ఓమిక్రాన్ లక్షణాలు : ప్రస్తుతం అనేక రకాల పండుగ సందర్భాల వల్ల జనం ఎక్కువగా గుంపులుగా కలవడం ఒమిక్రాన్ వైరస్ కు దగ్గరి దారి అయింది.
ప్రధానంగా ఈ వైరస్ రెండు రకాలుగా వ్యాప్తి చెంది ఉన్నది. మన దేశంలో కూడా ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరగడం మొదలైంది. ఇప్పటికే చాలామంది రెండు రకాల వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది.
మరికొంతమంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. బూస్టర్ డోస్ తీసుకున్నవారు ఇక ఎలాంటి వైరస్ ఏమీ చేయదు, ఇక హాస్పిటల్ కి వెళ్ళ వలసిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ వీరి నుండి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
డెల్టా వేరియంట్ లక్షణాలు
- డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందినప్పుడు, ఈ డెల్టా వైరసు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి అక్కడి నుండి ఈ వైరస్ను వ్యాప్తిచెందించి ఊపిరితిత్తులను పాడు చేయడం జరిగింది.
- ఆయాసం రావడం
- ముక్కు దిబ్బడ పెరగడం
- కఫం రావడం
- జ్వరం ఎక్కువగా రావడం
- ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం
ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు
ఈ కొత్త వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది కానీ, ఊపిరి తిత్తుల్లో లోపలి భాగాలను దెబ్బ తీయదు.
ఒమిక్రాన్ వైరస్ ముక్కునుండి గొంతు లోకి ప్రవేశించి, ఈ భాగాలలో మాత్రమే దాని పనితనం చూపుతుంది.
- గొంతు నుండి పొడి దగ్గు రావడం
- ముక్కు ద్వారా జలుబు లక్షణాలు బయట పడడం
- రుచి తెలీకుండా ఉండడం
- ఆకలి లేకపోవడం వంటివి
- ఒకవేళ బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఈ వైరస్ అటాక్ చేస్తే వారిలో జలుబు మరియు పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఏదైనా మింగినప్పుడు గొంతులో నొప్పి రావడం జరుగుతుంది.
ఒమిక్రాన్ వైరస్ను ఇలా తరిమికొట్టండి
వ్యాక్సిన్స్ మరియు బూస్టర్ డోస్ తీసుకున్నవారిలో కూడా ఏ వైరస్ అయినా అటాక్ చేస్తే కొద్ది వరకు ప్రభావం చూపిస్తుంది.
ఇలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- రోజులో వీలైనన్ని పూటలు ఉపవాసం ఉండండి.
- వేడి నీటి ఆవిరి పట్టాలి
- ఈ వేడి నీటిలో కి పిప్పర్మెంట్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ వేసుకుంటే మంచిది
- పసుపు వేసి ఆవిరి పట్టండి
- రోజంతా వేడి నీరు తాగడం
- పొడి దగ్గు ను తొలగించుకోవడానికి వేపాకు నమిలి ఉమ్మి వేస్తూ ఉండాలి
- మూడు లేదా నాలుగు రోజుల పాటు తేనె నీరు లేదా నిమ్మరసం కలిపిన నీరు తాగుతూ ఉపవాసం ఉండటం చాలా మంచిది.
- వీలైనంతవరకూ ద్రవాహారం తీసుకోవాలి
- వీటివలన నోరు మరియు గొంతులో పేరుకున్న కఫం తొలగిపోతుంది.
ఒమి క్రాన్ – క్వారంటైన్
గతంలో covid వచ్చినప్పుడు 10 నుండి 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండవలసి వచ్చేది.
అయితే ఇప్పుడు వేరియంట్ రూపంలో వస్తున్న ఒమి క్రాన్ వల్ల కేవలం ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉంటే చాలు అని డాక్టర్స్ తెలియజేస్తున్నారు.
ఉపవాసం ఉండలేని వారు పళ్లరసాలు తాగుతూ డాక్టరు ఇచ్చిన మందులు వాడుతూ ఉంటే ఒమి క్రాన్ ఏడు రోజులలో తగ్గిపోతుంది!
ముఖ్యంగా పరిశుభ్రమైన మాస్కులు ధరించడం చాలా ముఖ్యం. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. నిర్లక్ష్యం చేయకుండా బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ ఉపయోగించాలి
గమనిక:- ఒకవేళ మీకు ఎలాంటి జలుబు లక్షణాలు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్తో చెకప్ చేయించుకొని మందులు వాడాలి.
ఇవి కూడా చదవండి :-
- ఓమిక్రాన్ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇంట్లో ఈ పొగ పెట్టండి
- రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు