Table of Contents
సొరకాయ జ్యూస్ ఉపయోగాలు | Sorakaya Juice Benefits In Telugu
సొరకాయ జ్యూస్ ఉపయోగాలు :- మనం నిత్యం ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఇది అనేక పోషకాలను కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సొరకాయలను మనం నిత్యం వంటకాలలో, స్వీట్ల తయారీలో వాడుతుంటాం.
అయితే సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా అనేక పోషకాలను కలిగి ఉన్న సొరకాయను రెగ్యులర్ గా తీసుకోవడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకొందం.
సొరకాయ జ్యూస్ ప్రయోజనాలు | Sorakaya Juice Uses In Telugu
సోరకాయలో దాదాపు 96 శాతం నీళ్ళు ఉంటాయి, కబ్బాటి జ్యూస్ చేయడానికి చాల సులభంగా ఉంటది. ఈ సొరకాయ వలన విటమిన్ సి, విటమిన్ డి, సోడియం, జింక్, ఐరన్, పొటాషియం పొందవచ్చు.
అలాగే తక్కువ ప్యాక్ తక్కువ కొలస్త్రాల్ ఉంటది. అందుకే ఈ కొలస్త్రాల్ జ్యూస్ అందరికి చాల ఇష్టం. అయితే సొరకాయలో ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మరింత మంచిది. అయితే సొరకాయను ప్రతిసారీ కూర, సాంబార్ గా వండుకుని తినీ తినీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఈసారి సొరకాయను జ్యూస్ రూపంలో అదికూడా అల్లం కలిపి తీసుకుంట. టేస్ట్ తోపాటు, ఆరోగ్యం కూడా ఉంటది.
బరువు ని తగ్గిస్తుంది :- ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను న్యాచురల్ గా మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది.సొరకాయలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చు. వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది.
శక్తినిస్తుంది :– తీవ్రమైన అతిసార, మధుమేహం, కొవ్వు అధికంగా ఉన్న, వేయించిన పదార్థాలు తినడం వల్ల సంభవించే విపరీతమైన దాహానికి మంచి విరుగుడుగా సొరకాయ పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. అలసటపాలు కాకుండా ఈ జ్యూస్ తీసుకోవడం వలన కాపాడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది :-
ఈ న్యాచురల్ హెల్త్ జ్యూస్ లో ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది :-
సొరకాయ, అల్లం జ్యూస్ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సొరకాయలో జింక్ ఉంటుంది, ఇది బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
జీర్ణాశయన్ని మెరుగుపరుస్తుంది :-
ఈ న్యాచురల్ జ్యూస్ లో యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి.. జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలుంటాయి. దీనివల్ల ఎసిడిటీ, కాన్ట్పిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది.
బరువుని తగ్గిస్తుంది :-
ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను న్యాచురల్ గా మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది.సొరకాయలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చు.
వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది.
- సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.
- సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు.
- సొరకాయ జ్యూస్ త్రాగడం వలన మంచి నిద్రపడుతుంది.
- జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది.
- ఈ జ్యూస్ తాగడం వలన సిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది.
సొరకాయ వలన ఉపయోగాలు | Sorakaya Uses In Telugu
- సొరకాయ కూర లైంగికశక్తిని కూడా పెంపొందిస్తుంది. పిల్లల కడుపులో పాముల్ని పోగొడుతుంది.
- సొరకాయ కూడా పురుషులలో వీర్యవృద్ధినీ, లైంగిక శక్తిని పెంచుతుంది.
- సొరకాయ కూరను చాలామంది పథ్యం కూరగా భావిస్తారు. కానీ తరచుగా తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
- ఇది శరీరంలో వేడిని, కఫాన్ని తగ్గిస్తుంది, దప్పికను నివారిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
- హృదయ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం. దీనితో పాటు శొంఠి పొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకుంటే పడని వారికి జలుబు చేయదు.
- సొరకాయ గింజలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. సొరకాయ ముదురు గింజలను వేయించుకుని, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి, కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే పురుషులకు చాలా మంచిది.
సొరకాయ జ్యూస్ ఎలా తయారు చేయాలి | How To Make Sorakaya Juice
- ముందుగా సొరకాయ పై తొక్క తీసేయాలి.
- ఆ తర్వాత సొరకాయను ముక్కలుగా చోసి మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ జ్యూస్‌ని వడగట్టాలి.
- ఈ రసాన్ని గ్లాసులోకి తీసుకుని డైరెక్ట్‌గా తాగవచ్చు.
- లేదంటే కొద్ది గా నిమ్మరసం, రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలిపి తీసుకోవచ్చు.
సొరకాయ జ్యూస్ ప్రతి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తాగాలి. కనీసం 6 వారాల పాటు ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక :- ఈ జ్యూస్ మీరు తీసుకొనే ముందు డాక్టర్ ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-