం వేడెక్కడానికి ఒంట్లో నీటి శాతం తగ్గి పోవడమే ముఖ్య కారణం.
ఇక్కడ మీరందరూ తప్పకుండా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒంట్లో వేడి తగ్గడానికి, ఒంట్లో వేడిని తగ్గించే పదార్ధాలు ఆహారంగా తీసుకోవడం కంటే నేరుగా నీటిని తీసుకోవడం ద్వారా ఒంట్లో వేడిని సులభంగా మరియు త్వరగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కేవలం నీరు మాత్రమే నేరుగా రక్తంలోకి త్వరగా కలిసిపోయి శరీరంలో ఉండే వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.

నీటిని తాగడం గురించి అనేక రకాల ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన లెక్కల ప్రకారం ఒక కేజీ బరువు కు 75 మిల్లీ లీటర్ల నీటిని తాగాలి. అంటే, సాధారణంగా భారతదేశంలోని స్త్రీలు 50 కేజీల కు పైగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా 50 కేజీల బరువు ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మూడున్నర లీటర్ల నుండి నాలుగు లీటర్ల వరకు నీటిని తప్పనిసరిగా తాగాలి.

భారతదేశంలోని మగవారు సగటున 60 కేజీల పైగా బరువు ఉంటారు కాబట్టి మీరు తప్పనిసరిగా నాలుగు లీటర్ల పైగా నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ నీటి గురించి మొత్తంగా పరిశీలన చేస్తే, ప్రతి ఒక్కరు కూడా మూడున్నర లీటర్ల పైగా నీటిని తీసుకుంటే ఒంట్లో వేడి చేయడం అనేది జరగదు.

ఆరోగ్యకరంగా నీటిని తాగడానికి సూచనలు:-

ఉదయం నిద్ర లేచిన తర్వాత దాదాపు ఒక లీటర్ వరకు నీటిని తాగాలి. అందులోనూ ఈ నీరు గోరు వెచ్చని నీరు అయితే మీ ఆరోగ్యానికి మరీ మంచిది. ఒకేసారి లీటర్ నీరు తాగ లేకపోతే పదినిమిషాలు విరామం ఇచ్చి ఆ తర్వాత, తర్వాత లీటర్ నీటిని తాగాలి.

దీని తర్వాత రెండు గంటలు విరామం ఇచ్చి మరలా ఒక లీటరు నీటిని తాగాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం తీసుకునే సమయంలో నీరు అధికంగా తాగకూడదు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడే అధికంగా నీరు తాగాలి ఇలా తాగినప్పుడే నీరు రక్తంలోకి నేరుగా కలిసి పోయి శరీరాన్ని చల్లబరుస్తుంది.

ఇక మధ్యాహ్నం భోజనం తినే లోపు ఒక లీటర్ నీటిని తాగడం పూర్తిచేయాలి. ఈ లీటర్ నీటిని కూడా మధ్య మధ్యలో విరామం ఇస్తూ తాగాలి. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత రెండు గంటలు విరామం తప్పకుండా ఇవ్వాలి. దీనివల్ల తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. దీని వల్ల కడుపులో మంట రాదు గ్యాస్ట్రిక్ సమస్య అసలే రాదు.

మధ్యాహ్నం మూడు గంటల సమయం నుండి మధ్య మధ్యలో ఒక గ్లాసు నీటిని తాగుతూ ఉండాలి. ఈ విధంగా మరలా రాత్రి భోజనం లోపు ఒక లీటర్ నీటిని తాగాలి. ఆహారం తినేటప్పుడు నీరు తాగి నట్లయితే ఆహారంతోపాటు ఆ నీరు పొట్ట లోనే నిలిచిపోతుంది, వెంటనే ఫలితం అనేది కలగదు. మీ శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం గురించి అసలు ఆలోచించకండి. ఎందుకంటే నీటిని మించిన మార్గము వేరొకటి లేదు.

ఇవి కూడా చదవండి :-

  1. మజ్జిగ వల్ల ఉపయోగాలు మీకు తెలిస్తే ఇక జన్మలో వదలరు !
  2. అల్లం తినేవారు ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి 
  3. రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
  4. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు