Table of Contents
శ్రీనిధి లోన్ వివరాలు 2023
శ్రీనిధి లోన్ అనేది పేద కుటుంబాలకు పెన్నిది.ఇందులో తక్కువ వడ్డికే రుణాలు అందిస్తారు. ఇందులో ముఖ్యంగా పేద మహిళలకు రుణాలు మంజూరు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే నిరుపేద ప్రజల కోసం ఏర్పడినదే ఈ శ్రీనిధి లోన్.
ఈ శ్రీనిధి యొక్క ముఖ్య లక్ష్యం పేదరిక నిర్మూలన. పేదవారికి అవసరం అయినప్పుడు తక్కువ వడ్డికే ఇందులో రుణాలు ఇస్తారు. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మండల మహిళా సమాఖ్యలచే SHG మహిళలకు జీవనోపాధికి ఫైనాన్స్ అందించడానికి ఏర్పడినది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక రుణ పరపతి సంఘం.
మహిళలు గ్రూపులలో చేరి నెలనెల కొంచం పొదుపు చేసుకొంటూ ఈ శ్రీ నిధి లోన్ ని పొందవచ్చు. ఇందులో లో నుంచి తీసుకున్న రుణంతో కిరణా కోట్లు, ఫాన్సీ షాపులు, గొర్రెల పెంపకం.టైలరింగ్, వంటివి పెట్టుకొని పేద ప్రజలు లబ్ది పొందుతున్నారు.
శ్రీనిధి లోన్ అర్హత
- ఫ్రెండ్స్ మీరు ఈ శ్రీనిధిలో లోన్ పొందాలంటే మీరు ఖచ్చితంగా shg గ్రూప్లో సభ్యులై ఉండాలి.
శ్రీనిధి లోన్ కు కావాల్సిన పత్రాలు
- మీరు మొదటిసారి ఇందులో రుణం పొందుతున్నట్లయితే ఒప్పంద పత్రం కావాలి.
- ఆధార్ కార్డు.
- పాన్ కార్డ్
- పాస్ పోట్ సైజ్ ఫోటోలు
- బ్యాంకు అకౌంట్
శ్రీ నిధిలో రుణం ఏ ఏ వాటికీ పొందవచ్చు ?
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ శ్రీ నిధి సంస్థ వేటికి మనకి రుణం ఇస్తుందో తెలుసుకుందాం.
- వ్యవసాయం
- పాడి,పశువులకు
- చేనేత కార్మికులకు
- మీరు చేస్తున్న బిజినెస్ ని అభివృద్ధి చేసుకోవడానికి
- ఆరోగ్యం
- విద్య
- పెళ్ళి మొదలైన వాటికీ ఇందులో రుణం మంజూరు చేస్తారు
శ్రీ నిధి లోన్ వడ్డీ, మంజూరు
- ఈ సంఘలలో ఉన్నటువంటి మహిళలకు ఈ శ్రీ నిధి లోన్ ద్వారా 50,000 నుంచి 1,00,000 వరకు రుణం ఇస్తారు.
- వడ్డీ రేటు 11.75 % ఉంటుంది.
- మీరు రుణం అప్లై చేసిన 40 గంటల్లో రుణం మంజూరు చేస్తారు.
- చదువు కోసం రుణం అప్లై చేస్తే 25,000 వరకు ఇస్తారు.
- ఆరోగ్యం కోసం రుణం అప్లై చేస్తే 15,000 ఇస్తారు.
- ఇందులో భీమ ప్రీమియం కూడా ఉంటుంది. దీని వల్ల రుణం కి సంధించిన వాటిలో వేటికైనా అనుకోనిది జరిగితే హెల్ప్ చేస్తారు.