100 crore club telugu movies – తెలుగులో

1
100 Crore crossed Telugu Movies list in telugu 2020

100 Crore crossed Telugu Movies list in telugu 2020

టాలీవుడ్ రంగంలో 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. వీటికి భారీగా కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి, ఎన్ని సెంటర్లు ఆడాయి, హండ్రెడ్ డేస్, 50 డేస్ ఈ లెక్కలన్నీ చూసేవారు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు ! ఎంత కలెక్షన్స్ వచ్చాయి,ఎంత గ్రాస్ వచ్చింది, ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వచ్చింది అని మాత్రమే చూస్తున్నారు.

అయితే ఇప్పుడు మాత్రం కేవలం కలెక్షన్ల కోసం మాత్రమే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం , విదేశాలలో కూడా రిలీజ్ చేయడం చేస్తున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలకు ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు 100 కోట్లు అంతకంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన సినిమాల గురించి తెలుసుకుందాం! చాలామంది సినిమా కలెక్షన్స్ లో గ్రాస్ అనీ, షేర్ అని పేర్కొంటారు. .గ్రాస్ కలెక్షన్ అంటే సినిమాకు మొత్తం వచ్చిన కలెక్షన్. షేర్ కలెక్షన్ అంటే సినిమా విడుదలైనప్పటి నుంచి సినిమా ఖర్చులు పోను మిగిలిన దాన్ని షేర్ కలెక్షన్ అంటారు.

గ్రాస్ కలెక్షన్స్ చాలా సినిమాలకు ఎక్కువగానే వస్తాయి. షేర్ కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువ సినిమాలకు మాత్రమే వస్తాయి. అయితే ఈ కలెక్షన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా లెక్కలోకి తీసుకుంటారు.

100 Crore Telugu Movies List

ఇందులో మొదటగా 2009 సంవత్సరంలో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా చేరింది. ఈ సినిమా fastest 100 crore club movie in telugu. ఈ సినిమా అప్పట్లో నే 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 2011లో మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా కు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 2012లో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ తర్వాత నాని నటించిన ఈగ సినిమాలకు 105 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినవి.

2013లో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కు 130 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. 2014 లో అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం చిత్రానికి 105 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినవి. 2015 లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రానికి 140 కోట్లు. ప్రభాస్ నటించిన బాహుబలి ది బిగినింగ్ సినిమాకు కు ఊహించనంత గా 600 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినవి.

ఇక 2016 లో అల్లు అర్జున్ నటించిన సరైనోడు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలు 125 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. 2017 లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ 110 కోట్ల వరకు, అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం 115 కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చాయి.

ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా కు 125 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు 160 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రభాస్ నటించిన బాహుబలి ది కంక్లూజన్ సినిమాకు దాదాపు 1700 కోట్లు కలెక్షన్ సాధించింది. 2018 లో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన గీత గోవిందం సినిమాకు 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా 140 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకు 150 కోట్లు సాధించింది. రామ్చరణ్ నటించిన రంగస్థలం సినిమా కు 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. 2019లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కు 220 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినవి.

ప్రభాస్ నటించిన సాహో సినిమా కు 400 కోట్ల వరకు, విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 సినిమాకు 130 కోట్ల వరకు, మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కు 160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే 2020లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో చిత్రం ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి.

ఈ రెండు సినిమాలు ఇంకా కలెక్షన్స్ వసూలు చేసే సమయం చాలా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు సినిమాలు 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను సాధించినవి. ఇలా కలెక్షన్ సాధించడం తెలుగు సినిమాలకు శుభపరిణామం. ముందు ముందు ఇంకా చాలా సినిమాలు ఈ వంద కోట్ల క్లబ్బులో చేరుతాయని సందేహం లేదు అని చెప్పవచ్చు.

1 COMMENT