పుట్టు మచ్చల శాస్త్రం అంటే ఏమిటి !

0
పుట్టుమచ్చల శాస్త్రము

పుట్టు మచ్చల శాస్త్రం | Puttu Machala Sasthram In Telugu

పుట్టుమచ్చల శాస్త్రము :- పుట్టు మచ్చలు అనేవి మన పుట్టుకతోనే మనకి వస్తాయి. మరికొన్ని మచ్చలు మనం పెరిగే కొద్ది వస్తాయి. పుట్ట మచ్చలు ఉండటం వల్ల కొంత మందికి అదృష్టం కలిసి వస్తుంది మరికొందరికి అదృష్టం కలిసి రాదు. ఈ పుట్ట మచ్చలు నల్లగా, కాఫీ రంగు లేదా గోధుమ రంగులో ఉంటాయి.

పుట్ట మచ్చలు వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది. మరికొందరికి మచ్చల వల్ల చెడు జరుగుతుంది. పుట్ట మచ్చలు అనేవి సహజంగా ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికి పుట్టు మచ్చలు ఉంటాయి.

మగవారికి, ఆడవారికి  పుట్టు మచ్చలు ఉండటం వల్ల పుట్టు మచ్చల శాస్తం ఏమి చెప్పుతుంది తెలుసుకుందాం.

పుట్టు మచ్చల శాస్తం గురించి | Puttu Macha Sasthram Telugu Lo

మానవ జీవితమునకు సంబంధించి శుభం, అశుభములను ముందుగా తెలియజేసే సాస్త్రములు చాల ఉన్నాయి. అవి జోతిషము, చిలక శాస్త్రము, సంఖ్యా శాస్త్రము, పుట్టు మచ్చల శాస్త్రము హస్త సాముద్రికము, పాద సాముద్రికము. వాటిలో పుట్టు మచ్చల శాస్త్రము ఒకటి.

మానవ శరీరముపై ఏ స్థానంలో పుట్టు మచ్చ వున్నదో దానిని పట్టి  మగవారికి, ఆడవారి  జీవితములో జరిగిన లేదా జరగబోవు శుభ, అశుభములను తెలియ చేస్తుంది. ఇదే పుట్టుమచ్చల శాస్త్రము. ఈ శాస్త్రం పురాతనమైన.

వ్య‌క్తుల స్వరూప స్వభావాలను తెలుప‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను వహిస్తుంది. శరీరంపై  కనిపించే ఈ పుట్టు మచ్చలు అందంన్ని పెంచడంతో పాటు, ఈ పుట్టు మచ్చలు అదృష్టంతో పాటుగా దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయి.

కొన్ని పుట్టుమచ్చలు ఆడవారికి, మగవారికి  ఒకే ఫలితాన్ని ఇస్తాయి, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు, వేరు  ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని పుట్టు మచ్చల శాస్త్రం చెబుతోంది.

మాన‌వ శరీరంపై  కొన్ని ప్రదేశాల్లో  పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది అని.

ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి. ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టు మచ్చలు శ్రీమంతులు అవుతారు అని చెప్పబడుతున్నది.

ఇకపై మూడో భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవ‌కాశం ఉంటుంది. మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు.

ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతూర్యం ఉంటుంది. సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. సంసారాన్ని సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు.

మూడో భాగానికి ముందు వైపున పుట్టుమచ్చ ఉంటె ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వీరికి సంపాదనే కాకుండా సంతానమూ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇక మాడుకు వెనుక వైపున పుట్టుమచ్చ ఉంటె పేరు ప్రతిష్ఠలకన్నా డబ్బు గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. భార్యపై ప్రేమానురాగాలే కాదు, ఇతర వ్యామోహాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి.

సంపాదనకు లోటు ఉండకపోవడంవల్ల వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు. ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వలేదు అని చెప్పవచ్చు ఈ విధముగా పుట్టు మచ్చల శాస్త్రం చెప్పుతుంది.

పుట్టు మచ్చలు మగవారికి ఎటువైపు ఉండాలి | Puttu Macha Sasthram For Male In Telugu 

పుట్టు మచ్చలు మగవారికి ఎటువైపు ఉండాలి అనేది తెలుసుకుందాం. ఎటువైపు ఉంటె  సంపద కలిసివస్తుంది. ఎటువైపు పుట్టు మచ్చలు ఉంటె కష్టపడాలి అనే అన్ని విషయాలను చర్చిద్దాం.

మగవారికి తలలో పుట్టుమచ్చలు కలిగి ఉంటె :- పురుషునికి తలలో పుట్టుమచ్చలు కలిగినవారికి గర్వము ఎక్కువ. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకం గా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారు, రాజకీయ, సామాజిక అంశాలలో మంచి శ్రద్ధ‌ కలిగి ఉంటారు . పురుషుల నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు.

పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే:- పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. అలాగే బంధుప్రియుడవుతాడు. ఆహరం అంటే ఇష్టపడుతారు.

పురుషుల నుదుటి కింది భాగంలో మచ్చ ఉంటే :- మగవారికి నుదుటి కింది భాగంలో మచ్చ ఉంటే వారు మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు. కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

పురుషుల ముక్కుపై పుట్టు మచ్చ ఉంటే :- పురుషుల ముక్కుపై మచ్చ ఉంటే వారు క్రమశిక్షణ ఉండరు. చెవికి చెందిన ఏ భాగము లో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజం లో గౌరవం తో కూడిన గుర్తింపు ఉంటుంది.

మగవారికి పెదవిపై పుట్టు మచ్చ ఉంటే :- పురుషులకి పుట్టు మచ్చ పెదవిపై ఉంటే వారు కొన్నిసార్లు బంధువులు, స్నేహితుల విషయంలో ఈర్ష్య కలుగుతుంది. అలాగే చెంప పై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు.

పురుషులకి గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉంటె :- మగవారికి గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉంటె వారు ఉదారగుణము కలిగి ఉంటారు. ఆడ వారితో మర్యాద పూర్వకంగా నడుచుకొంటారు. జీవితంలో మంచి అదృష్టవంతులుగా మారుతారు.

భుజంపై పుట్టు మచ్చ ఉంటే :- పురుషులకి రెండు భుజంపై పుట్టు మచ్చ ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

ఎడమ చంక భాగంలో :- మగవారికి ఎడమ చంక భాగంలో పుట్టు మచ్చ ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కుడి చంక భాగంలో మచ్చ ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు. మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు.

శరీరం ముందు భాగంలో :- మగవారికి శరీర ముందు భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారికి ఆకస్మిక ధన లాభం లభిస్తుంది. అదే శరీరం వెనుక భాగంలో పుట్టు మచ్చ ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు వేరేవారికి దక్కుతుంది.

కుడి కనుబొమ్మ మీద మచ్చ ఉంటె :- పురుషులకి కుడి కన్నుబొమ్మ మీద మచ్చ ఉన్నవారికి వివాహము తొందరగా అవుతుంది. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. అలాగే వాహన సౌఖ్యము లభిస్తుంది. ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు.

ఆడవారికి పుట్టుమచ్చలు ఏ భాగంలో ఉండాలి | Puttumachalu Sasthram For Female    

స్త్రీలకి శరీర భాగంలో పుట్టు మచ్చలు ఏ భాగంలో ఉండాలి ఏ భాగంలో ఉండరాదో తెలుసుకుందాం.

ఆడవారికి భుజం పై పుట్టు మచ్చ ఉంటె :- స్త్రీల భుజాలపై పుట్టుమచ్చ ఉండటం కూడా శుభసూచకంగా పరిగణించబడుతుంది. వారి జీవితంలో అన్ని భౌతిక ఆనందాలను పొందుతారు. ఖరీదైన దుస్తులను ఇష్టపడతారు.

స్త్రీలకి చేవిలోపల మచ్చ ఉంటె :- చెవిలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అదృష్టవంతులు. వారు చాలా ప్రతిభావంతులు, తెలివైనవారు. వారికి నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి. జీవిత నిర్ణయాలను చక్కగా తీసుకుంటారు.

మహిళలకి కుడి లేదా ఎడమ కనుబొమ్మ మీద మచ్చ ఉంటె :- కనుబొమ్మ మీద పుట్ట మచ్చ ఉంటె వారికి వివాహం కూడా ఒక ధనవంతుడితో అవుతుంది. అలాగే కుడి లేదా ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు జీవితంలో చాలా డబ్బు, కీర్తిని పొందుతారు. వారికి చాలా అదృష్టం కూడా వస్తుంది.

గమనిక :- పైన ఇచ్చిన  information మాకి అందిన ఇంటర్నెట్ సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే, దీన్ని మీద సందేశాలు ఉంటె కామెంట్ పెట్టండి తప్పకుండ రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-