Adhirindi Saddam Hussein బయోగ్రఫీ తెలిస్తే షాక్ అంతే

0
Adirindi Saddam Biography 2021
Adirindi Saddam Biography 2021

Adirindi Saddam Biography 2021

సద్దాం హుస్సేన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ గ్రామానికి చెందినవాడు. నిజం చెప్పాలంటే సద్దాం హుస్సేన్ కు చిన్నప్పట్నుంచి మెదడు అంత మెచ్యూర్ కాకపోవడం కారణం గా చదువులో పూర్తిగా వెనుకబడిపోయాడు. సద్దాం హుస్సేన్ ఐదవ తరగతి చదువుతున్న సమయంలో ఒక రోజు టీవీలో కామెడీ యాక్టర్ సుధాకర్ ను కోట శ్రీనివాసరావు కొడుతున్నప్పుడు ఆయన ఏడ్చిన ఏడుపు సద్దాం హుస్సేన్ కు నచ్చి ఆ ఏడుపును (అనుకరణ) మిమిక్రీ చేయడం మొదలుపెట్టాడు.

ఇలా సినిమా ల పట్ల ఆసక్తి పెరిగింది అక్కడితో మొదలుకొని అతనికి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయి సినిమా రంగంవైపు ఆసక్తి పెరిగింది. అతను చదువుతున్న చదువు అతని బుర్రకెక్క లేదు కాబట్టి నేను చదువు లో అంతగా రాణించలేక పోతున్నాను నాకు ఎంతో ఇష్టమైన ఈ మిమిక్రీ కోసం సినిమా రంగం వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఒకసారి కర్నూల్లో కాలేజీలో చదివే రోజుల్లో ఒక లెక్చరర్ సద్దాం హుస్సేన్ తో ఇలా అన్నాడు నువ్వు ఇంతే రా నీ జీవితం ఇంతే కాలేజీలో వెల్కమ్ పార్టీలు ఫేర్వెల్ పార్టీలు జరుపుకుంటూ ఉండాల్సిందే అని అన్నాడు.

అప్పుడు సద్దాం హుస్సేన్ ఇలా జవాబిచ్చాడు సార్ మన ఆళ్లగడ్డలో చదువుకున్న వాళ్ళు 50,000 60,000 మంది దాకా ఉన్నారు మరి నా లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి ఒక్కడైనా ఉన్నాడా? అని అన్నాడు.

అందరిలో ఒకడిగా ఉండడం కంటే నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తో నా కోసం ఎదురు చూస్తున్న మరో సినిమా లోకానికి నేను అవసరం ! టాలెంట్ ఉన్న నేను సినిమా రంగానికి అవసరమని అనుకున్నాడు.అందుకే అతను సినిమా రంగం వైపు వచ్చేసాడు సినిమా రంగానికి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచింది.

సద్దాం హుస్సేన్ సినిమా రంగంలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు ఎలాగంటే అతను చదువుకునే రోజుల్లో టీవీలో రక రకాల యాడ్స్ వచ్చే వంట అందులో ముఖ్యంగా సినిమా నటుడు కావాలని ఉందా? డైరెక్టర్ కావాలనుకుంటున్నారా? సంప్రదించండి అని యాడ్స్ వేస్తే ఒకసారి అలా వచ్చిన యాడ్ ని ఫాలో అయి అక్కడ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు.

వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు అని 1000 రూపాయలు కట్టి కట్టిన తర్వాత ఇంటర్వ్యూ కు పంపించారు ఆ గది లో ఉన్న మేడం మీరు డైలాగ్ చెప్పండి అని అడిగితే అప్పుడు వెంటనే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే సద్దాం అని చెప్పాడంట.

