బాలింతలు ఎలాంటి ఆహరం తీసుకోవాలి !

0
బాలింతలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

బాలింతలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు |Balinthalu Elanti A haram Thisukovali 

బాలింతలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు :-మాములు మనిషిగా ఉన్నపుడు ఎలాంటి ఆహరం అయిన తినవచ్చు. ఒక ఆడపిల్ల బాలింతలు అయిన తర్వాత ఏది పడితే అది తినరాదు. తీసుకొనే ఆహార పదార్ధంలో చాల జాగ్రత్త ఉండాలి. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి తప్పనిసరిగా ఆహరంలో జాగ్రత్త పాటించాలి. బాలింతలు ఎలాంటి ఆహరం తీసుకోవాలో తెలుసుకుందాం.

 • గర్భం దాల్చిన తర్వాత డ్రై ఫుడ్, తేనె బెల్లం,  బీట్‌రూట్‌, క్యారెట్ తినాలి వీటిని తినడం ద్వారా కొత్త రక్తం  ఉత్పతి  అవుతుంది.
 • బార్లీ, బ్రౌన్ రైస్ తప్పనిసరిగా తీసుకోవాలి.
 • సీజ‌న్ ఫ్రూట్స్‌, తాజా కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు తీసుకోవాలి. ఆకుకూర‌ల్లో ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర, మెంతికూర‌ త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

లిక్విడ్స్

బాలింతలకి పాలు పడడానికి లిక్విడ్స్ కూడా అవసరం. వీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కూడా లిక్విడ్స్ కావాలి. అందుకే, నీటితో పాటూ జ్యూసులు, సూప్స్, పాలు, మజ్జిగ వంటివి బాగా హెల్ప్ చేస్తాయి.
balintha food telugu


సీజనల్ ఫ్రూట్స్

పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సిజనల్ పండ్లు తినడం ద్వారా  బాలింతలు ఆరోగ్యంగా ఉంటారు.
balintha jagrathalu

కోడి గుడ్డు

ఒక ఎగ్ రోజువారీ ఆహరంలో తీసుకోవడం ద్వారా, మీ శరీరానికి అవసమైన ప్రొటీన్ పొందగలరు. ఇందులో విటమిన్ డీ కూడా ఉంటుంది. బిడ్డ మజిల్స్, బోన్స్ బలంగా ఉండడానికి ఇది చాలా అవసరం.
 బాలింతలు తినే ఆహారం

వెల్లులి 

వెల్లులి తినడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది. పాల ఉత్పత్తి సరఫరాను కూడా ప్రభావితం చేస్తుంది.
బాలింతలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

నువ్వులు 
బాలింతలు నువ్వులు తినడం వల్ల ఇందులో ఇనుము, రాగి, మెగ్నీషియం మరియు కాల్షియం చాలా ఉన్నాయి. ఇవి తల్లిలో ఎనర్జీ లెవల్స్ ను పెంచడానికి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ప్రేగు కదలికలను నియంత్రించడానికి మరియు జీర్ణక్రియకు సహాయపడతాయి.
బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు

మంచి నీరు 

బాలింతలు ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవ్వరాదు. మంచినీళ్ళు బాగా తాగాలి. పండ్లరసాలు ఎక్కువగా  తీసుకోవాలి, బాలింతలు టీ, కాఫీ లాంటివి ఎక్కువ  తాగరాదు.
బాలింతలు ఆహారం

వేరుశెనగ 

వేరు శనగను బాలింతలు తీసుకోకూడదు. ఎందుకంటే వేరుశనగ బిడ్డకు అలర్జీని కలిగిస్తుంది. వీటిలో పోషక విలువలు ఉన్నప్పటికీ బిడ్డకు పాలిస్తున్న తల్లి నట్స్ వంటి ఆహారాలను తీసుకోవడం వలన పిల్లలకు అలర్జీలు వచ్చి ఇబ్బందిని కలిగిస్తాయి.
balintha food

నారింజ 

డిలివరీ అయిన మహిళలకి విటమిన్ సి చాలా అవసరం. ఇది నారింజలో ఎక్కువగా లభిస్తుంది.
నారింజతో పాటు ఇతర సిట్రస్ పండ్లను కూడా తీసుకోవచ్చు. నారింజ జ్యూస్ చేసుకోని తాగితే మంచిది.
బాలింతలు తినే ఆహారం

బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Balinthalu Jagrathalu

బాలింతలు తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలి. అ జాగ్రతలు ఏమిటో తెలుసుకుందాం.

