దగ్గినప్పుడు కఫం వస్తోందా ? అయితే ఇలా చేయండి, వెంటనే తగ్గిపోతుంది

0
దగ్గు కఫం పోవాలంటే ఏం చేయాలి
దగ్గు కఫం పోవాలంటే ఏం చేయాలి

గ్రంధులు వాటి యొక్క హార్మోన్లు

థైరాయిడ్, పిట్యూటరీ, పీనియల్, thymus gland ప్యాంక్రియాస్ గ్లాండ్, టెస్టికల్స్, ఓవరీస్ మరియు ఎడ్రినల్ గ్లాండ్ వీటన్నింటినీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. ఈ గ్రంధులు అన్నీ కూడా ప్రత్యేకమైన హార్మోన్లను విడుదల చేస్తాయి.

ఈ హార్మోన్లు అన్నీ నేరుగా రక్తంలో కలుస్తాయి. అందుకే వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అనే పేరుతో పిలుస్తారు.
exocrine glands అంటే వీటి యొక్క స్రావాలు నేరుగా రక్తంలోకి వదలవు. వేరే నాళాల ద్వారా వదులుతాయి.

వీటికి ఉదాహరణ కళ్ళలో నుండి కన్నీరు కారడం, నోటి లో నుండి లాలాజలం కారడం, ముక్కులో నుండి నీరు కారడం, ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం రావడం, చర్మం నుండి చెమట రావడం ఇవి అన్నీ exocrine glands కు సంబంధించినవి.

లాలాజల గ్రంధులు

నోటిలో రుచి తెలపడానికి, నోరు దుర్వాసన రాకుండా ఉండడానికి, తిన్నది జీర్ణం కావడానికి, నోటిలో స్రవించే లాలాజలం అవసరం. లాలాజల గ్రంధులు మూడు రకాలు. ఒకటి నాలుక క్రింద మరొకటి నాలుక వెనుకల మూడవది దవడ భాగంలో ఉంటాయి.

చర్మంలో ఉండే స్వేదగ్రంథులు/ నూనె గ్రంధులు

చర్మాన్ని వాతావరణ పరిస్థితుల నుండి రక్షించడానికి, చర్మం పొడిబారకుండా కాపాడడంలో , చర్మం ద్వారా విసర్జక పదార్థాలను బయటకు పంపడానికి, స్వేద గ్రంధులు మరియు తైల గ్రంథులు ఉపయోగపడతాయి.

జీర్ణ రసం గ్రంథులు

హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొట్ట లో విడుదల అవుతుంది. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. జీర్ణప్రక్రియకు ఇది ఉపయోగపడుతుంది.

శ్లేష్మ గ్రంధులు

మనం పీల్చే గాలి ద్వారా వచ్చే దుమ్ము ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ముక్కులో జిగట ఉంటుంది. ఇలా చేరిన దుమ్ము ధూళి మరియు శ్లేష్మం రూపంలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు పంపి వేయబడుతుంది.

వెల్లుల్లి పాయలోని నాలుగు రేకులను గుజ్జుగా తయారు చేసుకుని ప్రతి ఆరుగంటలకు ఒకసారి తీసుకుంటే కఫ సమస్యలు తొలగిపోతాయి. మిరియాలు, శొంఠి ఈ మూడింటిలో ఏదో చూర్ణాన్ని సంచదార నీటితో కలిపి రాత్రిపూట తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

ఊపిరితిత్తులు

కొన్ని సందర్భాల్లో మనం పీల్చే గాలి ద్వారా ముక్కు రంధ్రాలను, నాళాలను దాటుకుని ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. ఇక్కడ ఊపిరితిత్తుల గోడల అంచుల వెంబడి జిగట స్రవిస్తూ ఉంటుంది. ఇది శ్లేష్మం మరియు కఫం రూపంలో బయటకు విడుదల చేయబడుతుంది.

పాలను ఉత్పత్తి చేసే గ్రంధులు

ప్రతి స్త్రీ తల్లి కాకమునుపే పాల గ్రంధులు ఉంటాయి. అయితే ఆమె గర్భవతి అయిన తర్వాత ఈ పాల గ్రంధులు యాక్టివ్ గా మారి పాలు స్రవిస్తాయి.

కంటిలో ఉండే గ్రంథులు

కంటి పైభాగంలో కన్నీరు స్రవించే గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంథులలో స్రవించే నీటి వలన కంటి మీద పడే దుమ్ము ధూళి కణాలను నీటి రూపంలో తొలగిస్తాయి. కంటిలో తేమ లేకపోతే ఎండిపోతాయి. ఇలా జరిగితే కళ్ళు మంట పెడతాయి. కనుగుడ్డు అటూ ఇటూ తిరగటానికి కూడా ఈ నీరు అవసరం.

ముక్కు లో ఉండే గ్రంధులు

ముక్కు పైభాగంలో నీటిని స్రవించే గ్రంథులు ఉంటాయి.
ముక్కులో చేరే దుమ్ము ధూళి కణాలను ఈ నీరు తొలగిస్తూ ఉంటాయి.

పైన తెలియజేసిన విధంగా ఈ గ్రంధులు మీ శరీరం యొక్క రక్షణ వ్యవస్థను కాపాడుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి :-

  1. ఓమిక్రాన్ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇంట్లో ఈ పొగ పెట్టండి
  2. రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
  3. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు