Table of Contents
Ap 3 Capitals in Telugu :
అమరావతి విశాఖపట్నం కర్నూలు ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఈ మూడు ప్రాంతాల గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నాయి. దీని వల్ల లాభాలు మరియు నష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. అదేంటి అనగా 2019 మే నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ అప్పులు 53. 23బిలియన్ డాలర్లు ఉన్నాయి అంటే దాదాపుగా 1.62 వేల కోట్ల రూపాయలు.
2019 – 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2.28లక్షల కోట్లు ఉండగా మరి ఆంధ్రప్రదేశ్ ఆదాయం 1.79 లక్షల కోట్లు మాత్రమే!మొత్తంగా 35.2 6 1 కోట్లు లోటు బడ్జెట్ గా ఉంది! ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే ముందు ముందు మీకే అర్థమవుతుంది.
andhra pradesh 3 capitals positives and negatives :
ముందుగా జగన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆర్టికల్ లో సగ భాగం మాత్రమే చదివి మిగతా ఆర్టికల్ చదవక పోవడమే మంచిది! ఎందుకంటే మిగతా సగభాగం ఆర్టికల్ చదివేటప్పుడు జగన్ అభిమానుల్లో నన్ను తిట్టుకుంటారు అని నాకు చాలా అనుమానంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ ఆర్టికల్ లో ఎలాంటి రాజకీయ భేదాలతో రాయలేదు కానీ కేవలం3 క్యాపిటల్స్ వల్ల ఒక సగటు వ్యక్తి గా లాభాలు నష్టాలు గురించి మాత్రమే తెలియజేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన చంద్రబాబును గొప్పవాడని నేను చెప్పడం లేదు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు చేస్తున్న జగన్ కూడా అంత గొప్ప వాడు కాదని నా అభిప్రాయం. మొదటగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కడైతే ఉంటుందో దాన్నే లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అంటారు.
జుడిషియల్ క్యాపిటల్ అంటే ఆ రాష్ట్రంలో ఎక్కడైతే హైకోర్టు ఉంటుందో దాన్ని జుడిషియల్ క్యాపిటల్ అని అంటారు.
ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇండస్ట్రియల్ పరంగా టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ పరంగా ఎక్కడైతే అన్నీ బిజినెస్ రంగాలు అభివృద్ధి దశలో ఉంటాయో దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు.
ఉత్తరప్రదేశ్కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా లక్నో ఉంది జుడిషియల్ క్యాపిటల్ అలహాబాదులో ఉంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కు కూడా రెండు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్ ఉంటాయి. వేసవిలో శ్రీనగర్ క్యాపిటల్ గాను శీతాకాలంలో జమ్ము క్యాపిటల్ గాను. పంజాబ్ మరియు హర్యానా కు కామన్ గా చండీగర్ క్యాపిటల్ గా ఉంది మరియు జుడిషియల్ క్యాపిటల్గా కూడా ఉంది. హైదరాబాద్కు మరో నాలుగు సంవత్సరాల వరకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కు రెండింటికి రాజధానిగా ఉంటుంది.
ఒకవేళ అమరావతిని నిర్మించి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయ్యేది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానిలు రాబోతున్నాయి అందులో మొదటిది అమరావతి ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. రెండవది విశాఖపట్నం ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. మూడవది కర్నూల్ ఇది జుడిషియల్ క్యాపిటల్.
ముఖ్యంగా జగన్ గారు ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి. తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను రైతుల దగ్గర నుండి తీసుకుంది అప్పటికే ప్రభుత్వం దగ్గర దాదాపు 18 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములు అన్నింటినీ కలిపితే దాదాపు 50 వేల ఎకరాల పైమాటే ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఏ ప్రభుత్వానికైనా ఈ భూములు అన్నింటినీ అభివృద్ధిలోకి తీసుకురావాలంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతుంది!
రాయలసీమ ప్రాంతం చూసినట్లయితే అక్కడ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా కనీసం తాగునీటి సదుపాయం సౌకర్యాలు లేవుకాబట్టి రాయలసీమ మొత్తానికి నీటి వసతి కల్పించాలి అంటే దాదాపు 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక పోలవరం ప్రాజెక్టు నీరు ఉత్తరాంధ్ర కు తరలించాలి అంటే మనకు 16 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది.
త్రాగునీటి సదుపాయం కోసం గృహనిర్మాణానికి 40 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. నాడు నేడు కార్యక్రమానికి స్కూల్స్ హాస్పిటల్స్ నిర్మాణానికి మనకు 29 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు కావలసిన ప్రాథమిక అవసరాలను ప్రాధాన్యతా పరంగా చూసుకుంటే కోట్లు ఖర్చుపెట్టి రాజధాని నిర్మించే దానికంటే ప్రజల ప్రాథమిక కనీస అవసరాలకు కోట్లు ఖర్చు పెట్టడమే మంచిది అనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో లక్షా తొమ్మిది వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసం పెట్టుబడి పెడితే అంత ముఖ్యం కాదని అనిపిస్తుంది. మా ప్రభుత్వ ప్రస్తుత ఆలోచన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు తినడానికి తిండి లాంటి సదుపాయాలు కల్పించడమే కానీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అమరావతి నిర్మించి చూసుకుంటూ ఉండటం కాదు, ఇది ముఖ్యం కాదు
ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అందరికీ తెలియ జేశాడు.
ఈ ప్రక్రియలో భాగంగా జగన్ గారు కర్ణాటక ని ఒక మోడల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు ప్రధానమైన జోన్లుగా విభజించారు. ఇందులో నార్త్ జోన్ లో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఉంటాయి దీనికి విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం గా ఉంటుంది. ఇక్కడ అమరావతి ఉంటుంది.
ఇక గుంటూరు ప్రకాశం నెల్లూరు లో సౌత్ కోస్టల్ జోన్ గా ఉంటుంది. ఇది అటు అమరావతి పరిధిలోకి ఇటు రాయలసీమ పరిధిలోని కూడా వస్తాయి. ఇక నాలుగవ జోను రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేవలం ఒక చోట కే పరిమితం కాకుండా అక్కడికే ఆగిపోకూడదు. ఒకసారి మనం చరిత్రను గుర్తు చేసుకుంటే ఇంతకు ముందు మనకు మద్రాసు ఉండేది దాన్ని వదిలేశాం తర్వాత హైదరాబాదును డెవలప్ చేసుకున్నాం తర్వాత దాన్ని కూడా వదిలేయాల్సి వచ్చింది.
అందుకోసమే అభివృద్ధి అనేది మన కోసం కానీ సెంట్రలైజ్డ్ కానీ మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి లోకి వస్తాయి కాబట్టి, జీడీపీ కూడా త్వరగా పెరిగి మన అప్పులు కూడా త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది జగన్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
అయితే అమరావతి విషయంలో రైతులు చాలా గొడవలు చేస్తున్నారు దానికి కారణం అక్కడున్న అమరావతి రాజధానిగా కాకుండా చేస్తే అప్పటివరకు రైతులకు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయా లేదా అనే సందిగ్ధావస్థలో ఉన్నారు అంటే దాదాపుగా అవి నెరవేరక పోవచ్చు
అందుకే ఈ రైతుల గొడవలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా వారి పొలాలను వారికి రిటర్ణు చేస్తాం మీరు మళ్ళీ మీ పంటలు పండించుకోవచ్చు అంటూ ఉంది.
andhra pradesh 3 capitals positives :
ఇక ఈ త్రీ క్యాపిటల్స్ లో పాజిటివ్స్ గనుక గమనిస్తే అమరావతి ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చింది అని చెప్పవచ్చు . ఎందుకంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి లో ఉండటం చేత ప్రజాప్రతినిధులందరూ అక్కడే ఉంటారు కాబట్టి కొంతవరకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఇక రెండవది విశాఖపట్నం ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ ఐ ఉంది, అంతేకాక ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎక్కువ శాతం జీడీపీ వచ్చేది కూడా విశాఖపట్నం జిల్లా నుండి.
ముఖ్యంగా విశాఖపట్నం లో జరిగే ఎగుమతులు దిగుమతులు పారిశ్రామికీకరణ పరంగా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఆదాయం లభిస్తుంది. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్నందు వల్ల దీని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వల్ల మరిన్ని పారిశ్రామిక రంగాలు ఇక్కడ అభివృద్ధి అయ్యే అవకాశాలు పెరుగుతాయి దీనివల్ల రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుంది
విశాఖపట్నంలో ఉన్న స్థానికులకు ఆంధ్రప్రదేశ్లోని యువతకు ఉద్యోగ అవకాశాలకు మంచి దారి దొరుకుతుంది.
మూడవది కర్నూల్ జుడిషియల్ క్యాపిటల్ నిజం చెప్పాలంటే కర్నూల్లో న్యాయశాఖ ఉండటంవల్ల అంటే హైకోర్టు ఏర్పాటుతో కర్నూలుకు కొంతవరకు క్రౌడ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో కచ్చితంగా న్యాయం కోసం కోర్టు పనుల కోసం అంతా కలిసి ఉంటారు కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందే ప్రభుత్వం తెలియజేస్తున్నట్లు ప్రభుత్వ ఆధీనంలో దాదాపు 50 వేల ఎకరాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా దాదాపు 8 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించాడు.
కానీ భారత దేశ రాజధాని ఢిల్లీ నగరం కేవలం 1400 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే నిర్మించబడి ఉంది. ఢిల్లీ అభివృద్ధికై నిర్మాణానికి అంత సమయము అంత డబ్బులు ఖర్చు అయితే, మరి ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మించాలంటే ఎంత డబ్బు ఎంత సమయం కావాలి?
హైదరాబాద్ నగరం కేవలం 650 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. దీన్ని అభివృద్ధి లోకి తీసుకు రావడానికి దాదాపు 60 సంవత్సరాలు పట్టింది. మరి మరి అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి ఎంత సమయం తీసుకుంటుంది ఆలోచించండి. విశాఖపట్నంలో ఇప్పటికే పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి హిందుస్థాన్ పెట్రోలియం, కార్పొరేషన్ లిమిటెడ్, బి హెచ్ పి ,హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ పోర్ట్ ట్రస్ట్ ,హిందుస్థాన్ షిప్ యార్డ్, ఫిష్ హార్బర్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎల్జి పాలిమర్స్, ఎస్సార్ షిప్పింగ్ ఇలాంటి పెద్దపెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి.
అంతేకాక చిన్న మరియు మధ్య తరగతి కర్మాగారాలు ఎన్నో ఉన్నాయి. సో దీని వల్ల వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో లాభాలు ఉన్నాయి
andhra pradesh 3 capitals news :
ఇక ఈ ఆర్టికల్ లో రెండవ భాగం గురించి తెలుసుకుందాం. ఈ రెండో భాగంలో మూడు క్యాపిటల్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కు జరగబోయే కష్టనష్టాలు ఏమో చూద్దాం. ఇందులో మొదటి కారణం ఏంటంటే మూల వనరులను వృధా చేయడం.
ఒక రాజధానిని ఒక చోట నిర్మించడానికి పట్టే సమయం అదే మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో నిర్మించడానికి పట్టే సమయం ఒకటి కాదు.
3చోట్ల నిర్మించాలంటే కచ్చితంగా మనకు సమయము శక్తి డబ్బు చాలావరకు వృధా అవుతుంది. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులందరూ అమరావతి నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే, అమరావతి నుంచి కర్నూలుకు వెళ్లాలన్నా, గవర్నమెంట్ ఏ వారి ప్రయాణ ఖర్చులు అన్నీ భరించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ప్రభుత్వ పాలన అనేది ఒక్క చోట ఉంటేనే మనకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు పొందగలం అంటే అన్ని పనులు ఒకేచోట చేసుకోగలం. అలాకాకుండా శాఖలు ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంటే ఆ పనులు కూడా చాలా ఆలస్యం అవ్వడానికి కారణాలు అవుతాయి. ఈ ప్రక్రియ అంత చాలా టైం తీసుకుంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా మూడు రాజధానులు నిర్మించడం అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు కానీ, కేవలం పరిపాలనా వికేంద్రీకరణ మాత్రమే జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే సహజంగానే మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకుండానే ఆయా ప్రాంతాలను అభివృద్ధి లోకి తీసుకుని రావచ్చు. రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇక్కడ కేవలం పరిపాలనను మాత్రమే విడదీస్తున్నారు.
అంటే ఏంటి అనగా న్యాయపరమైన పాలనంతా కర్నూలు జిల్లా కి వెళుతుంది, అసెంబ్లీ పరమైన పాలనంతా అమరావతి లో ఉంటుంది, పారిశ్రామిక పరమైన పాలనంతా విశాఖపట్నం వెళుతుంది, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ గనుక జరిగితే వారి పరిస్థితి ఏంటి వారి పిల్లల చదువుల పరిస్థితి ఏంటి ప్రతి నాలుగు నెలలకు ఓసారి పిల్లల బడి మార్చాల్సి వస్తే ఏం చేయాలి.
మనం ఈ ఆర్టికల్ మొదట్లోనే ఒక విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు దాదాపు 35 వేల కోట్లు లోటు బడ్జెట్ గా ఉంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పులు 53 బిలియన్ డాలర్లు ఉన్నాయి అంటే 1.62 వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధానిని అభివృద్ధి చేయడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు ఉంటే మరి మూడు రాజధానులు అభివృద్ధి చేయాలంటే ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందో ఎంత సమయం కావాల్సి వస్తుందో. ఇప్పటికే మనం లోటు బడ్జెట్ లో ఉన్నాము కాబట్టి మనం ఖచ్చితంగా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
మనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితిలో డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉత్తర భారతదేశానికి మాత్రమే నిధులు ఇస్తూ ఆ ప్రాంతాన్ని ఆ భాగాలను మాత్రమే అభివృద్ధి చేస్తూ వస్తున్నది. దక్షిణ భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అది మద్దతు ఇవ్వడం లేదు అభివృద్ధిని చేయడం లేదు. ఈ నిజాన్ని ఎవరు నమ్మినా నమ్మక పోయినా కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.
అంతేకాక ఈ మూడు రాజధానిలోని ప్రభుత్వ బడులు ప్రభుత్వ వైద్యశాలలో కాలేజీలో ఎయిర్పోర్టులో బస్ స్టేషన్లు ముఖ్యంగా త్రాగునీటి సదుపాయం ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని వల్ల ఖర్చులే ఉండే దాని కంటే ఇంకా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మనకు 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల మన రాష్ట్రానికి ఒనగూడే ప్రత్యేకమైన లాభం కాని ఉపయోగం కానీ ఏమైనా ఉన్నదా??
ఉదాహరణకు ఒకవేళ కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసినట్లయితే కర్నూల్లో ఉన్న ప్రజలకు ఏమైనా లాభం ఉంటుందా?
అదే కర్నూల్ లో ఐ.ఐ.ఐ.టి కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు కర్నూలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లేదా విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లయితే వారు అక్కడి నుంచి మరోచోటుకు అతి సులువుగా ప్రయాణం చేయగలరు.
హీరో మోటార్స్ గాని లేదా కియా మోటార్స్ గాని వాళ్ళ కంపెనీలు అక్కడ ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. అంతేగాని కేవలం హైకోర్టు మాత్రమే అక్కడ ఏర్పాటు చేస్తే న్యాయపరమైన పరిపాలన మాత్రం జరుగుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి లాభాలు ఉండవు.
అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం కర్నూలుకి విశాఖపట్నానికి మధ్య సంబంధం ఉండటం చేత, ఈ రెండింటికీ మధ్యలో అమరావతి ఉండటం చేత ఈ మూడింటిని మూడు రాజధానులు గా అభివృద్ధి చేస్తే దాని ద్వారా పదమూడు జిల్లాల్లో కూడా అభివృద్ధి లోకి వస్తాయి తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెబుతున్నారు.
కానీ ఇక్కడ మనం ఒకే ఒక్క విషయం ఆలోచించాలి విశాఖపట్నం నుంచి కర్నూలుకు ప్రయాణించడానికి కనీసం ఒక్క రైలుఅన్నా ఉన్నదా? మిగతా ప్రాంతాల్లో డెవలప్ కావడం లేదా అంటే అవుతున్నాయి. కర్నూలు జిల్లాకు ట్రిపుల్ ఐటి మరియు సోలార్ పార్కు కూడా వచ్చింది. అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ మరియు కియా మోటార్స్ కంపెనీ వచ్చింది. చిత్తూరు మరియు నెల్లూరు కే ఇండస్ట్రీస్ వచ్చాయి మరియు ఐఐటీ కూడా వచ్చింది.
కడప కు స్టీల్ ప్లాంట్ వచ్చింది. ప్రకాశం జిల్లాకు రామాయపట్నం పోర్టు వచ్చింది. కృష్ణకు గుంటూరు జిల్లాలకు రాజధాని వచ్చింది. గోదావరి జిల్లాలకు నిట్ కాలేజీ స్మార్ట్ సిటీ వచ్చింది. విశాఖపట్నానికి ఐ ఎం వచ్చింది రైల్వే జోన్ కూడా రాబోతున్నది. పెట్రోలియం సిటీ వచ్చింది స్మార్ట్ సిటీ కూడా వచ్చింది. విశాఖపట్నం రాజధాని కావడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మనం ఎప్పటికీ చేయలేం.
ఇక్కడ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అదే సౌత్ ఆఫ్రికా ను తీసుకుంటే ప్రస్తుతం వారి క్యాపిటల్స్ నన్నింటిని కలిపేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇలాంటి ఆలోచనలు ఒక ఫెయిల్డ్ మోడల్ ఆలోచన గా చెప్పవచ్చు. మన రాష్ట్రంలో ఇలా మూడు రాజధాని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల మనకు ప్రత్యేకంగా మరియు అధికంగా శ్రమ పెరుగుతుంది తప్ప పెద్దగా బెనిఫిట్స్ ఏవీ ఉండవు.
andhra pradesh 3 capitals benefits :
కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కానీ మనము ఎక్స్పెక్ట్ చేసినంత బెనిఫిట్స్ ఉండవు.
కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడుకి అతని బినామీ సంస్థలకు హెరిటేజ్ సంస్థకు అమరావతిలో భూము లు ఉన్నాయి కాబట్టి అందుకే వారు అక్కడ రాజధాని ఏర్పాటు చేశారని అంటున్నారు. మరి చంద్రబాబు వర్గం వారు జగన్ కు అతనికి సంబంధించిన వ్యక్తులకు విశాఖపట్నం మరియు కర్నూల్ లో భూములు ఉన్నాయి. కాబట్టి వాళ్లు అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇందులో ఎవరి మాట వాస్తవం అనేది మనకు తెలియదు కానీ కాలమే నిర్ణయించాలి.
వీటన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ అదే ప్రత్యేక హోదా గనుక వచ్చినట్లయితే రాజధాని ప్రాంతానికి కొంతమేరకు అభివృద్ధి చేయడానికి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. కానీ దురదృష్టం కొద్దీ మనకు ఆ ప్రత్యేక హోదా కూడా లభించలేదు.
