ఆపిల్ జ్యూస్ ఉపయోగాలు, ఆపిల్ జ్యూస్ వలన ఎలాంటి లాభాలు ఉన్నాయి !

0
ఆపిల్ జ్యూస్ ఉపయోగాలు

ఆపిల్ జ్యూస్ ఉపయోగాలు | uses of apple juice 

ఆపిల్ జ్యూస్ ఉపయోగాలు :- ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇది మనకు ఏ సీజన్‌లోనైనా దొరుకుతుంది. యాపిల్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి.

సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. అందుకే, ఆపిల్ జ్యూస్ లో కూడా అదేకే పోషకాంశాలు ఉన్నాయని మనం తెలుసుకుందాం. మరియు ఆపిల్లోనే కాదు, ఆపిల్ జ్యూస్ లో కూడా టాప్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆపిల్ జ్యూస్ వలన లాభాలు ఏంటో తెలుసుకొందం.

ఆపిల్ జ్యూస్ ప్రయోజనాలు | Uses Of Apple Juice

ఆపిల్ జ్యూస్ రుచికరంగానే కాకుండా, ఇది సహజ సిధమైన రస ద్రవ్యం, శరీరానికి కావలసిన విటమిన్స్, పోషకాలను సమకూరుస్తుంది. రోజు ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్ జ్యూస్ వల్ల కలిగే ఉపయోగాలు.

కంటి చూపును వృద్దిచేస్తుంది :- ఆపిల్ జ్యూస్ కంటిచూపును అభివృద్ది చేస్తుంది. ఆపిల్ జ్యూస్ విటమిన్ ‘A’ని కలిగి ఉండటం వలన కంటికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచి కంటి చూపును వృద్ధి చేస్తుంది.

జీర్ణక్రియని పెంచుతుంది :-ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ వలనuses of apple , మూత్రపిండాలు, కాలేయానికి హాని కలుగ చేసే విష పదార్థాలను తొలగించి శుభ్రపరుస్తుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను శుభ్రపరచి, జీర్ణక్రియ రేటుని పెంచి, కాలేయానికి, ముత్రపిండాలకు హాని కలుగ చేసే వాటిని తొలగిస్తుంది.

గుండెకి అపాయం:-ఆపిల్ జ్యూస్ పైటో-నుట్రీఎంట్స్ వంటి చురుకైన కారకాలను కలిగి ఉండటం వలన గుండెపోటు వంటి ప్రాణాంతకర వ్యాధులను కలిగించే వాటి నుండి కాపాడుతుంది. రోజుకి ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నిషేదించి, గుండెకి వచ్చే గుండెపోటును రాకుండా చేస్తుంది.

శక్తిని ఇస్తుంది:-శరీరానికి కావలసిన విటమిన్ ‘A’, ‘C’,’E’,’K’ మరియు ‘ఫోలేట్’ వంటి శక్తిని విడుదల చేసే కారకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆపిల్ పండులోని అన్ని భాగాలు ఉపయోగపడేవే, దాని పైన ఉన్న తోలు కూడా. అందువలన ఇది సరైన శక్తిని ఇచ్చే ద్రవం.

క్యాన్సర్:-  ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ వల్ల, కోలన్, చర్మ, బ్రెస్ట్ కాన్సర్’ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆపిల్ జ్యూస్ ఎక్కవగా ఉపయోగకరమైన కారకాలను కలిగి ఉండటం వల్ల, ఆనారోగ్య పరిస్థితులలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది:- తాజాగా ఉండే ఒక గ్లాసు ఆపిల్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల వయస్సైన వారిలో ఇది చిత్తవైకల్యంను తగ్గిస్తుంది. ఇంకా ఆపిల్ జ్యూస్ మెదడు వృద్ధాప్యం తగ్గిస్తుంది మరియు ఎక్కువ కాలం చురుకుగా ఉంచుతుంది.

ఆపిల్ వలన ఉపయోగాలు | Uses Of Apple 

ఆపిల్ తినడం వలన,  ఆపిల్ లో ఉండే విటమిన్ సి ఉంటుంది అందుకే ఇది ఒక ఆంటియాక్సిడెంట్ లాగా పని చేస్తుంది.ఆపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదల కి దోహద పడుతుంది. ఇంతే కాకుండా ఆపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల రోగాలు రాకుండా సహాయ పడుతుంది, ఒక మీడియం ఆపిల్ లో 95 కెలోరీలు ఉంటాయి.

