మొటిమలు తగ్గించడానికి ఇంటి చిట్కాలు

0

మొటిమలు అనేవి సామాన్యంగా అందరికి రావడం సర్వ సాధారణం. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అందరికి మొటిమలు వస్తాయి. వాటిని నివారణ కోసం మనం ఇంటి చిట్కాలు ద్వారా మనం నివారణ చేసుకోవచు.

మొటిమలు నివారణ కోసం కొన్ని రకాలు  వాడుదాం :-

ఐస్ ప్యాక్ : ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు ఐస్ వాటిని త్వరగా తగ్గిస్తాయి. దీని కోసం ఓ బౌల్‌లో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసి ముఖం అందులో 10 సెకన్ల చొప్పున, రెండు, మూడు సార్లు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. లేదా.. ఓ ఐస్ క్యూబ్‌ని తీసుకుని మొటిమలపై పెట్టాలి. మరి ఇబ్బందిగా అనిపిస్తే ఓ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

శనగపిండి ప్యాక్ : ఓ బౌల్‌లో టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. ఇందులో కాస్తాంత పసుపు, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. అవసరం అనుకుంటే రోజ్‌వాటర్వేసి పేస్ట్‌లా కలపాలి. దీన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి. 15 నిమిషాలు తర్వాత నీటిని చల్లుతూ దాన్ని స్క్రబ్‌లా రాస్తూ నీటితో కడిగేయాలి.

వెల్లుల్లి: మొటిమలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లిని చిదిమి రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.

ఆపిల్ : ఓ ఆపిల్ స్లైస్‌ని తీసుకుని ముఖంపై రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తగ్గుతుంది. మొటిమలకి కారణం జిడ్డు.. కాబట్టి ఇలా చేస్తుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. దీంతో ముఖం కూడా తాజాగా కూడా మారుతుంది.

ఆపిల్ సిడర్ వెనిగర్ :
ఓ కాటన్ ప్యాడ్‌లో రెండు చుక్కల ఆపిల్ సిడర్ వెనిగర్‌ని వేసి మొటిమలు ఉన్న చుట్టు రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. అయితే ఆపిల్ సిడర్ వెనిగర్‌ని ఎక్కువగా ముఖంపై పెట్టడం మంచిది కాదు.. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

ఆయిల్, నిమ్మరసం :వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తుండడం వల్ల బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి.

ముల్తానీ ప్యాక్ :ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ వేసి కలిపి ప్యాక్‌లా వేయాలి. ఆరాక చల్లని నీటితో కడగాలి.

బియ్యం పిండి, పెరుగు మిశ్రమం :బియ్యంపిండిలో కాసింత పెరుగు కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని ముఖంపై వేయాలి. ఆరాక చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

తేనె, దాల్చిన చెక్క పొడి : తేనెలో కాసింత దాల్చిన చెక్క పొడి కలపాలి. పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. మరుసటి చల్లని నీటితో కడగాలి.

టమాట ప్యాక్ : టమాటా మొటిమల సమస్యని చాలా వరకూ దూరం చేస్తుంది.ఇందుకోసం టమాటని సగానికి కట్ చేయాలి.. దానిపై కాస్తా ఉప్పు చల్లి మొటిమలపై రుద్దాలి. దీంతో పాటు టమాట గుజ్జుని ఓ బౌల్‌లో తీసుకుని అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి ఆరాక కడగాలి. ఇలా చేస్తుండడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుంది.

వేప ప్యాక్ :కాసింత వేప ఆకులని తీసుకుని మొత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు, నిమ్మరసం కలిపి ముఖం ఉన్న చోట్ల పెట్టాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. వేప పొడిలో పసుపు, నిమ్మరసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

బొప్పాయి : మొటిమలు ఉన్న చోట పొప్పాయి పండు పేస్ట్‌ని అప్లై చేసి ఆరాక కడగడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. దీని వల్ల ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

అరటిపండుతోనూ :అరటిపండు గుజ్జులోకాసింత శెనగపిండి కలిపి ప్యాక్‌లా ముఖంపై వేయాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తుండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

మొటిమలకి కారణాలు :చాలా సమస్యలకు మన లైఫ్‌స్టైల్ కారణం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫుడ్, నిద్రలేమి, కాలుష్యం, సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ అవుతుంటాయి.

ఫుడ్ :ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్, వేపుళ్లు, చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌ తగ్గించాలి. వీటికి బదులు నీటిని ఎక్కువగా తాగుతూ పోషకాహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తుండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.
నిద్రలేమి సమస్యని దూరం చేసుకోవాలి. నిద్ర లేకపోవడం వల్ల మొటిమలు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి సరిగ్గా నిద్రపోవాలి. ఖచ్చితంగా 8 గంటలు ఉండేలా చూసుకోండి.

కాలుష్యం :కాలుస్యంలో ఎక్కువగా తిరగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి బయటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేస్తుండాలి. అదే విధంగా బయటికి వెళ్లి వచ్చినప్పుడు ముఖాన్ని నీటితో కడగాలి.

ఒత్తిడి : చాలా సందర్భాల్లో ఏదైనా ఒత్తిడిగా ఫీలైనా కూడా సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి.. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

చుండ్రుతలలో చుండ్రు అధికంగా ఉన్నా కూడా మొటిమలు ఎక్కువ అవుతుంటాయి. అలాంటప్పుడు ముందుగా చుండ్రు సమస్యని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం తలకి నిమ్మరసం అప్లై చేస్తుండాలి.