ఈ లక్షణాలు ఉంటే గర్భం ఉన్నట్టు అని మీకు తెలుసా ?

0
ప్రెగ్నెన్సీ తెలుసుకోవడం ఎలా
గర్భం లక్షణాలు

ప్రెగ్నెన్సీ తెలుసుకోవడం ఎలా ? గర్భధారణ లక్షణాలు | Pregnancy symptoms in telugu

ఈ గతరం అమ్మాయిలు ఎక్కువగా ప్రెగ్నెన్సీ తెలుసుకోవడం ఎలా ? అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మీ అన్ని ప్రశ్నలకు ఈ పోస్ట్ లో జవాబు దొరుకుతుంది.

కొంత మందికి గర్భం ఉందో లేదో అని కొన్ని మార్గాల రూపాల్లో తెలుసుకోవచ్చు.ప్రతి నెలా ఠంచనుగా రావాల్సిన పీరియడ్ మిస్ అవ్వగానే డౌట్ వస్తుంది. మార్నింగ్ సిక్నెస్ కూడా మొదలవగానే కంఫర్మ్ అవుతుంది.

వీటిని ఫస్ట్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. అయితే, ఇవే కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కనపడతాయి. మీరు ప్రెగ్నెంట్ ఏమో అని మీకు అనుమానంగా ఉంటే ఈ క్రింది లక్షణాలు మీకు కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

జనరల్ గా వీటి గురించి ఎవరూ చెప్పరు. అందరికీ ఈ లక్షణాలు ఉంటాయన్న రూలూ లేదు. అయినా, తెలుసుకుని ఉండడం ఎప్పుడూ మంచిదే కదా.

Pregnancy lakshanalu in telugu | గర్భం ప్రారంభ లక్షణాలు

డిశ్చార్జ్ : ప్రెగ్నెన్సీ మొదట్లో వజైనల్ డిస్ఛార్జ్ కామనే. కానీ మొదటి మూడు నెలల్లో చాలా మందికి యెల్లోయిష్-వైట్ కలర్ లో డిస్ఛార్జ్ అవుతుంది. ఇది హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల జరుగుతుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి కూదా.

ఎక్కువసార్లు టాయిలెట్ : తల్లి కాబోతున్న వారికి బాత్రూం కి వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. యుటెరస్ బ్లాడర్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. యుటెరస్ పద్దదవుతున్న కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది.

బాడీ టెంపరేచర్ : బాడీ టెంపరేచర్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మరీ జ్వరం వచ్చినంత కాదు కానీ తాకితే కొద్దిగా వెచ్చగా అనిపించవచ్చు. దీంతో పాటూ చెమటలో ముంచేసే హాట్ ఫ్లషెస్ కూడా కామన్‌గానే ఉంటాయి. అందరికీ ఇలా జరగకపోవచ్చు కానీ, జరిగినా కంగారు పడేందుకేమీ లేదు.

క్రాంప్స్ : ప్రెగ్నెన్సీ టైం లో తలనొప్పి నుండీ పీరియడ్స్ టైం లో వచ్చే క్రాంప్స్ వరకూ రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. హార్మోనల్ ఛేంజెస్ వలన అబ్డామినల్ క్రాంపింగ్ కూడా ఎక్స్పీరియెన్స్ చేయవచ్చు.

కళ్ళు తిరగడం : కళ్ళు తిరగడం, నీరసం గా ఉండడం అన్నవి ప్రెగ్నెన్సీ అంతా కనిపించవచ్చు. నీరసం అన్నది కాన్స్టంట్ గా ఉంటుంది. ఇవి మొదటి నెల నుండీ డెలివరీ అయ్యే వరకూ ఉండే అవకాశం ఉంది.

ఫాల్స్ పీరియడ్స్ : మొదటి రోజుల్లో కొద్దిగా స్పాటింగ్ కనిపించవచ్చు. గర్భం పోయిందేమో అన్న ఆందోళన డెఫినిట్ గా ఉంటుంది. అయితే, చాలా సందర్భాల్లో ఇది ఫాల్స్ పీరియడ్ మాత్రమే. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ఫెర్టిలైజ్డ్ ఎగ్ యుటెరస్ లైనింగ్ కి అతుక్కున్నప్పుడు ఒక్కోసారి ఇలా జరగచ్చు. రోజుల తరబడి ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఉన్నా డాక్టర్ ని కంపల్సరీ గా కన్సల్ట్ చేయాలని మర్చిపోకండి.

గుండెలో మంట : ఎసిడిటీ, గుండెల్లో మంట అన్నవి కామన్ గా ఎక్స్పీరియెన్స్ చేసే ప్రాబ్లంసే. స్టమక్ లోని యాసిడ్ ఈసోఫేగస్ లోకి లీక్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. కొంచెం కొంచెం గా ఎక్కువ సార్లు తినడం, స్పసీ ఫుడ్ ని ఎవాయిడ్ చేయడం మంచిది.

బ్లోటింగ్ : ప్రాబ్లం కూడా ఇంకొక లక్షణమే. కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ కూడా ఉండవచ్చు. ఫ్లూయిడ్ ఇన్‌టేక్ పెంచడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు. మనసుకీ, శరీరానికి విశ్రాంతినిస్తే ప్రెగ్నెన్సీ కంఫర్టబుల్ గా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు

అయితే, అందరికీ ఇవే లక్షణాలు ఉండాలని లేదు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. వారికి తగ్గట్లుగా ఆ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ లక్షణాలు లేకపోయినా కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మీరు ఇంతవరకు ప్రెగ్నెన్సీ తెలుసుకోవడం ఎలా ? అన్న దాని గురించి చాల వివరంగా తెలుసుకున్నారు కదా. మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించండి. మేము అంతర్జాలం లో దొరికిన సమాచారం ప్రకారం మీకు ఒక అవగాహన కల్పించడానికే ఈ ఆర్టికల్ రాసాము. దయచేసి మరిన్ని డౌట్స్ ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి.