మీరు మధ్యాహ్నం భోజనం లో మజ్జిగ వాడుతుంటారా? అయితే ఇక నుండి దీనిని వాడండి!!
భారతీయులు అందరూ మధ్యాహ్న భోజన సమయంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతూ ఉంటారు.
అయితే చాలామంది పెరుగుకు బదులుగా నీళ్ల మజ్జిగను మధ్యాహ్న భోజనంలో తీసుకుంటూ ఉంటారు. దీనివలన తిన్న ఆహారం తో పాటు మజ్జిగ అన్నం కూడా దానితో కలిసి పోయి కడుపు నిండినట్లు బరువుగానే ఉంటుంది.
దీనివల్ల పెద్దగా ఫలితం లేకపోగా అనేక అనర్థాలు జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు మధ్యాహ్న భోజనంలో నీళ్ల మజ్జిగ బదులుగా పెరుగును వాడటం అలవాటు చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది.
అపోహ:-
చాలామంది మజ్జిగ చలవ చేస్తుంది పెరుగు శరీరానికి వేడి చేస్తుంది అని అపోహపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు ఎందుకంటే పెరుగు ఒంటికి వేడి చేయడం అనేది జరగదు. ఒకవేళ మీరు మజ్జిగ వాడడానికి అలవాటుపడి ఉంటే తీయ్యటి మజ్జిగ కన్నా పుల్లటి మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ నీళ్ల గా ఉన్న పుల్లటి మజ్జిగ మధ్యాహ్న భోజనం తర్వాత విరామ సమయంలో దప్పిక వేసినప్పుడు ఒక గ్లాసు తాగాలి.
పుల్లని మజ్జిగ ఎందుకు తాగాలి?
ఈ పుల్లని మజ్జిగ లో మన శరీరానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు అయిన లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మన జీర్ణ వ్యవస్థ లో భాగంగా పేగులలో రక్షణ వ్యవస్థను పెంపొందిస్తాయి. పేగులలో విటమిన్ బి కాంప్లెక్స్ ను తయారు చేయడానికి దోహదపడతాయి. రోగనిరోధకశక్తిని యాక్టివేట్ చేస్తాయి.
పుల్లని పెరుగే వాడాలి?
ఈ రోజుల్లో చాలామంది ఉదయమే తోడంటు వేసుకుని తీయటి పెరుగును ఆ రోజంతా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇది కేవలం రుచిని మాత్రమే ఇస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనాలను అందివ్వదు. ఎందుకంటే ముందు రోజు రాత్రి తోడంటు వేసుకుని మరుసటి రోజు కొద్దిగా పులిసిన పెరుగు ను ఆహారంగా తీసుకుంటే, అందులో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.
ఒకవేళ పెరుగు మిగిలిపోతే మరల మరుసటి రోజు ఆ పెరుగును వాడితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా పుష్కలంగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఉపయోగపడే సూక్ష్మజీవుల్లో భాగంగా మన శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. కూరలు చేసుకునే టప్పుడు ఉప్పుకు బదులుగా ఈ పుల్లని పెరుగు కూడా వాడితే చాలా మంచిది.
గమనిక:- కేవలం గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వారు మాత్రమే పుల్లని పెరుగు కు బదులుగా నీళ్ల మజ్జిగ లేదా తీయటి పెరుగును వాడుకోవటం మంచిది.
ఇవి కూడా చదవండి :-
- అల్లం తినేవారు ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి
- రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు