అబార్షన్ కాలపరిమితి పై కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం !

0

గర్భిణీ స్త్రీలు అబార్షన్ చేయించుకునే కాలపరిమితి పై కేంద్రం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.  ప్రస్తుతం 20 వారాల వరకూ ఉన్న సమయంలో మాత్రమే గర్భిణీలు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఉండేది. అయితే ఇక నుంచి ఈ కాలపరిమితిని 24 వారాల వరకు పెంచడం అయినది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించాడు.
ఇక వివరాల్లోకి వెళితే సహజంగా గర్భిణీ స్త్రీలు అవాంఛిత గర్భాన్ని కానీ లేదా డాక్టర్ల సూచన మేరకు గాని అబార్షన్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాల వరకు పెంచడం వల్ల వారి యొక్క పునరుత్పత్తి హక్కులకు రక్షణ కల్పించినట్లు గా ఉంటుందని పేర్కొంటున్నారు.

సహజంగా మొదటి ఐదు నెలల కాలంలో గర్భిణీలు ఆ తర్వాత శారీరక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లి గర్భస్రావం కోసం అనుమతి తీసుకొని రావాల్సి వస్తున్నది. ఈ సందర్భంగా మొదటి ఐదు నెలల కాలం తో పాటు మరో నాలుగు వారాలు కాలపరిమితిని పెంచడం అయినది. అంటే ఎవరైనా గర్భిణీ స్త్రీ అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటే ఇక నుంచి 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని ద్వారా స్త్రీల హక్కులను కాపాడుతున్నామని మంత్రి తెలిపారు.