ala vaikunthapurramuloo collection till now-3 రోజుల్లో 100 కోట్లు ?

0

ala vaikunthapurramuloo collection till now

సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠ పురం లో చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా సందడి చేస్తున్నది. నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్ తర్వాత వస్తున్న బన్నీ చిత్రం అల వైకుంఠపురం లో. అల వైకుంఠపురం చిత్రం ద్వారా బన్నీ సినీ రికార్డులను తిరగరాస్తున్న ట్లు ట్విట్టర్ లో తనే తెలియజేశాడు.

జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నే టాప్ కలెక్షన్ తో చిత్రం ముందంజలో ఉన్నది. ఈ చిత్రాన్ని కంటే ముందే విడుదలైన మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలైన తర్వాత వచ్చిన అల వైకుంఠపురం చిత్రము గొప్పకలెక్షన్స్ని సాధిస్తుండడం తో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అల వైకుంఠ పురం లో చిత్రం ద్వారా దర్శకుడు త్రివిక్రమ్ బన్నీ అభిమానులకు కావలసినంత సందడి చేసే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా గొప్ప విజయాన్ని సాధించారు.

ala vaikunthapurramuloo 2 day collection

ఎంతో భారీ అంచనాలతో విడుదలైన ఆ అంచనాలను వమ్ము చేయకుండా భారీ కలెక్షన్లతో అడుగువేస్తున్నది అల వైకుంఠ పురం లో చిత్రం. రెండు రాష్ట్రాల్లో విడుదలైన అల వైకుంఠ పురం లో చిత్రం విడుదలైన మొదటి రోజునే సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టి నది అని సినీ వర్గాల ద్వారా తెలిసింది. అన్ని సెంటర్లు లోనూ దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుందని పబ్లిక్ టాక్ వచ్చింది.

మార్నింగ్ షో మ్యాట్నీ లతో మొదలుకొని ఈవినింగ్ షో , నైట్ షో ల వరకు గ్రోత్ పెరుగుతూ భారీ కలెక్షన్స్ సాధించింది.
చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డ్ దర్శనమిచ్చాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా సాధించిన 45 కోట్లు కలెక్షన్స్ కాకుండా షేర్ పరంగా చూస్తే 28 నుంచి 29 కోట్లు ala vaikunta puram lo 1st day collection worldwide గా రికార్డులకెక్కింది. షేర్ నిపుణుల అభిప్రాయం పరంగా నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నామని తెలియజేశారు.

ఇక సినీ విమర్శకుల అభిప్రాయం పరంగా సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో ఈ సినిమాకు పల్లెల నుంచి భారీ మొత్తంలో అనేకమంది అభిమానులు పట్టణాలకు వచ్చి సినిమా టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారని తెలియజేశారు.
దీంతో రెండో రోజు కూడా అభిమానులు విజిల్స్ తో థియేటర్లు మార్మోగుతున్నాయి.

ala vaikunta puram lo 2nd day collection worldwide దాదాపు పాతిక కోట్లు లాభం పొందినట్లు తెలుస్తోంది. ఈ బన్నీ యొక్క చిత్రం ఇదే దూకుడుతో ఉంటే భోగిరోజు తో కలుపుకొని దాదాపు వంద కోట్ల భారీ కలెక్షన్స్ సాధించవచ్చునని సినీ అభిమాన వర్గాలు తెలియజేస్తున్నారు. అల వైకుంఠ పురం లో చిత్రం ద్వారా వస్తున్న కలెక్షన్స్ చూసి అభిమానులు, ఫ్యాన్స్ ఖుషి ఖుషి అవుతున్నారు.