రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు

0
రణపాల ఆకు ఉపయోగాలు
రణపాల ఆకు ఉపయోగాలు

Ranapala aaku upayogalu telugu | రణపాల మొక్క ఆకు ఔషధ గుణాలు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పొలాల దగ్గర కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఉండే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నర్సరీ ప్రాంతాల్లో కూడా ఇది లభిస్తుంది.

  • ఈ మొక్కను దాదాపు 50 రకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.
  • ప్రస్తుత కాలంలో మనిషి ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి లో మార్పులు వంటి వాటి వల్ల అనేక రకాల రోగాలను ఎదుర్కొంటున్నాడు.
  • ఇలాంటి వాటికి అనేక రకాల మెడిసిన్స్ వాడటం కంటే అతి చౌకగా లభించే ఆయుర్వేద శాస్త్రం తెలియజేసిన ఇలాంటి మొక్కలను ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
  • మూత్రపిండాలు మరియు గాల్బ్లాడర్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి రణపాల ఆకు లకు ఉంది.
  • చాలామంది మారిన జీవనశైలి వలన మూత్రపిండాలు మరియు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న కొంతకాలానికి మరల వారిలో ఈ రాళ్ళు ఏర్పడే సమస్య మొదలవుతుంది.

ఈ సమస్యకు చిట్కా

ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం రెండు రణపాల ఆకు లను నమిలి మింగి ఆకు యొక్క పిప్పిని తీసివేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి. ఇలా వాడితే మూత్రపిండాల్లో ఉండే అతి పెద్ద సైజు రాళ్ళు కూడా కరిగిపోతాయి. అదేవిధంగా గాల్బ్లాడర్లో ఏర్పడే రాళ్లు కూడా ఈ ఆకు రసం వల్ల కరిగిపోతాయి.

క్యాన్సర్ చికిత్స

ప్రతి రోజు రణపాలఆకులు నమిలి మింగడం వల్ల క్యాన్సర్ బారిన పడినవారు త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు రక్త క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.

శరీరంలో ఎలాంటి క్రిములు చేరకుండా ఈ రణపాల ఆకులు సహాయం చేస్తాయి.
రణపాల ఆకు లను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు ఒక చిటికెడు నీటిలో వేసుకుని తాగడం వల్ల, వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది.

ఊపిరితిత్తులకు చికిత్స

కాలుష్య ప్రాంతాల్లో నివసించే వారికి ఊపిరితిత్తుల్లో జిగట స్వభావం పెరిగిపోతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో కావలసినంత ఆక్సిజన్ చేరదు. ఇందుకోసం రణపాల ఆకు రసాన్ని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితం లభిస్తుంది. లేదా రణపాల ఆకు రసాన్ని తేనే తో కలిపి తీసుకోవచ్చు.

నొప్పులకు చికిత్స

శరీరంలో వచ్చే అనేక రకాల నొప్పులకు ఈ ఆకులను పేస్ట్ గా నూరి, ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో పూతగా పూస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.

మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మరియు తలనొప్పి లు ఉన్నటువంటి వారు ఈ ఆకులను పేస్ట్ గా నూరి అందులో పసుపు కలిపి నొప్పి ఉండే భాగంలో పట్టుగా వేస్తే అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి.

పక్షవాతానికి చికిత్స

పక్షవాత రోగులలో శరీరంలో ఏదో ఒకవైపు వారికి రక్తనాళాలు గూడుకట్టుకుని పోయి ఉంటాయి.
వీరు ఈ రణపాల ఆకు లను తీసుకుంటే తప్పకుండా రక్త ప్రసరణ వ్యవస్థ అభివృద్ధి చెంది త్వరగా పక్ష వాతం నుండి కోలుకుంటారు. దీని కోసం ఎలాంటి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు.

రణపాల ఇతర ప్రయోజనాలు

  • నోటి దుర్వాసనను పోగొడుతుంది.
  • నాలుక యొక్క అరుచిని తొలగిస్తుంది.
  • కంటి వ్యాధులను దూరం చేస్తుంది.
  • మొలలు వ్యాధులకు సంబంధించి , రెండు రణపాల ఆకు లకు రెండు లేదా నాలుగు మిరియాలు కలిపి నమిలి మింగితే మొలలు వ్యాధి తగ్గిపోతుంది.
  • మలబద్ధకాన్ని తొలగిస్తుంది.

గమనిక:- రణపాల ఆకు ఒక భాగాన్ని భూమిలో గాని, ఇసక లో గాని ఉంచితే 15 నుండి 20 రోజుల్లో కొత్త ఆకులు పుట్టుకొస్తాయి. కాబట్టి ఎక్కడైనా అతి సులువుగా పెరిగే ఈ మొక్కలను మీ ఇంటి పెరట్లో పెంచుకుని ఈ ఆకులను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.

ఇవి కూడా చదవండి :-

  1. ఓమిక్రాన్ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇంట్లో ఈ పొగ పెట్టండి
  2. తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
  3. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  4. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి