శ్రీ రామనవమి పూజ విధానం (sree rama navami puja vidhanam) :ఈ నెల లో ఏప్రిల్ 10 2022 రాబోతున్న శ్రీ రామ నవమి పండుగ లో చేసే ప్రత్యేక పూజ గురించి మరి ముఖ్యమైన శ్రీ సీతా రాముల కళ్యాణం గురించి తెలియ చేస్తున్నాను.
అలాగే పాటించ వలసిన పూజ నియమాలు, తప్పకుండ చేయవలసిన కొన్ని నియమాలు మరియు ఏమి చేస్తే మనకు పుణ్య ఫలం వస్తుంది. ఈ విధంగా పండుగా రోజు ముందుగా లేచి చక్కగా తలంటు స్త్నానం చేసి, ఇంటిని శుబ్రం చేసుకొని, పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని విగ్రహములు శుబ్రం చేసుకొని ఉంచు కోవాలి.
మొదటగా సీత రాముల వారి ప్రత్యేకత గురించి తెలుసుకొందాం :
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.
మరి ముఖ్యమైన శ్లోకం శ్రీరామ్ నవమి నాడు పటిస్తే మనకు శుబం కలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తూ శివుడు పార్వతి దేవి పాటించిన శ్రీ రామ శ్లోకం పవిత్రతకు చిహ్నం.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
హిందూ మతం లో ని విశ్వాసాల ప్రకారం సీత మహా లక్ష్మి అవతారం. విష్ణు అవతారమైన శ్రీ రామ ధర్మపత్ని.
పూజ చేయు విధానం :
మొదటగా ఒక పసుపు వస్త్రాన్ని పరుచు కోవాలి. పసుపు వస్త్రం ఎందుకంటే శ్రీ రామునికి పసుపు వస్త్రం అంటే ఇష్టం కనుక అలాగే దాని పైన శ్రీ సీతా రామా లక్షణ అంజనేయుని విగ్రహములు అన్ని కలిపి ఒకే విగ్రహములో ఉంటె మంచిది. లేదంటే రాముడు సీత ఉన్న ఫోటో ఉంటె పెట్టుకొన్న మంచింది. అలేగే మీరు అభిషేకం చేసుకొంటే మంచిది.
అలేగే స్వామి వారికీ వస్త్రం యజ్ఞోప విధాలుగా పత్తి ఒత్తిని రెండు విధాలుగా చేసి సమర్పిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా తొమ్మిది దీపాలు ఉంచాలి ఎందుకంటే శ్రీ రామ నవమి పేరులో నే తొమ్మిది ఉంది కనుక మనం తప్పకుండ దీపాలు ఉంచాలి.
ఉగ్గాది రోజున తొమ్మిది వసంత నవరాత్రులు చేయలేని వారు శ్రీ రామ నవమి రోజు తొమ్మిది దీపాలు పెట్టుకొంటే చాల మంచిది. అల చేస్తే మీకు పుణ్య ఫలం మరియు పూజ ఫలం లబిస్తుంది.అలాగే తప్పనిసరిగా పెట్ట వలసినది పిండి దీపాలు శ్రీ మహా విష్ట్నవు యెక్క ఏడవ అవతారం భూమీపై అవతరించినపుడు మధ్యాహ్నం అభిజిత్ లగ్నం లో శ్రీ రామ చంద్రుడు జన్మించాడు.
శ్రీ రాముడు నవమి నాడు జన్మిచాడు కాబ్బట్టి శ్రీ రామ నవమి జరుపుకుంటారు. అదే విధం గా ఈ రోజు శ్రీ సీత రాముల కళ్యాణము జరుపు కొంటారు. అయితే ఈ సంవస్తరములొ శ్రీ రామ నవమి ఏప్రిల్ 9 న వచ్చింది కావున ఈ రోజు శ్రీ రామ పట్టాభిషేకం జరుపు కొంటారు. ఈ విధం గా శ్రీ రామ నవమి చుసిన మేడ్ విధంగా ఇంట్లో పుజించిన కూడా సమస్త అభిష్టాలు చేకురుతాయి అని పెద్దల నమ్మకం మరియు ప్రతితీ.
అలాగే శ్రీ రామ నవమి నాడు శ్రీ రామ అష్టోతర పూజ విధానం అలాగే శ్రీ రామ రక్షా ఎలా చేసు కోవాలి.
తొమ్మిది దీపాలను వెలిగించిన తర్వాత దీపాల పై జవ్వాది పుడిని అన్ని దీపాలలో వదులు తున్నాను.
అలాగే తమల్ పాకు గందంతో శ్రీ రామ అని రాసి లేదా సిందూరం తో రాసి పూజ లో ఉంచాలి. అలాగే తొమ్మిది ఆకుల తో పెట్టిన ఇంకా శ్రేష్టం గా ఉంటుంది. ఈ విధంగా శ్రీ రామ అని వ్రాసిన అంజీనేయుని కతాస్ఖం లభిస్తుంది. అని పురాణాల లో చెబుతున్నారు.
