అల వైకుంఠ పురం లో కలెక్షన్స్ – బన్ని ఈ ఫీట్ సాధించడం మొదటిసారి

0

ala vaikunthapurramuloo box office

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో చిత్రం రెండు మిలియన్ డాలర్ల క్ల బ్ లో చేరిక. సౌత్ ఇండియా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠ పురం లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతికి సందడి చేసిన బన్నీ సినిమా అమెరికాలో అరుదైన గౌరవాన్ని పొందింది.

ఈ సినిమా విడుదలకు ముందే పాటలతో రేకెత్తించి జనబాహుళ్యంలో గొప్ప గా పేరు తెచ్చుకుంది. సినిమాకు అమాంతంగా క్రేజ్ పెరిగింది దీంతో అమెరికా థియేటర్లలో ప్రీమియర్ షో లతో మంచి కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురం లో అమెరికాలో ప్రవాసాంధ్రుల మెప్పు పొందింది.

ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈ చిత్రంలో టబు, జయరామ్ ,సుశాంత్, నివేద, నవదీప్ లు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కినది. సంక్రాంతి సీజన్లో రిలీజ్ కావడం చేత వసూళ్లు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా బన్నీ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచేలా ఉందని టాలీవుడ్లో అందరి నోట వినిపిస్తున్నది.

అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా అల్లు అర్జున్ సినిమా అమెరికాలో విశేష ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకువెళుతున్నది. అమెరికాలో మన తెలుగు సినిమాలకు ఉన్న ఆదరణతో రెండు మిలియన్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టిన సినిమా జాబితాలలో ప్రస్తుతం అల వైకుంఠ పురం లో చిత్రం కూడా చేరినది.

అంతేగాక తెలుగు రాష్ట్రాల్లోనూ అమెరికాలోనూ అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ తొలిసారిగా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాడు. కానీ త్రివిక్రమ్ కు ఇలాంటి ఘనత సాధించడం ఇది నాలుగవ సారి. గతంలో అజ్ఞాతవాసి ,అఆ, అరవింద సమేత సినిమాలతో రెండు మిలియన్ల క్లబ్లో చేరిన trivikram ఇప్పుడు మరలా నాలుగవసారి అల వైకుంఠ పురం లో చిత్రం ద్వారా అదే రికార్డు నెలకొల్పాడు.

అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన నాలుగు సినిమాలు త్రివిక్రమ్ వే కావడం చాలా విశేషం. త్రివిక్రమ్ చాలా కాలంగా తను తీసే సినిమాలకు ” అ ” అనే మొదటి అక్షరం వచ్చేలా ప్లాన్ చేసుకుని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సెంటిమెంటే త్రివిక్రమ్ కు కలిసి వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ విధంగా అమెరికా లో రెండు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లు రాబట్టే లా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే విడుదలైన మొదటి రోజునే అత్యధిక కలెక్షన్స్ రావడంతో అశేష ప్రజాదరణ పొందింది. ఆరు రోజుల వ్యవధిలోనే మరో వంద కోట్లకు పైగా షేర్లను రాబట్టి అత్యధిక వసూళ్లను సాధించడంలో రికార్డు నెలకొల్పుతూ విజయవంతమైన సినిమాగా నిలిచింది.