ఫ్రెండ్స్ AIIMS మంగళగిరి అనేది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలో స్థాపించబడిన ఒక ప్రముఖ వైద్య విద్యా సంస్థ. భారతదేశ ప్రజలకు మెరుగైన వైద్య, విద్య, పరిశోధన, మరియు ఆరోగ్య సంరక్షణ అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం.
AIIMS మంగళగిరిని 2014లో ప్రాంభించారు, అయితే దీని యొక్క పూర్తి కార్యకలాపాలు 2018 నుంచి ప్రారంభించారు.ఇది ప్రధాన మంత్రి ఆరోగ్య సంరక్షణ యోజన (PMSSY) కింద నిర్మించబడింది. ఈ AIIMS మంగళగిరి సంస్థ ఇటివల కాంట్రాక్ట్ బేస్ క్రింద కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారి చేసింది. దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
AP AIIMS Mangalgiri Notification 2025
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీలోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) ఒక తీపి కబురు అందించింది అదేంటి అంటే:
ఇందులో కొన్ని జాబ్స్ కి ఒక నోటిఫికేషన్ అనేది జారీచేసింది. ఇందులో పరీక్ష లేకుండా జాబ్ ఇవ్వడం అనేది బంపర్ ఆఫర్ గా చెప్పుకోవచ్చు.
POST DETAILS
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS) కాంట్రాక్ట్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Eligibility
ఫ్రెండ్స్ మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS) జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కి మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- డ్రైవర్ జాబ్ కి అయితే టెన్త్ పాస్ అయ్యి 2 వీలర్, ఫోర్ వీలర్ నడపడం రావాలి.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ AIIMS జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- టెన్త్,ఇంటర్,డిగ్రీ సర్టిఫికెట్స్
- రెస్యూమ్
- 2 పాస్ ఫోటులు
Salary Details
ఫ్రెండ్స్ ఈ AIIMS జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇలా 20,000/- రూపాయల శాలరీ ఇస్తారు.
Note: ఇందులో ఇతర అలవెన్స్ లు ఏవి చెల్లించబడవు.
Application Fees
మనం ఏ జాబ్స్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీజు అనేది తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ AIIMS జాబ్స్ కి మనం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అప్లికేషన్ ఫి లేదు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి మార్చి 12, 2025 (బుధవారం) ఉదయం 9 గంటలకు AIIMS మంగళగిరిలోని గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ బ్లాక్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహిస్తోంది.
- అవసరం ఉన్నటువంటి డాకుమెంట్స్ ని తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
Apply Process
ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
AP AIIMS Managalgiri Notification 2025