మీరు తెల్లజుట్టుకు తరచుగా రంగు వేస్తూ ఉంటారా? ఇలా రంగు వేసి మీకు విసుగు వచ్చిందా? అయితే వీటిని అప్లై చేయండి మీ జుట్టు ఎప్పటికీ తెలుపు రంగులోకి మారదు.
నల్ల జుట్టు తెల్లగా మారిపోవడానికి గల కారణం ఏమిటంటే మెలనిన్ అనే రసాయనకం జుట్టు కుదుళ్ల లో తగ్గిపోవడం. ఈ నలుపు రంగు ఇచ్చే మెలానిన్ ఉత్పత్తి కాకపోతే జుట్టు తెలుపుగా మారుతుంది. సాధారణంగా జుట్టుకుదుళ్ళలలో మెలనోసైట్స్ అనే కణజాలం ఈ మెలనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి.
మెలనిన్ ఉత్పత్తి కాకపోవడానికి కారణాలు:-
- ఎసిడిక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం
- ఎసిడిక్ కెమికల్స్ ను జుట్టుకు అప్లై చేయడం
- వీటివలన ఈ మెలనోసైట్స్ దెబ్బతిని మెలనిన్ రంగును విడుదల చేయవు.
- దీని వల్లనే, చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడం మొదలవుతుంది.
మెలానిన్ అభివృద్ధి చేయడం ఎలా?
- కరివేపాకు ను పేస్టుగా చేసుకొని అప్లై చేయడం మరియు
- కరివేపాకులు రసంగా చేసి ఆ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం.
- కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ జుట్టు కుదుళ్ల లో ఉండే మెలనోసైట్స్ ను స్టిమ్యులేట్ చేస్తాయి.
- దీనివల్ల మెలనిన్ బాగా విడుదల అవుతుంది. అప్పుడు జుట్టు నలుపు రంగు లోనే ఉంటుంది
తయారీ విధానం :-
కరివేపాకును బాగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ను నేరుగా తలకు, జుట్టుకు మరియు జుట్టు కుదుళ్ల భాగాలకు వేళ్ళతో బాగా మర్దన చేస్తూ అప్లై చేయాలి.
కరివేపాకు ఆకులను కొద్దిగా నీటితో కలిపి బాగా గ్రైండ్ చేసి వడగట్టి వచ్చిన కరివేపాకు రసాన్ని జుట్టు కుదుళ్లు వరకు చేరేటట్లు వేళ్ళతో బాగా మసాజ్ చేస్తే అప్లై చేయాలి.
ముఖ్యంగా కరివేపాకు రసాన్ని తల యొక్క మాడు మీద బాగా మర్ధన చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా తొలగిపోతుందని శాస్త్రజ్ఞులు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :-
- అల్లం తినేవారు ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి
- ఇలా చేస్తే చాలు, మీ అధిక బరువు మొత్తం ౩౦ రోజుల్లో దిగిపోతుంది !
- రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు