AP లో ఉచిత గ్యాస్ ని ఎలా తీసుకోవాలి?

0
ap free gas details telugu 2024

AP Free GAS Complete Details Telugu

ఉచిత గ్యాస్: ఫ్రెండ్స్ ఏపీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు గారు ఎలక్షన్స్ కు  ముందు ఇచ్చిన హామీలలో ఈ ఉచిత గ్యాస్ ఒకటి. దీనిని దీపం పథకం కింద అమలు చేస్తున్నారు. ఈ ఉచిత గ్యాస్ అనేది దీపావళి పండుగ రోజు నుంచి మన రాష్ట్రంలో అమలులోకి వస్తుంది.

ap free gas cylinder apply online

అయితే ఈ పథకం క్రింద  మనం ఉచిత గ్యాస్  సిలిండర్ పొందాలి అంటే మనకు ఏం అర్హత ఉండాలి?, వీటికి ఎలా  అప్లై చేసుకోవాలి?, ఎన్ని సిలిండర్స్ ఫ్రీగా ఇస్తారు?,అనే విషయాల గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

AP Free Gas Eligibility :

ఉచిత గ్యాస్ ను  మనం పొందాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  • 18 సంవత్సరాల పైన వయస్సు  ఉండాలి.
  • గ్యాస్ కనెక్షన్ లేదా PM ఉజ్వల యోజన ద్వారా గతంలోనే గ్యాస్ తీసుకొని ఉండాలి.
  • ఈ  రాష్ట్రానికి చెందినవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

AP Free Gas Required Documents:

ap free gas cylinder scheme 2024

ఫ్రెండ్స్ మనం ఈ ఉచిత గ్యాస్ ని  పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్
  • గ్యాస్ బుక్
  • అడ్రస్ ప్రూఫ్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • గ్యాస్ కనెక్షన్ బిల్
  •  బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
  • మొబైల్ నంబర్

AP Free Gas Scheme Details :

ap free gas cylinder scheme telugu

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఈనెల 29 నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. డెలివరీ 31వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఈ పథకంలో మనం సంవత్సరానికి మూడు సిలిండర్లను ఫ్రీగా పొందవచ్చు అవి ఎలా అంటే:

  • మొదటి సిలిండర్ మార్చి 31/ 2025 లోపు
  • రెండోది జులై 31/2025 లోపు
  • మూడవది నవంబర్ 30 /2025 లోపు ఎప్పుడైనా పొందవచ్చు.

ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ప్రస్తుతం ఏపీలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇందులో అర్హులందరికీ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

గమనిక:-మనం సిలిండర్ తీసుకునేటప్పుడు సిలిండర్ అమౌంట్ మొత్తం చెల్లించాల్సి  ఉంటుంది. ఆ అమౌంట్ ని  ప్రభుత్వం 48 గంటల్లో మన బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేస్తుంది.

AP Free Gas Apply Process :

free gas 2024

ఫ్రెండ్స్  క్రింద మనం ఈ ఉచిత గ్యాస్ ని  ఆన్లైన్  లో ఎలా అప్లై చేసుకోవాలో  వివరంగా   తెలుసుకుందాం.

  • మీ సేవా (MeeSeva) లో అప్లై చేసుకోవాలి.
  • “Deepam Gas Connection” సైట్ లోకి  వెళ్లి  అప్లై చేసుకోవాలి.
  • ఆధార్ కార్డు, గ్యాస్ బుక్ తో  eKYC చేసుకోవాలి.

అదే మనం ఆఫ్‌లైన్ లో దీనికి అప్లై చేసుకోవాలి అంటే:

  • మనకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని దగ్గరకు వెళ్లి  , అప్లికేషన్ ఫారమ్ నింపి సబ్మిట్ చేసుకోవాలి.

గమనిక:పైన తెలిపిన సమాచారం మొత్తం మాకు ఇంటర్నెట్లో దొరికిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తెలిపాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గవర్నమెంట్ వెబ్ సైట్లోకి  వెళ్లి చెక్ చేసుకోండి.