స్త్రీలను అత్యధికంగా బాధపెట్టే సమస్య పీరియడ్ సమస్య. ప్రధానంగా ఈ సమస్యలో అధికంగా బ్లీడింగ్ కావడం. సంతానం కలుగకుండా కావడం. రుతు క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం. ఎండోమెట్రిక్ అనే సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా చాలా వరకు దూరదృష్టితో బయటపడవచ్చు.
ఎండోమెట్రిక్ సమస్యలో ప్రధానంగా గర్భాశయ గోడల మీద ఫైబ్రస్ తయారవుతాయి. ఇలా జరిగినప్పుడు గర్భధారణ జరగకపోవచ్చు. కాబట్టి ఎండోమెట్రియాసిస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, స్త్రీలు వారి జీవనశైలిని మార్చుకుని మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఈ సమస్యను తొలగించుకోవచ్చు.
ఏ ఆహార పదార్థాలు ఎండోమెట్రియాసిస్ కారణం:-
- ఫ్యాట్ ఫుడ్స్ ,డాల్డా, ఆయిల్ వంటివి అధికంగా ఉపయోగించడం.
- ఫ్రోజెన్ ఫుడ్ తీసుకోవడం.
- పిజ్జా బర్గర్లు వంటి బేకరీ ఫుడ్స్ తీసుకోవడం.
- నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం ఇందులో ముఖ్యంగా రెడ్ మీట్ అధికంగా తినడం.
- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం.
స్త్రీలలో ఈ ఎండోమెట్రియం వల్ల నెలసరి పీరియడ్స్ ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది.
ఈ విధంగా రక్తాన్ని అధికంగా కోల్పోయి ఎనీమియాకు గురి అవుతారు.
నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:-
- ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి బీటా-కెరోటిన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి
- తప్పనిసరిగా, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆకుకూరలు తీసుకోవాలి.
- కాలిఫ్లవర్ కాడలను అధికంగా తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి.
- అందుబాటులో ఉంటే గోధుమగడ్డి రసాన్ని అధికంగా తాగాలి.
- గోధుమ గడ్డిని మీరే స్వయంగా పెంచి దాని రసాన్ని తీసుకుంటే తక్కువ కాలంలోనే రక్తం బాగా పెరుగుతుంది.
- విటమిన్ E మరియు విటమిన్ C అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినాలి.
- పొద్దుతిరుగుడు విత్తనాలు, జామకాయలు అధికంగా తినాలి.
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలు తినాలి.
- అవిసె గింజల్లో ఇవి అధికంగా లభిస్తాయి. వాల్నట్స్ నాన పెట్టుకొని తినాలి. అవిసెగింజలతో కారం పొడి చేసుకొని తినవచ్చు.
- కూరల్లో క్రమం తప్పకుండా పసుపు వేసుకుని తినాలి.
- హై ఫైబర్ , లో కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు తీసుకోవాలి
- కూరగాయలు అధికంగా తినాలి.
- మొలకెత్తిన గింజలు తినాలి.
- పసుపులో నేచురల్ గా కర్క్యుమిన్ అనే రసాయనం ఉండటం వల్ల ఎండోమెట్రియం వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
- ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చైనాలోని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లు దీన్ని నిరూపించారు.
ఆవనూనె లోకి కర్పూరం వేసి ఈ మిశ్రమాన్ని పొత్తికడుపు మీద పట్టు లాగా లేకపోతే పూత లాగా పూయాలి. - వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాలి. పొత్తి కడుపులో నొప్పి తగ్గుతుంది. నెలసరి సమస్యలు తొలగిపోతాయి.
- మెడిటేషన్ మరియు ప్రాణాయామం చేసుకోవాలి.
ఇవి కూడా తెలుసుకోండి :-
- డోలో 650 టాబ్లెట్ ఎలా వాడాలి ? ఉపయోగాలేంటి ?
- హైఫెనాక్ పి టాబ్లెట్ ఉపయోగాలేంటి ? ఎందుకు వాడాలి ?
- అజిత్రోమైసిన్ 500 mg టాబ్లెట్ ఉపయోగాలు