జవహర్లాల్ నెహ్రూ గురించి వ్యాసం తెలుగులో!

0
jawaharlal nehru essay writing in telugu

Jawaharlal Nehru Essay In Telugu:-జవహర్ లాల్  నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని.పండిట్ జవహర్ లాల్  నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లో  జన్మించారు. అతని తండ్రి మోతిలాల్ నెహ్రు సంపన్నుడైన బారిస్టర్. తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు. తల్లి స్వరూపరాణి తుస్సు  మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవాహర్‌లాల్ తొలి సంతానం.జవహర్ లాల్ నెహ్రూకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.విజయ్ లక్ష్మి పెద్ద సోదరి. ఆమె  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలైంది. చిన్న సోదరి కృష్ణ హుతీసింగ్ ఒక ప్రసిద్ధ రచయిత్రి.ఇమే  సోదరుడిపై అనేక పుస్తకాలను రచించారు. జవహర్ లాల్ నెహ్రూ 1899లో జన్మించిన కమలా నెహ్రూను వివాహం చేసుకున్నారు.

నెహ్రు గారి  తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం 15 ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లాండుకు  వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రకృతిశాస్త్రాలను చదివారు. అనంతరం ఇన్నర్టెంపుల్ అనే పేరున్న ప్రఖ్యాత న్యాయ విద్యాసంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న ఈ దశలోనే నెహ్రూ విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ దేశాల జాతీయ పోరాటాలను అధ్యయనం చేశారు. నాడు ఐర్లాండ్లో జరుగుతున్న షిన్ ఫెయిన్ ఉద్యమాన్ని ఆసక్తితో గమనించారు. ఈ అనుభవంతో 1912లో స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన స్వాతంత్రోద్యమంలోకి చేరారు.

1912లో బీహార్లోని బంకీపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రతినిధిగా నెహ్రూ హాజరయ్యారు. అనంతరం 1916లో మహాత్మాగాంధీని తొలిసారిగా కలిశారు. ఆ తొలి సమావేశంలోనే గాంధీజీ ప్రభావం ఆయనపై అమితంగా పడింది. హోంరూల్ లీగ్ అలహాబాద్ శాఖకు నెహ్రూ 1919లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1920లో ఆయన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో మొట్టమొదటిసారిగా రైతుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం సందర్భంగా 1920-22 మధ్య కాలంలో నెహ్రూ రెండుసార్లు జైలుకు వెళ్లారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రూ 1923 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు. 1926లో ఇటలీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, బెల్జియం, జర్మనీ, రష్యా దేశాలలో పర్యటించారు. బెల్జియంలో జరిగిన ” అణ‌గారిన‌ జాతుల మహాసభలకు” భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. అదే ఏడాది మద్రాస్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో దేశ స్వాతంత్ర  సాధనకు పోరాడే సంకల్పాన్ని కాంగ్రెస్ తీసుకోవటంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. 1927లో రష్యాలోని మాస్కోలో జరిగిన సోషలిస్టు విప్లవం 10వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు. 1928లో సైమన్ కమిషన్ కు  వ్యతిరేకంగా లక్నోలో ఒక ప్రదర్శన నిర్వహిస్తూ బ్రిటీష్ పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. 29 ఆగస్టు 1928న జరిగిన అఖిలపక్ష కాంగ్రెస్కు నెహ్రూ హాజరయ్యారు. భారత రాజ్యాంగ సంస్కరణలపై తన తండ్రి మోతీలాల్ నెహ్రు  రూపొందించిన నివేదికపై ఇతర నేతలతో కలిసి నెహ్రూ సంతకం చేశారు. అదే ఏడాది ”భారత స్వాతంత్ర లీగ్  ” అనే సంస్థను స్థాపించి దాని ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ తో  సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది.
1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే తీర్మానాన్ని ఈ మహాసభల్లోనే ఆమోదించారు. 1930-35 మధ్యకాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతోపాటు ఇతర అనేక నిరసన కార్యక్రమాల సందర్భంగా నెహ్రూ పలుమార్లు  జైలుకెళ్లారు. 14 ఫిబ్రవరి 1935న అల్మోరా జైలులో తన జీవితచరిత్ర పుస్తక రచనను నెహ్రూ ముగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత స్విట్జర్లాండ్లో అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వెళ్లారు. అక్కడి నుంచి 1936  లండన్ కు వెళ్లారు.రెండో ప్రపంచయుద్ధం మొదలుకావటానికి కొంతకాలం ముందు చైనాకు కూడా వెళ్లి వచ్చారు.జవహర్ లాల్ నెహ్రు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా 1955 లో భారత రత్న అవార్డును అందుకున్నారు.

నెహ్రూ 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదట తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆపై 1950 నుండి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్రధానమంత్రిగా పనిచేశారు.1946 ఎన్నికలలో కాంగ్రెస్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది మరియు నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. 1947 ఆగస్టు 15న జవహర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 15న అతను భారత ప్రధానమంత్రి అయినందున పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

 1962 తర్వాత నెహ్రూ ఆరోగ్యం మెల్లగా క్షీణించడం ప్రారంభించింది మరియు 1963 వరకు కాశ్మీర్‌లో నెలల తరబడి కోలుకున్నారు. చివరగా 27 మే 1964 లో గుండెపోటుతో మరణించారు. అదే రోజు లోక్‌సభకు నమోదు చేయబడింది.

ఇవి కూడా చదవండి:-