ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరి పోయి కోటీశ్వరులు అవుతారు

0
ముక్కోటి ఏకాదశి 2022

జనవరి 13వ తేదీ 2022 వ సంవత్సరం ముక్కోటి ఏకాదశి రాబోతున్నది. ఈ పవిత్రమైన రోజున రావి ఆకులతో మీరు ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ముక్కోటి ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువు కు చాలా ఇష్టమైన పండుగ. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానంగా పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తీసుకోకూడదు, కేవలం పళ్ళు మరియు పాలు మాత్రమే తీసుకోవాలి.

శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుని వాహనం మీద ఉత్తరద్వార యాత్ర వస్తాడు. అప్పుడు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. అందుకే ఈరోజును ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున లక్ష్మీనారాయణ దేవతలను దీపారాధనతో ఆరాధన చేస్తారు. దీని వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి.

ఈరోజున దీపాన్ని వెలిగించే ముందు దీపం కింద ఏదైనా ఆకు నుంచి వెలిగించాలి. లేకపోతే దరిద్రం కలుగుతుంది. దీనికోసం దీపాల కింద రావి ఆకులను ఉంచి దీపారాధన చేస్తే ఎలాంటి దరిద్రం అయినా తొలగిపోతాయి. రావి ఆకు మరియు రావిచెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది.

అందుకు దీపారాధన కంటే ముందు దీపపు ప్రమిదను రావి ఆకులు మీద ఉంచి, దీపారాధన చేస్తే త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు. మరియు సకల శుభాలు కలుగుతాయి. రావి ఆకులు దీపపు ప్రమిద కింద ఉంచేటప్పుడు రావి ఆకు యొక్క కాడ దేవుని వైపుకు మరియు రావి ఆకు చివరిభాగం మనవైపు ఉండేవిధంగా ఉంచి దీపం వెలిగించాలి.

శుభ ఫలితాలు:-

ఇలా చేస్తే రాహు కేతువు దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శరీర బాధలు తొలగిపోతాయి. ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. రావి చెట్టును దేవతా చెట్టుగా భావిస్తారు కాబట్టి, ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణలు చేస్తే చాలా మంచి శుభాలు కలుగుతాయి.

భగవంతుని సేవించిన ఫలితం కలుగుతుంది మరియు ఆయుష్షు పెరుగుతుంది. మోక్షం కలుగుతుంది.
రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుష్షు ఆరోగ్యం బాగా లభిస్తాయి. ప్రధానంగా రావి చెట్టు నుంచి వచ్చే గాలి వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది. రావి చెట్టు ఆకులతో తోరణాలు తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టినట్లయితే ఆర్థిక బాధలు తొలగిపోతాయి.

అయితే ఈ రావి ఆకులతో తోరణాలు ఎండిపోయిన తర్వాత వాటిని తొలగించి కొత్త రావి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకులు తాకి పూజలు చేసినవారికి శని దేవుని అనుగ్రహం కలుగుతుంది.

శనివారం రోజున రావిచెట్టు లో లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది అని పురాణాలు చెబుతాయి. సంతానం లేని స్త్రీలు ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి ఆడవారి పొట్ట చెట్టు కాండానికి తగిలేటట్లు హత్తుకోవడం వల్ల మంచి సంతానం కలుగుతుందని నమ్మకం.

తాజాగా ఉన్న రావి చెట్టు బెరడు తీసి ముక్కలు చేసి నీడలో ఎండబెట్టి, పొడిచేసి ఒక కప్పు నీటిలో వేసుకుని ఉదయం మరియు సాయంత్రం తాగుతూ ఉంటే ఎలాంటి నడుము నొప్పి అయినా సరే మాయమవుతుంది.

ఈ నీటిని తాగుతూ ఉంటే మగవారికి కూడా సంతాన శక్తి పెరుగుతుంది. అందమైన పాదాలు మీ సొంతం కావాలంటే, రావి చెట్టు ఆకులను దంచి రసం తీసి, ఈ రసాన్ని రాత్రిపూట పడుకునే ముందు కాళ్లకు పూతగా రాయాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకే పాదాల పగుళ్లు పోయి ఎంతో అందంగా కనిపిస్తాయి.

రావి చెట్టు బెరడును నీటిలోకి వేసి కషాయం చేసుకుని, ఆ నీటిని పుక్కిలించితే, దంతాలు మరియు చిగుళ్లు బలంగా తయారై, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకు పెద్దలకు మెదడు బలంగా తయారయ్యి మేధాశక్తి పెరుగుతుంది.

రావి చెట్టు చిగుళ్ళను పాలలో వేసి మరిగించి, ఆ నీటిని తాగితే అపారమైన తెలివితేటలు, మేధా శక్తి పెరుగుతాయి. రావి చెట్టు బెరడును నేతిలో అరగదీసి ఆ మిశ్రమాన్ని నోటిలో పూతగా పూస్తే నోటి పూత సమస్య తొలగిపోతుంది.

ఇది కూడా చదవండి :-

  1. 2022 కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉండబోతోంది ..?
  2. బల్లి శాస్త్రం – దోషలేంటి ?
  3. ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.
  4. మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?