ఇలా తింటే ఇక జన్మలో పైల్స్ రమ్మన్నా రానే రావు !

0
పైల్స్ తగ్గాలంటే ఏం చేయాలి
piles remedies telugu

పైల్స్ తగ్గాలంటే ఏం చేయాలి | Piles Thaggalante Emi Cheyali 

చాల మంది మొలలు రావడం వల్ల బాధపడుతుంటారు. పైల్స్ తగ్గాలంటే ఏం చేయాలి ? అని గూగుల్ లో చాల వెతుకుతున్నారు. ఈ ఆర్టికల్ లో మనం పైల్స్ ని ఆహార పదార్థాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

ఈ పైల్స్ తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకొంటారు. మొలలు రావడం వల్ల కొన్ని ఆహర పదార్థాలను కూడా తినరాదు. అవి : చికెన్, గుడ్డు, గట్టిముద్ద మొదలైనవి.

మారిపోయిన జీవన శైలి అస్తవ్యస్తంగా ఉన్న ఆహారపు అలవాట్లు వల్ల మలం సరిగ్గా రాకపోవడం ద్వారా కొంత మంది మొలలతో బాధపడుతున్నారు. ఈ మలబద్దకంతో మలవిసర్జన సాఫిగా జరగక మలద్వారం వద్ద రక్త నాళాలు పగిలి మలంతో పాటుగా రక్తం కూడా బయటకి వస్తుంది. ఈ సమస్యనే పైల్స్ అంటారు.

దీని వలన ఆ ప్రేదేశంలో ఎక్కువ నొప్పి, మంట, రక్తస్రావం ఉంటాయి. ఒక్కొకసారి ఈ సమస్య మొదలు అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.

  • ఈ సమస్యకి ముఖ్యకారణం జంక్ ఫుడ్.
  • నీరుతక్కువగా త్రాగడం.
  • ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఈ మొలలు వస్తాయి.

మొలలు అంటే ఏమిటి | Piles Ante Enti

మలద్వారం లోపల సున్నితమైన రక్త నాళాలు ఉంటాయి. మూత్రానికి వెళ్లేప్పుడు గట్టిగా ఒత్తిడి చేస్తే.. అవి పిలకల్లా బయటకి వస్తాయి. వాటినే మొలలు లేదా పైల్స్ అంటారు.

మొలలు ఎందుకు వస్తాయి | piles Endhuku Vasthayi 

  1. ఒకే చోటు ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వస్తుంది.
  2. మానసిక ఒత్తిడి, మద్య సేవనం వల్ల కూడా మొలలు వస్తాయి.
  3. నీరు తక్కువగా తాగినా, మాంసాహారం, జంక్ ఫుడ్ అతిగా తిన్నా పైల్స్ వస్తాయి.
  4. మలవిసర్జన సమయంలో ఎక్కువగా ముక్కేవారికి మొలలు ఏర్పడతాయి.
  5. మలబద్దకం సమస్యతో బాధపడేవారిలోనూ పైల్స్ ఏర్పడవచ్చు.
  6. గట్టిగా దగ్గేవారిలో కూడా మొలలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
  7. పైల్స్ నీలం, ఎరుపు, తెలుపు, ఊదా రంగులలో ఉంటాయి.

పైల్స్ తగ్గించడానికి తీసుకోవలసిన ఆహర పదార్థాలు ఏమిటి ? 

  1. ఎక్కువ  నీటిని తీసుకోవడం  
pails treatment in telugu
మంచి నీరు పైల్స్ కి దివ్య ఔషదం లాంటిది

పైల్స్ తగ్గాలంటే, నీరు అధికంగా తీసుకోవాలి. 8 నుండి 10 గ్లాసుల నీరు ప్రతిరోజూ త్రాగాలి, ఫ్రెష్ పండ్ల రసాలు, వెజిటబుల్ సూప్ మొదలైనవి పైల్స్ నివారణకు సహయంచేస్తుంది.

2. అంజిర పండు 

పైల్స్ అంటే ఏమిటి
అంజూర్ piles కి బెస్ట్ food

ఒక గ్లాస్ తీసుకొని అందులోకి నీరు పోసుకొని, అందులోకి అంజిర పండు వేసుకొని ఒక రాత్రి అంత నాన పెట్టి ఉదయం లేవగానే పరగడుపునే తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది.