అప్పుడా మేడం D గ్రేడ్ వేసిందట ఎందుకు D గ్రేడ్ వేసింది అబ్బా ! నేను యాక్టింగ్ బాగానే చేశానే అని అనుకుని ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళిన తర్వాత సద్దాం కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో మీకు ట్రైనింగ్ ఇవ్వాలి మీకు ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాం సినిమాలో అని చెప్పి ట్రైనింగ్ కోసం కొద్దిగా అమౌంట్, సినిమాలో ఆఫర్ కోసం కొద్దిగా అమౌంట్ కట్టాలి అని అడిగారంట.

అప్పుడు సద్దాం ఆ మేడంతో, మేడం నేను మీ దగ్గరికి వస్తాను నాకు అన్నం పెట్టండి చాలు యాక్టింగ్ ఎలా చేయాలో నేనే మీకు నేర్పుతాను అని అన్నాడంట.
తన టాలెంట్ ఏమిటో తనకు తెలుసు.

సద్దాం హుస్సేన్ చదువుకునే రోజుల్లో మైండ్ మెచ్యూర్ కాక అతనికి చదువు బుర్రకెక్కక లేదు కానీ అతనికి మిమిక్రీ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది ఈ ఆసక్తితోనే మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి లాగాను ANR, NTR, కృష్ణ డైలాగులు చెబుతూ యాక్టింగ్ చేస్తూ నటించేవాడు.

ఎలాగైనా సినిమారంగంలో హీరో కావాలని హైదరాబాద్ కు వచ్చేశాడు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సినిమా రంగంలో ఉండే అన్ని శాఖల్లోనూ ప్రారంభ స్థాయి నుంచి అన్ని రకాల పనులు చేశాడు. క్రమం గా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ యాస భాష లో పంచ్ డైలాగ్స్ చెప్పడంలో మంచి టాలెంట్ సంపాదించాడు.

కేవలం బుల్లితెర మీదనే కాకుండా సినిమా రంగంలో కూడా అతనికి అవకాశాలు వస్తున్నాయి. మొట్టమొదటగా “కళ్ళకు గంతలు కట్టద్దోయ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక పటాస్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే సద్దాం హుస్సేన్ ఈ పటాస్ ద్వారా బాగా సంపాదించాడు పేరు కూడా సంపాదించాడు దేవుడి దయవల్ల ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

పటాస్ లాంటి ప్రోగ్రాం వాటికి ఆడిషన్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మంచి కంటెంట్, మంచిగా ఫ్లో, మంచి పంచ్ డైలాగులు వంటి వాటితో వస్తే ఈ రంగం వారిని తప్పకుండా ఆదరిస్తుంది అభిమానిస్తుంది అని సద్దాం హుస్సేన్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

ఈటీవీ పటాస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సద్దాం హుస్సేన్ తన జీవితంలో యాంకర్ రవి ని ఎప్పటికీ మర్చిపోలేనని, అతను ఇచ్చిన స్ఫూర్తి, ధైర్యం వంటి వాటి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.

ముఖ్యంగా సద్దాం వాళ్ళ ఊర్లో నుండి నెట్ సెంటర్ కి వెళ్లి నెట్ సెంటర్ లో గంట అరగంట కు ఇంత అని డబ్బు కట్టి నెట్ సెంటర్ నుంచి రవి అన్నకు మెయిల్స్ పంపించే వాడట. ప్రస్తుతం గల్లీ బాయ్స్ టీమ్ అందరికీ కూడా రవి అన్న గుండె లాంటి వాడని సద్దాం హుస్సేన్ పదేపదే చెబుతూ ఉంటాడు.

ఈ కాలపు జనరేషన్ యూత్ అందరూ కూడా కామెడీ చూడ్డానికి తహతహలాడుతున్నారు. బుల్లితెర కమెడియన్ సద్దాం హుస్సేన్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ మార్మోగుతున్నది. సామాజిక మాధ్యమాలైన YouTube, Facebook వంటి వాటిని తరచుగా ఫాలో అవుతున్న వారికి బాగా సుపరిచితమైన పేరు సద్దాం హుస్సేన్. సద్దాం తన ప్రత్యేకమైన కామెడీతో తనకే సొంతమైన టైమింగ్ తో బుల్లితెర రంగాన్ని నవ్వులతో ముంచెత్తుతున్నాడు.

