వంద జీవిత సూక్తులు తెలుగులో

0
quotes in telugu life

100 life quote in Telegu వంద జీవిత సూక్తులు తెలుగులో 

Life quotes in Telegu : జీవితములో మనం విజయం సాదించదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, కాని వాటిలో కొన్ని మాత్రమే మనకు సహకరిస్తాయి. మరి కొన్ని మనము ఎంత ప్రయత్నము చేసిన దానిలో విజయము సాదించ లేము. ఇంత మాత్రానికి మనం వెనుక అడుగు వెయ కూడదు.

జీవితములో మన నేర్చుకోవాల్సిన మరియు పాటించ వలసిన సూక్తులు మరియు నియమాలు వీటిని ఎందరో మహానుభావులు వ్రాస్సారు మరియు వారు వీటిని పాటించడం జరిగింది. వాటిలో కొన్నిటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది.

  1. నువ్వు యుద్ధం గెలిచే వరుకు ఏ శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి శబ్దమే వినిపిస్తుంది.
  2. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది.
  3. నీ కోసం చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న.
  4. ముఖం మీద చిరునవ్వు లేకపోతే, అందమైన దుస్తులు వేసుకున్నా.. ముస్తాబు పూర్తి కానట్లే
  5. హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే.. హృదయాన్నే అనుసరించండి.
  6. విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు.
  7. కోపం మాటల్లో ఉండాలి. మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు. మనసులోనూ ఉండాలి.
  8. ఓటమి గురించి భయపడటం మొదలుపెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే.
  9. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, అనందంగా జీవించడం.
  10. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు.
  11. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకొనే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు.
  12. మనకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మనం వృథా చేసిన కాలమే.
  13. మర్యాద ఇవ్వడం వలన ఎవరూ ఏమీ నష్టపోరు.
  14. అత్యాశ లేని వారు అసంతృప్తికి గురికారు.
  15. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు.
  16. మంచితనమే హుందాతనానికి నిదర్శనం.
  17. గొప్ప విజయాలు సాధించాలంటే శ్రమ కూడా ఎక్కువే చేయాలి.
  18. సంతృప్తి ని మించిన సంపద ఉండదు.
  19. తనను తాను జయించుకున్న వ్యక్తి అన్నిటినీ జయిస్తాడు.
  20. ఎవరు అన్ని వేళలా తెలివిగా ఉండరు.
  21. సమయం అదా చేసినవాడు అన్ని అదా చేసినట్టే.
  22. మంచి పనులు అలవాటు కావాలంటే తరచూ చేస్తుండాలి.
  23. కఠోరమైన శ్రమ చేస్తూ పట్టుదలతో ముందుకెళితేనే అనుకున్నది సాధించగలం
  24. వ్యక్తి విలువ పెరిగేది మంచి పనులతోనే కానీ వయస్సు తో కాదు.
  25. అప్పు లేకపోతే ముప్పు లేనట్టే.
  26. నిజం చెబితే ఎప్పుడూ భయపడాల్సిన పని ఉండదు.
  27. చదవడం తెలిస్తే ప్రతి వ్యక్తి ఓ పుస్తకమే.
  28. అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, సుగుణం హృదయాన్ని మెప్పిస్తుంది.
  29. కోరికలు తక్కువున్నవాడే నిజమైన ధనవంతుడు.
  30. పుస్తకాలలో ఉన్న జ్ఞానం, ఇతరుల దగ్గర దాచిన డబ్బు ఈ రెండు అవసరానికి ఉపయోగపడవు.
  31. ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఏ దారిన వెళ్లినా ఒక్కటే.
  32. ఇతరుల గెలుపుని చూసి అసూయ పడనివారే అందరి కంటే ఆనందంగా జీవిస్తారు.
  33. అగ్రగామిగా  నిలవాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.
  34. అస్సలు లేకపోవడం కంటే కొంతైనా ఉండటం నయం.
  35. ఆశయం లేని జీవితం దీపం లేని ఇళ్లు వంటిది.
  36. ఆదర్శవంతమైన జీవితానికి ఉత్తమ గ్రంథాలు ఉత్తమ మిత్రులు ఎంతో అవసరం.
  37. ఏ పనైనా ప్రేమతో చేసి చుడండి అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది.
  38. జీవితంలో బాధపడవలసిన విషయం ఏది లేదు దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం.
  39. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది.
  40. కాలాన్ని వృథా చేయవద్దు ఆ తరువాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది.
  41. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే అడగకపోతే ఆ అజ్ఞానం జీవితాంతం మనలోనే ఉండిపోతుంది.
  42. జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది.
  43. జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం గానీ వ్యక్తిత్వం.
  44. సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది.
  45. ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
  46. వివేకవంతులు గ్రంథాలతో పాటు జీవితాన్నీ అధ్యయనం చేస్తారు.
  47. మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు.
  48. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో.
  49. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయానికి దారులు.
  50. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి.
  51. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లూ వాటంతటవే వస్తాయి.
  52. పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు, మీ అభివృద్ధికి అవే ఆటంకాలు.
  53. విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు.
  54. ఆనందం వస్తువుల్లో లేదు, అది మనసులో ఉంది.
  55. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు
  56. అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు
  57. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి.
  58. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు
  59. ఇతరుల మెదళ్లనూ పనిచేయించగలవాడే మేధావి
  60. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు
  61. మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
  62. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
  63. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
  64. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
  65. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
  66. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.
  67. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.
  68. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.
  69. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.
  70. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.
  71. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.
  72. నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.
  73. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.
  74. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే.
  75. గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.
  76. నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.
  77. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
  78. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
  79. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.
  80. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.
  81. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.
  82. ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం.
  83. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.
  84. ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు.
  85. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు. దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి.
  86. చిరునవ్వును  మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు
  87. అపజయాలు తప్పులు కావు, అవి భవిష్యత్తుకి పాఠాలు.
  88. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు  ప్రయత్నించనిదే విజయము దక్కదు.
  89. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు.
  90. నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
  91. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు.
  92. మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
  93. ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.
  94. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు తెలుస్తుంది.
  95. పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.
  96. ప్రతి మనిషికి ఒక లక్ష్యమంటూ ఉండాలి అది లేకపోతే జీవితం వ్యర్థం.
  97. మనసుంటే మార్గం ఉంటుంది.
  98. అవసరమైతేనే మాట్లాడు.. లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు.
  99. నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది.
  100. సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
  101. మంచి వ్యక్తిగా ఉండండి కానీ దానిని నిరూపించడానికి మీ సమయాన్ని వృధా చేసుకోకండి.
  102. సమస్యలులేని జీవితం,గాలి లేని ప్రదేశం ఉండదు.
  103. మనిషికి కోపం ఉండొచ్చు కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు.
  104. కన్నీళ్ళు కారిస్తే కాదు.చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలరు.
  105. అబద్దానికి అభిమానులు ఎక్కువ,నిజానికి శత్రువులు ఎక్కువ.
  106. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో …దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
  107. అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
  108. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు నిన్ను నువ్వు రూపు దిద్దుకోవడం.
  109. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు.ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని
    ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
  110. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే.అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే.

ఇవే కాక ఇంకా చదవండి