 • బాలింతలు ఎప్పుడు బయట ప్రేదేశాలల్లో ఎక్కువగా గడపరాదు.
 • బాలింతలు చల్లని నీరు త్రాగరాదు, గోరు వెచ్చిని నీరు తీసుకోవాలి, చల్లని నీరు తీసుకొంటే బిడ్డకి జలుబు చేస్తుంది.
 •  వేడి వేడి భోజనం తీసుకోవాలి, రాత్రిది ఉదయం పూట, ఉదయంది రాత్రి సమయంలో తినరాదు.
 • ఎక్కువగా తల సాన్నం చేయరాదు, చేసిన కూడా మీ వెంట్రులని బాగా అరపెట్టుకోవాలి.
 • బాలింతలు పాలలోకి చిటికెడు పసుపు వేసుకొని త్రాగండి, ఇలా త్రాగడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
 • ఎక్కువగా నూనె తయారు చేసిన ఆహర పదార్థాలను తీసుకోకుడదు.
 • ఎక్కువ ఉప్పు, కరంతో కూడిన తినే పదార్థాలను తీసుకోరాదు.
 • బాలింతలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి.
 • పొడి ప్రాంతాల్లో సాధ్యమైనంత ఎక్కువ సేపు నడచండి.
 • భోజనం చేసేముందుగా చేతులని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
 • ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి .
 • ఉదయం పూట, సాయంత్రం సమయంలో కొంత సేపు సూర్యరశ్మికి ఉండాలి.
 • బయట దొరికే ఆహర పదార్థాలను తినకండి.

బాలింతలు చికెన్ తినొచ్చా     

చాలామందిలో బాలింతలు చికెన్ తినొచ్చా అనే డౌట్ ఉంటుంది. చికెన్ తినచ్చ లేదా అనేది కొంత మంది వైదుడిని సంప్రదించి తమకు ఉన్న సందేశాన్ని తీర్చుకొంటారు.

చికెన్ వంటి దానిలో లీన్ మీట్ లో వైటల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి డీ హెచ్ ఏ నీ, ఫ్యాటీ ఆసిడ్స్ నీ ప్రొవైడ్ చేస్తాయి. బిడ్డ నెర్వస్ సిస్టంన్ని బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. చికెన్ తీసుకోవచ్చ లేదా అని మీకు అనుమానం ఉంటె తప్పనిసరిగా వైదుడిని సంప్రదించండి. బాలింతలు చికెన్ తినవచ్చు.

FAQ

 1. డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?

జవాబు :-  జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి, మందు తాగే అలవాటు ఉంటె వెంటనే మానుకోవాలి.

2. బాలింతరాలు ఏమి తినాలి ?

జవాబు :- పాలు, ఫిష్, తాజా ఆకు కూరలు, తాజా పండ్లు.  

3. బాలింతలు చికెన్ తినొచ్చా ?

జవాబు :- తినవచ్చు.

4. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి ? 

జవాబు :- నీరు త్రాగాలి, ఆరంజ్, క్యారెట్, బాదంపప్పు.

5. బాలింతలు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? 

జవాబు :-  పాలు, పెరుగు, మజ్జిగ, డ్రై ఫ్రూట్స్‌, తేనే, బెల్లం, బీట్‌రూట్‌.

గమనిక :-  మాకి అందిన Information అంతర్జాలం నుండి మీకు తెలియచెస్తున్నాం. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసమే. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తప్పనిసరిగా వైదుడిని సంప్రదించండి.

 ఇవి కూడా చదవండి :-