3. అరటి పండు 

పైల్స్ నివారణ
అరటి పండు పైల్స్ కి చాల మంచిది

అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి వారానికి నాలుగు సార్లు భోజనం తిన్న తర్వాత అరటిపండు తినండి. ఇలా తినడం వల్ల పైన్స్  నుండి ఉపశమనం పొందవచ్చు.

4. ఫ్రెష్ పండ్లు 

మామిడి, నిమ్మ, బొప్పాయి, ఫిగ్, మొదలైన పండ్ల రసాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం లేకుండా చేసుకోవచ్చు.  కాఫీ వంటి కేఫైన పదార్ధాలు వాడరాదు. నిమ్మ, బెర్రీలు, ఛీస్ పెరుగు, ఆపిల్స్, టమాటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి.
పైల్స్ నివారణ

5. సోయా బీన్స్ 

బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి. అలాగే మొలాలు నుండి ఉపశమనం పొందవచ్చు.
పైల్స్ పోవాలంటే ఏం చేయాలి

6. ఆకుకూరలు 

పైల్స్ నివారణకై పీచు అధికంగా వుండే ఆహారం తీసుకోండి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. తాజా దొరికే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ తరచూ ఆహారంలో తప్పని సరిగా వుండేలా చూసుకోవాలి. ప్రతి రోజు తాజా ఆకుకూరలు తినడం వల్ల పైల్స్ రాకుండా నివారణ చేయవచ్చు.
మొలలు తగ్గాలంటే ఏం చేయాలి

పైల్స్ లక్షణాలు  

  • మల విసర్జన సాఫీగా జరుగదు.
  • తీవ్రమైన నొప్పి
  • రక్తస్రావం మరియు మంట పుట్టడం
  •  అప్పుడప్పుడు రక్తం పడుతుంది.
  • మల విసర్జన అనంతరం కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉండడం.

మొలలు ఏర్పడినపుడు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి 

  1. మొలలు వచ్చినపుడు శరీరానికి వేడిని కలిగించే ఆహర పదార్థాలను తీసుకోకూడదు.
  2. కారం, మసాలాలు, పచ్చళ్లు, ఊరగాయలు, వేపుళ్లు, చింతపండు, దుంప కూరలకు దూరంగా ఉండాలి.
  3. ఈ వ్యాధి సమస్య ఉంటే పీచు ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కాయగూరలను తినాలి.
  4. నీరు ఎక్కువగా త్రాగడం వల్ల పైల్స్ నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

గమనిక :- పైన  ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుండి సేకరించిన, మాకి తెలిసిన information. మీరు తెలియచెస్తున్నాం. మీకు దీని మీద ఒక అవగాహనా కోసమే తెలియచేస్తున్నం.పైల్స్ వల్ల బాధ పడుతున్న వారు తప్పనిసరిగా వైదుడిని సంప్రదించండి.

FAQ

  1. మొలలు మందులు

జవాబు :- నైట్రిక్‌ ఆసిడ్‌, అలోస్‌, మ్యురాటిక్‌ ఆసిడ్‌, గ్రాఫాయిటీస్‌, మెర్కుసాల్‌, ఫాస్పారస్‌ ఈ టాబ్లెట్స్ ని వినియోగించే ముందుగా వైదుడిని తప్పని సరిగా సంప్రదించండి.

2. పైల్స్ లక్షణాలు

జవాబు :- మల విసర్జన సాఫీగా జరుగదు, తీవ్రమైన నొప్పి కలగడం.

3. పైల్స్ రకాలు

జవాబు :- అంతర్గత పైల్స్, బాహ్య పైల్స్.

4. అంతర్గత పైల్స్ లక్షణాలు

జవాబు :- ఆసన ప్రాంతంలో నొప్పి మరియు దురద రావడం. మలంలో రక్తం రావడం.

5. బాహ్య పైల్స్ లక్షణాలు 

జవాబు :- పాయువు చుట్టూ దురద పుట్టడం, కూర్చున్నప్పుడు నొప్పి లేదా అసౌకర్యంగా కలిగి ఉండటం.

ఇవి కూడా చదవండి :-