కలోంజి విత్తనాలు అంటే ఏమిటి ? ప్రయోజనాలు ఏంటి ?

0
కలోంజి విత్తనాలు

కలోంజి విత్తనాలు  అంటే ఏమిటి ?

ప్రస్తుతం కలోంజి విత్తనాలుగా పిలుచుకునే నల్లజీలకర్ర వైరల్ ఫుడ్స్ లో ఒకటిగా ఉంది. ఈ నల్లజీలకర్రను తెలుగు ప్రజల కంటే ఇతర రాష్ట్ర ప్రజలు మరియు, విదేశాలలో వంటల్లో బాగా ఉపయోగిస్తారు.చూడటానికి నల్లనువ్వుల లాగా అనిపించే ఈ కలోంజి విత్తనాలు జీలకర్ర రకాలలో ఒకటి. ఇది ఆరోగ్య పరంగానూ, ఇతర ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.

కలోంజి విత్తనాలలో ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, నియాసిన్, మరియు విటమిన్ సి. మొదలైన విటమిన్లు ఉంటాయి.ఈ నల్లజీలకర్ర నుండి లభించే  నూనె ఇతర నూనెలతో పోలిస్తే చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.

కలోంజి విత్తనాల వలన  ఆరోగ్య ప్రయోజనాలు

కలోంజి విత్తనాలను పొడిగా చేసి  తేనెతో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. .  మెరుగైన మెదడు పనితీరు కోసం ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున దీన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఎదురయ్యే మతిమరుపు సమస్యకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.అంతేకాదు జ్ఞాపకశక్తిని పెంచి అల్జీమర్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనికోసం నల్లజీలకర్రను పుదీనతో కలిపి తీసుకోవాలి.

 డయాబెటిస్‌ను తగ్గిస్తుంది 

టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కలోంజీ చాలా సహాయపడుతుంది.  మధుమేహ రోగులు కలోంజి విత్తనాలతో బ్లాక్ టీ తయారుచేసుకుని తాగడం వల్ల మంచి పలితాన్ని ఇస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.  గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు పాలలో కాస్త కలోంజి నూనెను కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ ను అదుపులో వుంచుకోవచ్చు.

మంటను, నొప్పులను తగ్గిస్తుంది

కలోంజి విత్తనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి దీర్ఘకాలిక మంటలకు చికిత్స చేయగలవు.  కీళ్ల మధ్య అడ్డంకులు తొలగించడం ద్వారా కీళ్ల నొప్పులను నయం చేయగలదు. ఆయుర్వేదంలో కీళ్ల సమస్యలకు కలోంజి నూనెను ఔషధంగా సూచిస్తారు.

పంటి సమస్యలకు తగిస్తుంది పెడుతుంది

కలోంజీ  పళ్ళు, చిగుళ్ళు మరియు బలహీనమైన పిప్పి పన్ను వంటి మొత్తం సమస్యలకు ఔషద్జంగా ఉపయోగపడుతుంది. పంటి సమస్యలు తగ్గాలంటే ఒక స్పూన్ కలోంజి నూనెను కాసింత పేరులో కలిపి దాంతో పళ్ళను దున్నితంగా మర్దనా చేస్తూ తోముకోవాలి.తరువాత నోటిని కడిగేసుకోవాలి. ఇది నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది.

ఉబ్బసం లేదా ఆస్తమా నుండి ఉపశమనాన్ని ఇస్తుంది

కాలుష్యం కారణంగా, ఉబ్బసం చాలా సాధారణ సమస్యగా మారింది.  ఆస్తమాతో బాధపడేవారికి కలోంజీ శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది.   కలోంజీ నూనెను, తేనెను టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కలపి ప్రతిరోజు తాగాలి.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

కలోంజీ  జీర్ణ క్రియ రేటును పెంచి శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా చేస్తుంది. అలాగే పొట్ట, నడుము ప్రాంతాల్లో కొవ్వును కరిగిస్తుంది.

 మూత్రపిండాలను కాపాడుతుంది 

రక్తంలో చక్కెర  స్థాయిలు మరియు రక్త యూరియా స్థాయిలను తగ్గించడం ద్వారా డయాబెటిక్ నెఫ్రోపతీ (డయాబెటిస్‌లో మూత్రపిండాల సమస్య) ను తగ్గించడానికి కలోంజీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు మరియు ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

 క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి

క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నియంత్రిస్తాయి. తద్వారా  రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ఇవి మాత్రమే కాకుండా కలోంజి తీసుకోవడం వల్ల  మలబద్ధకాన్ని నయం చేసుకోవచ్చు, హేమోరాయిడ్లను కలోంజి నయం చేస్తాయి. కడుపులో పూతలు మరియు పుండ్లను నయం చేస్తుం.

 జుట్టు పెరుగుదలలో కలోంజి విత్తనాల పాత్ర

అందంగా కనిపించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అమ్మాయిలతో చాలామందికి జుట్టు పొడవుగా ఉంటే అందం మరింత పెరుగుతుంది.అయితే ప్రస్తుతం కాలుష్యం, రసాయనాలతో నిండిన ఉత్పత్తుల వాడకం  మొదలైన వాటి వల్ల జుట్టు రాలడం, పెరుగుదల లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి.

అయితే కలోంజి ని ఆహారం గానూ మరియు, హెయిర్ పాక్  గానూ ఉపయోగించుకోవడం వల్ల జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది. జుట్టు నల్లబడుతుంది. కలోంజి నూనెను కూడా ఉపయోగించవచ్చు. జుట్టును కుదుళ్ల నుండి బలోపేతం చేస్తుంది.

 కలోంజీ దుష్ప్రభావాలు

కలోంజీ తీసుకోవడం వల్ల  ఎటువంటి దుష్ప్రభావాలు లేవు.  అయినప్పటికీ, ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఇది రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపిస్తుంది.

తక్కువ రక్తపోటుకు దారితీస్తుంది.

పాలిచ్చే తల్లులకు ఇది మంచిది కాదు కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

కలోంజీ ఎక్కువగా తీసుకుంటే ఆపరేషన్ ల సమయంలో మరియు ఆపరేషన్ ల తరువాత రక్తం గడ్డ కట్టే ప్రక్రియను దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. మరియు అలాంటి సందర్భాలు వస్తే పూర్తిగా మానేయాలి.

ఇవి కూడా చవండి