పుట్టు మచ్చలు శాస్త్రం ప్రకారం మగవారికి పుట్టు మచ్చలు ఎటువైపు ఉండాలి !

0
పుట్టు మచ్చలు మగవారికి ఎటువైపు ఉండాలి

మగవారికి పుట్టు మచ్చలు శాస్త్రం ప్రకారం ఎటువైపు ఉండాలి | Puttu Macha Sasthram For Male In Telugu 

పుట్టు మచ్చలు మగవారికి ఎటువైపు ఉండాలి :- పుట్టు మచ్చలు ఆడ, మగ అనే తేడాలేకుండా అందరికి మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. పుట్టు మచ్చలు అందరికి వారు జన్మించినపుడే వస్తాయి, మరికొన్ని మచ్చలు వయసు మధ్యలో ఏర్పడుతాయి. అయితే పుట్టు మచ్చలు మగవారికి ఎటువైపు ఉండాలి. ఎటువైపు ఉంటె మంచి జరుగుతుంది, ఎటువైపు ఉంటే చెడు జరుగుతుంది. అనే అన్ని విషయాలు పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం.

పురుషులకి శరీరంలో పట్టు మచ్చలు ఏ వైపు ఉండాలి | Puttu Macha Sasthram For Male

పుట్టు మచ్చలు మగవారికి ఎటువైపు ఉండాలి అనేది తెలుసుకుందాం. ఎటువైపు ఉంటె ధనం కలిసివస్తుంది. ఎటువైపు పుట్టు మచ్చలు ఉంటె చెడు జరుగుతుంది. అనే అన్ని విషయాలను చర్చిద్దాం.

శరీరం ముందు భాగంలో :- మగవారికి శరీర ముందు భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారికి ఆకస్మిక ధన లాభం లభిస్తుంది. అదే శరీరం వెనుక భాగంలో పుట్టు మచ్చ ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు వేరేవారికి దక్కుతుంది.

కుడి కనుబొమ్మ మీద మచ్చ ఉంటె :- పురుషులకి కుడి కన్నుబొమ్మ మీద మచ్చ ఉన్నవారికి వివాహము తొందరగా అవుతుంది. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. అలాగే వాహన సౌఖ్యము లభిస్తుంది. ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు.

ఎడమ చంక భాగంలో :- మగవారికి ఎడమ చంక భాగంలో పుట్టు మచ్చ ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కుడి చంక భాగంలో మచ్చ ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు. మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు.

భుజంపై పుట్టు మచ్చ ఉంటే :- పురుషులకి రెండు భుజంపై పుట్టు మచ్చ ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

పురుషులకి గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉంటె :- మగవారికి గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉంటె వారు ఉదారగుణము కలిగి ఉంటారు. ఆడ వారితో మర్యాద పూర్వకంగా నడుచుకొంటారు. జీవితంలో మంచి అదృష్టవంతులుగా మారుతారు.

 నాలుకపై పుట్టు మచ్చ ఉంటె :- పురుషులకి నాలుకపై మచ్చ ఉంటే వారు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. గడ్డంపై పుట్టు మచ్చ ఉంటె ఆడ, మగ వారిలోఒకటే ఫలితాలు ఉంటాయి.

మగవారికి పెదవిపై పుట్టు మచ్చ ఉంటే :- పురుషులకి పుట్టు మచ్చ పెదవిపై ఉంటే వారు కొన్నిసార్లు బంధువులు, స్నేహితుల విషయంలో ఈర్ష్య కలుగుతుంది. అలాగే చెంప పై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు.

పురుషుల ముక్కుపై పుట్టు మచ్చ ఉంటే :- పురుషుల ముక్కుపై మచ్చ ఉంటే వారు క్రమశిక్షణ ఉండరు. చెవికి చెందిన ఏ భాగము లో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజం లో గౌరవం తో కూడిన గుర్తింపు ఉంటుంది.

పురుషుల నుదుటి కింది భాగంలో మచ్చ ఉంటే :- మగవారికి నుదుటి కింది భాగంలో మచ్చ ఉంటే వారు మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు. కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మగవారికి తలలో పుట్టుమచ్చలు కలిగి ఉంటె :- పురుషునికి తలలో పుట్టుమచ్చలు కలిగినవారికి గర్వము ఎక్కువ. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకం గా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారు, రాజకీయ, సామాజిక అంశాలలో మంచి శ్రద్ధ‌ కలిగి ఉంటారు . పురుషుల నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు.

పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే:- పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. అలాగే బంధుప్రియుడవుతాడు. ఆహరం అంటే ఇష్టపడుతారు.

గమనిక :- పైన పేర్కొన సమాచారం మాకి అందిన ఇంటర్నెట్ సహాయంతో మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. మీకు పుట్టు మచ్చల మీద సందేశాలు ఉంటె తప్పకుండ మీరు పండితుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-

  1. పుట్టు మచ్చల శాస్త్రం అంటే ఏమిటి !
  2. పుట్టు మచ్చలు వాటి ఫలితాలు !