శరీరం లోని కొవ్వు ని తగ్గిస్తుంది :-మనలో చాలా మంది జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు ఫలితంగా శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఇలా పెరిగిన కొవ్వు గుండె పోటు కి కూడా దారి తీయవచ్చు. ఆపిల్ తినడం వల్ల శరీంలో మరియు రక్తం లోని కొవ్వు నియంత్రణలో ఉంటుంది.

మలబద్దకం సమస్యలు :- కొంత మందికి మలం సరిగా రాదు, వచ్చినట్లు అనిపిస్తుంది కాని రాదు ఇలాంటి వారు ఆపిల్ తిన్నట్లైతే మలబద్దకం సమస్య ఉండదు. ఆపిల్ లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్  శరీరంలో జీర్ణ సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది.

జీర్ణ సమస్యలు :- రోజు ఒక ఆపిల్ పండు తినడం వలన హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే గ్యాస్ట్రిక్ అల్సర్ జీర్ణాశయంలో కలిగే పుండు నుంచి కాపాడుతుంది. ఇదే కాకుండా శరీరంలో ఏర్పడే మ్యుటేషన్స్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడే అవకాశాలు ఉన్నాయి.

ఆస్థమా  :- మనం తినే ఆహారంలో సరైన మోతాదులో అంటి యాక్సిడెంట్ లు లేకపోవటం వల్ల ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. 68,535 మహిళలపై చేసిన ఒక పరిశోధన లో ఆపిల్ పండు ఆస్థమా తీవ్రతను తగ్గించినట్లు గమనించటం జరిగింది. 31 గ్రాముల కన్న ఎక్కువగా ఆపిల్ తిన్న వారిలో ఆస్థమా వచ్చే అవకాశాన్ని 10 % తగ్గించింది.

మెదడు తీరుని మెరుగుపరుస్తుంది :- చిన్న పిల్లలు ఏదైనా చూసిన విన్నా త్వరగా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది,కాని అదే వయసు పై బడిన వారి లో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గి పోతూ ఉంటుంది కానీ ఆపిల్ తినే వారిలో మాత్రం మెదడు కి సంభందించిన రోగాల నుండి కాపాడుతుందని చెప్పొచ్చు.

ఎముకల సామర్థ్యం :-

మన వయసు పెరిగే కొద్దీ మన ఎముకల సామర్థ్యం తగ్గుతుంది, నేల పై కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది అందుకే చాలా మంది కుర్చీల పైనే కూర్చోవడానికి ఇష్టపడతారు. ఎముకలను దృడంగా ఉంచుకోవడానికి రోజు ఒక ఆపిల్ తినడం వలన ఎములకు శక్తినిస్తుంది.

క్యాన్సర్ నివారణ :- ప్రపంచంలో మనుషుల చావుకు కారణమయ్యే వ్యాధులలో కాన్సర్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మంచి డైట్ మరియు  పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు కాన్సర్ నుంచి కాపాడే అవకాశాలు ఉన్నాయి.  ఆపిల్ పండు పెద్ద ప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం :-ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది. ఈ కాలంలో ఎక్కువ మోతాదులో మనుషులు చనిపోయే వ్యాధులలో గుండె కు సంబంధించిన వ్యాధి ఒక పెద్ద కారణం అని చెప్పవచ్చు. మన డైట్ లేదా రోజు మనం తినే ఆహార పదార్థాలు కూడా గుండె కు సంబంధిన వ్యాధులలో పెద్ద పాత్రను పోషిస్తాయి.

ఆపిల్ జ్యూస్ తయారీ విధానం | How To Prepare Apple Juice In Telugu

  • ముందుగా రెండు ఆపిల్ ను తీసుకోండి.
  • తీసుకొన్న తర్వాత ఆపిల్ ని బాగా కడగండి.
  • కడిగినక ఆపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని జార్ లోకి వేసుకొని గ్రాండ్ చేయండి.
  • ఆపిల్ అంత రసం అయ్యినక అందులోకి ఒక గ్లాస్ పాలు, కొద్దిగా తేనె, ఐస్ ముక్కలు వేసుకొని ఇంకోసారి గ్రాండ్ చేయండి.
  • చేశాక ఆ జ్యూస్ ని  ఒక గ్లాస్ లోకి వేసుకొని కొంత సేపు ఫ్రీజ్ లో ఉంచిన తర్వాత మీరు ఈ జ్యూస్ ని తాగవచ్చు.

  ఇవి కూడా చదవండి:-