ఇటీవలి కాలంలో హైపర్ ఆది తర్వాత బుల్లితెర రంగంలో కామెడీ స్కిట్ లతో రకరకాల ఫీట్లతో సద్దాం హుస్సేన్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నాడు.
జీ తెలుగు టీవీ ఛానల్ లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే అదిరింది అనే కామెడీ ప్రోగ్రాం లో తనదైన ప్రత్యేక శైలిలో గల్లీ బాయ్స్ టీంతో వస్తున్నాడు సద్దాం హుస్సేన్.

Etv జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వచ్చేసి ఈ అదిరింది అనే కొత్త కామెడీ ప్రోగ్రాం కు జడ్జిగా రావడం కూడా ఓ ప్రత్యేకత.కానీ ఈ అదిరింది కార్యక్రమం మొదటి నెల ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు కాని క్రమంగా జడ్జీగా ఉన్న నాగబాబు కొత్తగా టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో గల్లీ బాయ్స్ టీమ్ లీడర్ గా ఉన్న సద్దాం హుస్సేన్ కు ఒక ఛాన్స్ ఇచ్చాడు.

అంతే ఈ ఛాన్స్ ని గొప్ప అవకాశంగా భావించిన సద్దాం హుస్సేన్ అతి తక్కువ కాలంలోనే మిగతా కామెడీ టీమ్ ల కన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఈ విధంగా సద్దాం హుస్సేన్ ఎంట్రీ ఇచ్చి ఈ అదిరింది ప్రోగ్రాం ని ఎక్కడికో తీసుకు వెళ్ళాడు. తనకున్న ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి వచ్చిన సద్దాం హుస్సేన్ మొదటగా ఈ బుల్లి తెర రంగంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రెండు సీరియల్స్ కు ఆర్ట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు.

ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న సద్దాం Etv లో ప్రసారమయ్యే పటాస్ ప్రోగ్రామ్ తో ఒక మంచి కామెడీ ఇమేజ్ సంపాదించాడు.

దీనితో మొదలుపెట్టి Zee TV అదిరింది కామెడీ ప్రోగ్రాం లో తన స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు సద్దాం. ఎలాగంటే YouTube లో అదిరింది ప్రోగ్రామ్ కు వచ్చే మిలియన్ వ్యూస్ ను బట్టి దీన్ని చెప్పవచ్చు. ఏదిఏమైనా బుల్లితెర రంగంలో హైపర్ ఆది తర్వాత సద్దాం హుస్సేన్ ఆ రేంజ్ లో తనదైన స్థాయిలో కామెడీ పంట పండిస్తున్నాడు.

ప్రస్తుత కాలంలో రోజురోజుకు సినిమాలు ఆదరణ తగ్గిపోయి కామెడీ షోలు, వెబ్ సిరీస్ లదే కాలంగా మారిపోతున్నది.

అందుకే భవిష్యత్తులో ఇలాంటి కామెడీ వాళ్లే స్టార్లు అంటే ఎవరు కూడా ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. సద్దాం హుస్సేన్ లాంటి వారు బుల్లి తెర మరియు సినిమా రంగంలో మంచి నటన తో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిద్దాం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. మన తెలుగు వారి కోసం తెలుగు లో ” తెలుగు న్యూస్ పోర్టల్ ” వెబ్సైట్లో మీకు అందరికీ ఉపయోగపడే ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేయండి.మీరు కోరుకున్న ఆర్టికల్ గురించి కింద ఉన్న కామెంట్ బాక్సులో తెలపండి, మేము పోస్ట్ చేస్తాము.

ఇది కూడా చదవండి :

Karthika Deepam Serial Heroine Premi Vishwanath Biography