అయితే ప్రస్తుతానికి ఆ ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడటం లేదు అందరూ మర్చిపోయారు. త్వరలోనే ఆ మర్చిపోయిన ముఖ్యమైన విషయం ప్రత్యేక హోదా గురించి అందరూ పోరాడితే ప్రత్యేక హోదా పొందగలం. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎన్ని రాజధాని ప్రాంతాలైన అభివృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సహకారం ఉంటుంది.
కానీ ఇప్పటికే లక్షా అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం త్రీ క్యాపిటల్స్ నిర్మించే పరిస్థితులు అయితే లేదు. కాబట్టే అందుకోసమే ఒక్క రాజధాని అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అందులోనూ అమరావతి అయితేనే రాజధానిగా బాగుంటుంది ఎందుకంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నే చేయబోతున్నామని చెప్పి మొత్తం అందరూ నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు వచ్చే దానికి శంకుస్థాపన చేశారు.
గూగుల్ లోనూ, వికీపీడియా లోను, దాదాపు అన్ని వెబ్సైట్లలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అడిగితే అమరావతి అని వస్తున్నప్పుడు మళ్లీ దాన్ని మార్చడం ఎందుకు??
అమరావతి కోసం పూర్తిస్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంత మేరకు మాత్రమే ఖర్చు పెట్టిమిగతా జిల్లాల్లో కూడా డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగా అభివృద్ధి లోకి తీసుకు వస్తే మనకు బాగా ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్ప ముఖ్య జిల్లాల్లో రాజధానిని నిర్మించాలంటే ఇది అయ్యే పని కాదు. విశాఖపట్నం ఇంతకుముందే బాగా అభివృద్ధి చెంది ఉన్నది దాన్ని మళ్ళీ మనం డెవలప్ చేయాలంటే అన్నిటినీ కదపాల్సిన అవసరం లేదు.
దానికోసం ఫారిన్ డెలిగేట్స్ తో సమావేశం జరగడం కావచ్చు లేదా పెట్టుబడిదారుల ఎవరైనా వచ్చినప్పుడు వారికి విశాఖపట్నం చూపిస్తే చాలు వాళ్లు విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి త్వరగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అది బాగా అభివృద్ధి లో ఉన్న ,ఇతర ప్రాంతాలతో అనుసంధానమై ఉన్న జిల్లా కాబట్టి.
ఇక కర్నూలు మరియు రాయలసీమ ప్రాంతాలు తీసుకుంటే వీటిని చాలా వరకు అభివృద్ధి చేయాల్సి ఉన్నది. ఎందుకంటే ఇప్పటి దాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమనుండి ఎంపికయ్యారు కానీ రాయలసీమకు మాత్రం న్యాయం జరిగింది చాలా తక్కువ అని మాత్రమే చెప్పవచ్చు. అందుకే రాయలసీమ ప్రాంతాలను చాలావరకూ అభివృద్ధి చేయాల్సి ఉన్నది.
దీని కోసం కేవలం జుడిషియల్ క్యాపిటల్ మాత్రమే ఉపయోగ పడదు. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వేరే విధానాలు ఉంటాయి. ఇవి ప్రభుత్వానికి మనం చెప్పేటంత వారం కాము. దేశం మొత్తం వన్ నేషన్ వన్ టాక్స్ అంటే మనం మాత్రం వింతగా 1స్టేట్ 3 కాపిటల్స్ అంటున్నాం. బహుశా గవర్నమెంట్ మారినప్పుడు రాజధాని ఏర్పాటు చేసే కమిటీ మారవచ్చు కానీ కమిటీల కారణంగా గవర్నమెంట్ ప్రతిసారి రాజధానిని మార్చకూడదు. అప్పటికి మనకంటూ ఒక స్థిరమైన రాజధాని అనేది లేకుండా అవుతుంది.
జై హింద్