4 రోజుల్లో నరాల బలహీనత,నరాల్లో వాపులు నొప్పులు,బ్లాకేజెస్ లాంటి వాత రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి

0
నరాల బలహీనత
నరాల బలహీనత

మీరు నరాల్లో వాపులు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారా? కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సమస్యలను మీరు తొలగించుకోవచ్చు. ఇందు కోసం ఇలా చేయండి.

ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలకు పరిష్కారం తెలియజేస్తున్నాం.
పై సమస్యలు ఏర్పడటానికి ప్రధాన కారణం కొన్ని పోషకాల లోపం అని చెప్పవచ్చు. ప్రధానంగా విటమిన్ డి, ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి మూలకాలు లోపిస్తే ఈ సమస్యలు కలుగుతాయ.

అధిక ఒత్తిడితో కూడిన శారీరకశ్రమ చేసే వాళ్లకు కూడా ఈ సమస్య కలుగుతుంది. అధిక స్థూలకాయం సమస్యతో బాధపడే వారికి ఇవి కలుగుతాయి. మీ శరీరంలో మంచి నీటి శాతం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఇన్ని రకాల నొప్పుల సమస్యలు కలుగుతాయి.

అంటే నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ కలిగితే, కండరాల్లో నీటిశాతం తగ్గిపోయి కండరాలు పట్టుకొని పోయి నొప్పుల సమస్యలు మొదలవుతాయి.

కాబట్టి మీ శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మూలకాల లోపం కలగకుండా ఉండడానికి కొన్ని రకాల చిట్కాలను మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ పదార్థాలను మీ రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

మొదటిది అరటిపండు:-

మీ రోజువారి ఆహారంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సినది అరటిపండు. ఎందుకంటే అరటి పండు నుండి పొటాషియం అధికంగా లభిస్తుంది. కాళ్ళు మరియు చేతుల్లో వచ్చే నొప్పులను ఈ పొటాషియం నివారిస్తుంది కాబట్టి రోజు కు వీలైతే రెండు అరటి పళ్ళు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

రెండవది ఉడికించిన బంగాళదుంప:- ఇది కూడా అనేక రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మూడవది పాలకూర:- ఈ ఆకుకూర ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. మరియు పాలు, పాలతో తయారుచేసిన పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి రోజు భోజనం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెగ్నీషియం, పొటాషియం మరియు ఐరన్ బాగా అందుతుంది.

ముఖ్యంగా మీరు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఇంకా బాదంపప్పు, అవిసె గింజలు, నల్ల నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లో పొటాషియం మరియు కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి వీటిని తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి.

పైన తెలియజేసిన వాటన్నింటిని ఏదో ఒక రూపంలో వాడుతూ ఉండాలి. మీ ఎముకలు మరియు నరాలు బలంగా తయారుకావటానికి ఈ క్రింది చిట్కాలు పాటించండి.

కావలసిన పదార్థాలు:- తెల్ల నువ్వులు మరియు అవిసె గింజలు. ఈ రెండింటినీ సమానంగా తీసుకుని, 100 గ్రాముల తెల్ల నువ్వులు మరియు 100 గ్రాములు అవిసె గింజలు తీసుకుని పెనంలో దోరగా వేయించుకోవాలి. వీటిని నేరుగా ప్రతిరోజు తప్పనిసరిగా తినాలి.

ప్రతిరోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వీటిని ఒక రెండు చెంచాలు తినడం అలవాటు చేసుకోవాలి.
ఒకవేళ మీరు కాల్షియం లోపించిన సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ రెండింటిని పెరుగుతో కలుపుకుని తినాలి.

లేదా మధ్యాహ్న భోజనం తిన్న రెండు గంటల తర్వాత కూడా వీటిని తినవచ్చు. వీటి వల్ల మీకు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది.

మరొక చిట్కా:-

కావలసిన పదార్థాలు:- అర చెంచా మెంతులు, దాల్చినచెక్క. అర చెంచా మెంతులు ఒక గ్లాసు నీటిలో వేయాలి, ఒక ఇంచ్ సైజు లో ఉన్న దాల్చిన చెక్క ను ఈ నీటిలో వేయాలి. ఆ రాత్రంతా ఈ రెండింటిని నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపునే ఈ నీటిని తాగుతూ మెంతులను మరియు దాల్చిన చెక్కను నేరుగా నమిలి తినాలి.

ఈ విధంగా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో మనం తీసుకునే దాల్చినచెక్క వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. శరీరం యొక్క వాత దోషాలను దాల్చినచెక్క తొలగిస్తుంది.

డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలను నియంత్రిస్తుంది. శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ ని దాల్చిన చెక్క తగ్గిస్తుంది. అధిక ఊబకాయ సమస్య అంటే ఒబెసిటీ తో బాధపడుతున్న వారు ఈ మెంతులు మరియు దాల్చిన చెక్క ను తప్పనిసరిగా తీసుకోవాలి.

చివరి చిట్కా:- ప్రతి రోజు నిద్ర పోయే ముందు గోరువెచ్చని పసుపు కలిపిన పాలను తాగితే కాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలకు సంబంధించిన నొప్పులు తగ్గిపోతాయి. ఈ పసుపు నొప్పులు మరియు వాపులను తొలగిస్తుంది. ఎందుకంటే పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఈ పై చిట్కాలన్నీ క్రమం తప్పకుండా వాడితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి చిట్కాలను మీరు తప్పనిసరిగా 15 రోజుల పాటు వాడితేనే దాని యొక్క గుణం మీకు కనిపిస్తుంది.

అయితే మెంతులు మరియు దాల్చిన చెక్క ఏడు రోజులపాటు వరుసగా తీసుకుంటే మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఈ చిట్కాలు పాటిస్తే మీ శరీరంలో వచ్చే దాదాపు 70 నుంచి 80 రకాల రోగాలను కూడా తగ్గించు కోవచ్చు.

ఇది కూడా చదవండి :- ఇలా చేస్తే చాలు, మీ అధిక బరువు మొత్తం ౩౦ రోజుల్లో దిగిపోతుంది !