AP DME డిపార్ట్మెంట్ లో 1183 జాబ్స్ | AP DME Notification 2025

0
ap dme notification 2025

AP DME అంటే ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అర్థం.ఇది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, మరియు నర్సింగ్ కాలేజీల నిర్వహణకు బాధ్యత వహించే శాఖ.ఈ సంస్థ ప్రధానంగా వైద్య విద్య, వైద్యం, మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరిచేందుకు పని చేస్తుంది.AP DME ద్వారా MBBS, PG మెడికల్ కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు లాంటి కోర్సులు అందించబడతాయి.

ఫ్రెండ్స్ ఏపీలోని  నిరుద్యోగులకు AP DME ఒక శుభవార్త తెలిపింది,అదేంటి అంటే DME లో 1183 జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.దీని గురించి వివరంగా ఆర్టికల్ లో తెలుసుకుందాం.

AP DME Notification 2025

ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించి సమాజంలో గౌరవంగా బతకాలి అనుకునే వారికి ఏపీ డీఎంఈ మంచి అవకాశం కల్పించనుంది.ఇందులో 1183 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.దీని గురించి ఇంకొంచెం వివరంగా అంటే జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే అర్హత ఏమి ఉండాలి? స్యాలరి ఎంత ఇస్తారు? డాకుమెంట్స్ ఏం కావాలి? అని వివరంగా క్రింద తెలుసుకుందాం.

Eligibility

ఫ్రెండ్స్ మనం AP DME జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-44మధ్య ఉండాలి.
  • MD,MS,MCh,MDS చేసి ఉండాలి.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు 5 సంవత్సరాల  వయో పరిమితి సడలింపు ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్.
  • రెసిడెన్సి సర్టిఫికెట్.
  • మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్.

Salary Details

ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జాబ్స్ అప్లై చేసేముందు ఫస్ట్ చెక్ చేసుకునేది స్యాలరినే కదా!ఈ AP DMEజాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 97,750/- స్యాలరి ఉంటుంది.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఆంధ్రప్రదేశ్ DME సీనియర్ రెసిడెన్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు అంటే OC అభ్యర్థులకు 2000/- రూపాయలు ఫీజు. SC,ST,BC అభ్యర్థులకు 1000/- ఫీజు ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి

  • ఈ జాబ్స్ కి ఆన్లైన్లో అప్లికేషన్ 17 మార్చి  2025 ప్రారంభమైంది.
  • అలాగే 22 మార్చి  2025 ఆఖరి తేదీ.

Job Selection Process

AP DME లోని జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష,ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకుని జాబ్స్ ఇస్తారు.

NOTE:డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ AP DME ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు కింద ఇచ్చిన లింకు ద్వారా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

AP DME Notification 2025