బిగ్ బి కి మరో అరుదైన పురస్కారం

0

అఖిల భారతావనికి  ఆరాధ్య నటుడైన అమితాబ్ బచ్చన్ కు కేంద్రం సినీ రంగంలోనే అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే ఈ పురస్కారం ప్రకటించి  గౌరవించింది ఆయన సినీ దిగ్గజం ఆయన అద్భుత నటనకు నిలువెత్తు రూపం ఆయన భారతీయ తెరపై యాంగ్రీ యంగ్ మాన్ బాలీవుడ్ నట దిగ్గజం  బిగ్ బి అమితాబచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు  ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఇందుకు యావత్ భారతావని తోపాటు అంతర్జాతీయ సమాజం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది అంటూ జావడేకర్ ట్వీట్ చేశారు.

సినిమా రంగానికి అనితరసాధ్యమైన  అపురూప సేవలు అందజేసిన వారిని 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవిస్తోంది భారతీయ సినీ ఆస్కార్ గా పేర్కొనే ఈ అవార్డును అందుకోబోతున్న50 వ వ్యక్తి అమితాబచ్చన్ ఇప్పటివరకు 32 మంది హిందీ పరిశ్రమ ప్రముఖులను దాదాసాహెబ్  ఫాల్కే వరించింది మిగిలిన వారంతా ఇతర భారతీయ భాషా చిత్ర రంగం నుంచి ఎంపికైన వారే తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందించిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బి నాగిరెడ్డి అక్కినేని నాగేశ్వరరావు డి.రామానాయుడు కె విశ్వనాధ్ వీరంతా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు పురస్కారం కింద విజేతలను రాష్ట్రపతి స్వర్ణకమలం 10 లక్షల నగదు బహుమతి తో సత్కరించారు.

1984లో అమితాబచ్చన్ అలహాబాద్  లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి యూపీ మాజీ సీఎం బహుగుణను ఓడించారు వయసుతో సంబంధం లేకుండా ఆయన ఆధునిక సామాజిక మాధ్యమాల తో అనుసంధానమై ఉంటారు బ్లాగ్ ట్విట్టర్ ఫేస్ బుక్ ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలతో నిత్యం మమేకమై ఉంటున్నారు1942 అక్టోబర్ 11 న యూపీలోని అలహాబాదులో పుట్టిన అమితాబచ్చన్ నటుడిగా నిర్మాతగా వ్యాఖ్యాతగా సినీరంగానికి సేవలు అందిస్తున్నారు సౌత్ హిందుస్తానీ సినిమా ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆయన  2015లో పద్మవిభూషన్ పురస్కారం అందుకున్నారు అమితాబచ్చన్ కార్పొరేషన్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభించి ఆర్థికంగా కొన్ని చికాకులు ఎదుర్కొన్న ఆయన కోన్ బనేగా కరోడ్ పతి టీవీ రియాల్టీ షో తో విశేష ప్రజాదరణను తిరిగి సంపాదించుకున్నారు.

2000 జూలై 3 నుంచి నడుస్తున్న ఈ కార్యక్రమానికి అమితాబచ్చన్ అద్భుత వ్యాఖ్యాన మే ఆయువుపట్టు76 సంవత్సరాలు వయసు ఉన్న కూడా ఆయన ఇప్పటికీ ఒక విలక్షణ నటుడిగా సినీరంగానికి ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి ఆయనకు  ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందం అలాగే తమిళ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ఆయన ట్విట్టర్ ద్వారా అమితాబచ్చన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు ఆయనే కాకుండా పలువురు రాజకీయ నాయకులు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలిపారు