బలిజ గోత్రాలు పేర్లు వాటి ఉపకులాలు రకాలు !

0
బలిజ గోత్రాలు

బలిజ గోత్రాలు :- గోత్రాలు అనేవి అందరికి తప్పనిసరిగా ఉంటాయి. ఒక్కొక గోత్రాలకి ఒక్కొక పేరు ఉంటది. ఇప్పుడు బలిజ గోత్రం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైనది బలిజ గోత్రం. ఈ కులము వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో నివస్తున్నారు. ముందుగా మనం గోత్రం గురించి తెలుసుకుందాం.

గోత్రం అంటే ఏమిటి ? 

గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.

హిందువులు అయితే  ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.

బలిజ గోత్రాలను ఏ ప్రాంతంలో ఏవిధంగా పిలుస్తారు 

 1. వీరిని తమిళనాడులో కైరవ, కర్ణాటకలో బనజిగర్ అని అంటారు.
 2. ఉత్తరాదిన “బనియ ” లేదా “వనియా” అనీ అంటారు. ఈ పేర్లన్నీ “వణిజ” అనే మూల సంస్కృత పదము నుండి వచ్చినవి.
 3. వీరినే గౌరీదేవి పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన “బలిజలు” అని పిలువబడినారు, బలిచక్రవర్తి పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు.

బలిజ ఉపకులాలు పేర్లు ఏమిటి 

 1. గాజు బలిజ < తమిళనాడు >
 2. బనజిగ < కర్ణాటక >
 3. బలిజ < రాయలసీమ >

వీరు 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో పిలుచుకొంటారు. కొన్ని ప్రాంతాలల్లో అయితే కర్ణాటక ప్రాంతం వారు “కన్నడ బలిజ”, తమిళ ప్రాంతం వారు “ఆరవ బలిజ”, తెలుగు ప్రాంతం వారు “తెలుగు బలిజ” లేదా “తెలగబలిజ” అని పిలవబడ్డారు.

బలిజ గోత్రం వారిలో అనేక ఉప కులాలపేర్లు, వర్గాలుఇంటి పేర్లు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.

 1. దేశాయిశెట్టి
 2. మహానాటిబలిజ
 3. ముత్యాలబలిజ
 4. రాళ్ళ బలిజ
 5. కండీబలిజ
 6. కొయిలడిబలిజ
 7. మహాజనబలిజ
 8. చిత్రాలబలిజ
 9. పత్తిబలిజ
 10. జనపబలిజ
 11. ఓడబలిజ
 12. వలసబలిజ
 13. పూందమల్లిబలిజ
 14. క్షత్రియబలిజ
 15. తుర్వ బలిజ
 16. తుళువ కవరై
 17. రాహుతబలిజ
 18. ఒప్పనకారబలిజ
 19. ముసుగుబలిజ
 20. రత్నాలబలిజ
 21. తెలగబలిజ
 22. పట్టణశెట్టి
 23. పట్టణస్వామి
 24. వలయాలసెట్టి
 25. గాజులబలిజ
 26. గంధంబలిజ
 27. పువ్వులబలిజ
 28. బలిజిగ
 29. బందరుకవరై
 30. కవరై వడుగన్
 31. లింగమండికవరై
 32. కవరై చెట్టి
 33. రాయదుర్గంబలిజ
 34. కాంచిపురంబలిజ
 35. వక్కలబలిజ
 36. ఉప్పుకవరై
 37. నాయుడు
 38. అరవబలిజ
 39. ఆకుబలిజ
 40. బలిజశెట్టి
 41. బుట్టిబలిజ
 42. పెరికబలిజ
 43. బలిజనాయుడు
 44. దూదిబలిజ
 45. ఏనూటిబలిజ
 46. గవరబలిజ
 47. గండవరంబలిజ
 48. కుల్లూరుబలిజ
 49. గోపతిబలిజ
 50. గోనుగుంటబలిజ
 51. గుగ్గిళ్ళబలిజ
 52. మిరియాలబలిజ
 53. గురుబలిజ
 54. గోరిబలిజ
 55. గౌరబలిజ
 56. గోనిబలిజ
 57. కొండేటిబలిజ
 58. లింగబలిజ
 59. మహతడిబలిజ
 60. నీలిబలిజ
 61. పెదకంటిబలిజ
 62. పాటిబలిజ
 63. పలాసకవరై
 64. పగడాలబలిజ
 65. రాజమహేంద్రవరంబలిజ
 66. శెట్టిబలిజ
 67. తోటబలిజ
 68. తొగరుబలిజ
 69. ఆదిబనజిగ
 70. జైనబణజిగ
 71. సజ్జనబలిజ
 72. లింగాయత బలిజ
 73. దాసబలిజ
 74. విజయనగరంబలిజ
 75. పెనుకొండబలిజ
 76. చంద్రగిరిబలిజ
 77. గంజాముబలిజ
 78. ఓరుగంటిబలిజ

ఇలా ఎన్నో ఎన్నెన్నో బలిజ ఉప కులాలు మహారాష్ట్ర,తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి     ఆంద్ర, ఉత్తరభారతం, శ్రీలంక లలో ఎక్కువగా ఉన్నారు.

గమనిక :- పైన ఇచ్చిన సమాచారం మాకి అందిన information ప్రకారం మీకు తెలియచెస్తున్నాం. ఈ matter కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే పేర్కొనడం జరిగినది. ఈ సమాచారం మీద ఎలాంటి సందేశం ఉన్న కామెంట్ చేయండి తప్పకుండ రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-

 1. తల తిరగడం తగ్గాలంటే ఏమి చేయాలి !