జన్మ నక్షత్రాలు మరియు వాటి రాశులు 2022

0
Janma nakshatra in telugu
Janma nakshatra in telugu

Janma nakshatra in telugu | rasulu in telugu | జన్మ నక్షత్రం తెలుసుకోవడం ఎలా ?

ప్రతి ఒక్కరి భవిష్యత్ జీవితం అనేది వారి యొక్క జన్మ నక్షత్రం మరియు రాశి ఆధారంగా నిర్ణయించబడుతుంది అని పండితులు తెలియజేస్తూ ఉంటారు. ఈ 2022 ఆంగ్ల నూతన సంవత్సరం లో 12 రాశుల వారికి భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది మొదటగా వారి నక్షత్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఇందుకు ఏ రాశికి ఏ నక్షత్రానికి అనుసంధానం ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నాం.

మొత్తంగా 27 నక్షత్రాలు 12 రాశులలో ఇమిడి ఉంటాయి. ఏ రాశి లో ఏ ఏ నక్షత్రాలు ఎన్ని పాదాలు కలిగి ఉంటాయో తెలుసుకుందాం.

1.మేష రాశి

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదాలు,
భరణి నక్షత్రము 1,2,3,4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం.

2.వృషభ రాశి

కృత్తిక నక్షత్రం 2,3,4 పాదాలు, రోహిణి నక్షత్రము 1,2,3,4 పాదాలు, మృగశిర నక్షత్రం 1,2 పాదాలు,

3.మిధున రాశి

మృగశిర నక్షత్రం 3,4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1,2,3,4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1,2,3 పాదాలు.

4.కర్కాటక రాశి

పునర్వసు నక్షత్రం 4 వ పాదం, పుష్యమి నక్షత్రం 1,2,3,4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 1,2,3,4 పాదాలు.

5.సింహరాశి

మఖ నక్షత్రం 1,2,3,4 పాదాలు, పూర్వ ఫల్గుణి నక్షత్రము 1,2,3,4 పాదాలు, ఉత్తర ఫల్గుణి నక్షత్రము 1వ పాదం.

6.కన్యారాశి

ఉత్తర ఫల్గుణి నక్షత్రము 2,3,4, పాదాలు. హస్త నక్షత్రము 1,2,3,4 పాదాలు, చిత్త నక్షత్రం 1,2 పాదాలు.

7.తులారాశి

చిత్త నక్షత్రము 3,4 పాదాలు. స్వాతి నక్షత్రం 1,2,3,4 పాదాలు, విశాఖ నక్షత్రం 1,2,3 పాదాలు.

8.వృశ్చిక రాశి

విశాఖ నక్షత్రం 4 వ పాదం, అనురాధ నక్షత్రం 1,2,3,4 పాదాలు, జేష్ట నక్షత్రం 1,2,3,4 పాదాలు.

9.ధను రాశి

మూల నక్షత్రము 1,2,3,4 పాదాలు, పూర్వాషాడ నక్షత్రము 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాడ నక్షత్రము 1వ పాదం.

10.మకర రాశి

ఉత్తరాషాడ నక్షత్రము 2,3,4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1,2,3,4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1,2 పాదాలు.

11.కుంభ రాశి

ధనిష్ట నక్షత్రం 3,4 పాదాలు, శతభిషం నక్షత్రము 1,2,3,4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 పాదాలు.

12.మీన రాశి

పూర్వాభాద్ర నక్షత్రం 4 వ పాదం , ఉత్తరాభాద్ర నక్షత్రం 1,2,3,4 పాదాలు, రేవతి నక్షత్రం 1,2,3,4 పాదాలు.

పైన తెలియజేసిన విధంగా మీ జన్మ నక్షత్రము మరియు మీ రాశి ఆధారం గా ప్రతి దినం మీయొక్క భవిష్యత్తు కార్యాచరణను తెలుసుకుని మీ యొక్క కార్యకలాపాలు జాగ్రత్తగా కొనసాగించవచ్చు.

ఇది కూడా చదవండి :-

  1. 2022 కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉండబోతోంది ..?
  2. బల్లి శాస్త్రం – దోషలేంటి ?
  3. ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.
  4. మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?