శ్రీ రామునికి తమలపాకులు అంటే చాల ఇష్టం ఈ విధం గా అన్ని అమర్చు కొన్నాక కేశవ నామాలు చదువు కొని ఆచమానం చేయాలి. అలాగే గణపతి పూజ చేసుకోవాలి. ఏ పని మొదలు పెట్టిన గణపతి పూజ తో నే మొదలు చేయాలి.
మా ఇంట్లో మా పూజ లో ఎటువంటి ఆటంకాలు రాకుడని గణపతి స్మరిస్తూ పూజ మొదలు పెట్టాలి.మనం దేవుని దగ్గర పెట్టిన కలశమే కాకుండా ఇంకా ఒకటి కూడా తీసుకోవాలి. ఈ కలశం లో శుదోదక జళం చేయడానికి మంత్రం పుష్పం చెప్పుకోవడానికి వాడతారు. ఈ కలశం లో పువ్వులు, అక్షింతలు పసుపు కుంకుమ ఈ విధం గా అన్ని వేసి కలశ ధారణ చేస్తారు.
కలశ ధారణ అయి పోయాక దేవుడికి ఆవాహనం చెప్పుకోవాలి.అలాగే సింహాసనం, పాద్యం, అగ్ర్యం, ఆచరణం, మధుపర్కం, పంచమృత స్త్ఞానం, శుదోదక స్త్ఞానం,వస్త్రం , ఆభరనని, గందం, పుష్పం, వనమాల, దూపం,దీపం, తాంబూలం, మంత్రం పుష్పం, ప్రదర్శన నమస్కారం, నీరాజం ఈ విధం గ 16 షోడపచారాలు చెప్పుకోవాలి.
ఇవ్వని మీకు రావు అంటే శ్రీ రామ అష్టోత్తర నామం చెప్పుకోవాలి. లేదా శ్రీ రామ రక్షా శ్లోకం చెప్పుకొన్న మంచి పలితం పొందుతారు. ఈ రోజు తప్ప కుండ పెట్టవలసిన నైవేద్యాలు పానకం మరియు వాడ పప్పు పెడతారు. అయితే వడ పప్పు పైన తులసి దళం ఉంచితే మంచింది. తులసి దళాలు ఉంచి నప్పుడే మనం పెట్టిన నైవేద్యానికి ప్రతి ఫలం ఉంటుంది.
అష్టోత్తర శ్లోకం చెప్పుకొనే సమయం లో తులసి దళాలు వేస్తూ స్మరణ చేయాలి. అలాగే స్వామి వారికీ తాంబూలం లో రెండు అరటి పళ్ళు కానీ వేరే పండ్లు మరియు ఆకులు మరియు వోక్కలు ఉంచాలి.అలాగే స్వామి వారికీ కమల పండ్లు పెడితే చాల మంచిది. ఈ విధం గా పానకం మరియు వాడ పప్పు ఎంత ముఖ్యమో అదే విధం గా కమల పండ్లు అంతే శ్రేష్టం.
ఈ విధం గా శ్రీ రామ శ్లోకం చెప్పుకోవాలి.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
అదే విధం గా ఈ పూజ లో ముఖ్యంగా కామాక్షి దీపం పెట్టడం మరిచి పోకూడదు. ఈ విధం పూజ అంత అయిపోయాక శ్రీ రామ అష్టోత్తర శతనామావళి శ్లోకం మరిచి పోకుండా చదువు కోవాలి. శ్రీ రామ శ్లోకం స్మరిచే సమయం లో తులసి దళాలు తెల్లని పువ్వులు తో శ్రీ రామ అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలి.
అ తర్వాత సీత అష్టోత్తర శతనామావళి చెప్పుకొన్న తర్వాత మంత్రం పుష్పం వేస్తూ ఆచమనం చేయాలి.
రాముడు ద్వాపర యోగం లో జన్మించాడు కాబటి విష్ణు మూర్తి అవతారం కాబటి విష్ణువు కు తులసి దళాలు ఇష్టం కావున తులసి దళాల తో శ్లోకం చెప్పు కోవాలి. అలాగే సీత అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మ వారి అష్టోత్తర శతనామావళి చదువుతూ మల్లె పూలు మరియు జాజి పూలు తో స్మరణ చేయాలి.
అ తర్వాత్ ,ముఖ్యమైన శ్రీ రామ రక్ష స్తోత్రం చదువు కోవాలి. శ్రీ రాముడు మన వెంట ఉండి అన్ని పనుల లో విజయం చేకురుస్తారని చాల మంచి నమ్మకం గా ఉంటుంది. చివర గా పూజ లో మంగళ హరత్తి ఇవ్వడం మరిచి పోకూడదు. మంగళ హారతి శ్లోకం చదివి పూజ ముగించాలి.
ఇవి కూడా చదవండి :-
- 2022 లో వచ్చే మన తెలుగు పండుగలు మీ కోసం..
- శ్రీ రామ నవమి రోజు ఏప్రిల్ 10 న ఈ ఒక్క మాట మనసులో తప్పకుండ అనుకోండి.