AP CM Spandana Toll Free Number 2020

3

AP CM Toll Free Number ( AP Govt Spandana Toll Free Number ):

ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి AP రాష్ట్ర ప్రభుత్వం సరి కొత్త కార్యక్రమాన్ని (Spandana) ప్రారంభించింది. ఈ స్పందన అనేది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల మనోవేదనలను గురించి తెలుసుకోవడానికి ఒక వేదిక. సరైన జవాబుదారీతనంతో పిటిషనర్ (కంప్లైంట్ చేసే వ్యక్తి) యొక్క ఆధార్ నెంబర్ తో లింక్ చేయబడిన ఒక సాధారణ వేదికపై CMO / SECY లు / HOD లు / జిల్లా కలెక్టరేట్ / జిల్లా మరియు మండల స్థాయి కార్యాలయాలలో వచ్చిన అర్జీలను, కంప్లైంట్ లను ఎంటర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి మరియు పరిష్కరించడానికి ఒక సమగ్ర ఫిర్యాదు వ్యవస్థ ప్రతిపాదించబడింది.

AP Anti-corruption Call Center :

మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రము లో జరిగే అవినీతిని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. అదే AP anti-corruption bureau. అలాగే దానికి అవసరం వచ్చినప్పుడు ఎలాంటి వారైనా కాల్ చేసి జరుగుతున్నా అవినీతిని తెలుపవచ్చు. అందుకు ఒక toll free number కూడా ఉంది. అదే AP Anti-corruption Toll Free Number/ Helpline Number -14400. దీనికి ఫ్రీ గ dial చేసి కంప్లైంట్ చేయవచ్చు. తగిన చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతుంది. 

ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సహాయం అవసరమైతే లేదా మీ ప్రాంతంలో ఏదైనా సమస్య గురించి కంప్లైంట్ చేయాలనుకుంటే, మీరు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. అయితే, ఈ AP CM TOLL FREE NUMBER ను మరే ఇతర ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదని ప్రజలకు సూచించారు.

స్పందన – ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన అర్జీ లో ఇచ్చిన సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంబంధిత శాఖ వారి అర్జీ /కంప్లైంట్ మీద తగు చర్య కోసం సంబంధిత అధికారులకు పంపబడుతుంది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక – 1800 – 425 – 4440 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24×7) కాల్ చేసి తమ అర్జీ/కంప్లైంట్ స్టేటస్ ని తెలుసుకోవచ్చును. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే స్పందన కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.

Andhra Pradesh Government Helpline Number (Spandana) | AP CM Toll Free Number

ప్రభుత్వ కార్యాలయాల నుండి మరియు ప్రజల వద్ద నుండి సేకరించిన అర్జీలను/కంప్లైంట్ లను ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఎంటర్ చేసి, వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారికి పంపవచ్చు. కాబట్టి, మీరు మీ ఇష్యూ లేదా గ్రీవెన్స్ ను స్పందన ప్రోగ్రాంలో ఎంటర్ చేయాలనుకుంటే, మీరు ఈ క్రింది సమాచారాన్ని అందించాలి. ప్రజలు ఇచ్చే ఒక అర్జీ /కంప్లైంట్ ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.

 • క్యాటగిరీ
 • తేదీ
 • నియమించబడిన అధికారి డిపార్ట్మెంట్
 • సమస్య
 • లొకేషన్
 • పిటిషనర్
 • పిటిషనర్ ఇచ్చిన స్టేట్మెంట్ లక్షణాలు మొదలైనవి వివరంగా ఉండాలి.

సరియైన కంప్లైంట్ ఇచ్చిన తరువాత మీకు ఇలాంటి Features లభిస్తాయి.

 1. CMO / HOD నుండి మండల స్థాయి వరకు సాధారణ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం
 2. ఆధార్ లింక్డ్ ట్రాకింగ్ సిస్టమ్ – ఇది నకిలీలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
 3. పిటిషన్ యొక్క అర్జీ లేదా కంప్లైంట్ ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయబడుతుంది. ప్రభుత్వ పరమైన అన్ని విభాగాలలో కంప్లైంట్ లను ఫార్వార్డ్ / ట్రాక్ చేసే సౌకర్యం ఉంది.
 4. CMO / HOD లు / జిల్లా స్థాయిలో అర్జీలు/ కంప్లైంట్ లను పరిష్కారం చేసే టీమ్ లను ప్రజల కోసం అంకితం చేశారు.
 5. కాల్స్ కు ఆటోమేటిక్ రిప్లై, SMS / మెయిల్స్ పరిష్కారం కోసం 100% క్వాలిటీ ఆడిట్ కోసం మంచి పని తీరు గల, అంకితమైన కాల్ సెంటర్ల ద్వారా SMS /E-mail ద్వారానే పిటిషన్ / పిటిషనర్ యొక్క సమస్య మరియు వాటి చరిత్ర అందుబాటులో ఉంటుంది.
 6. ఆన్‌లైన్ మరియు ఫోన్ ద్వారా కూడా కంప్లైంట్ లను ఎంటర్ చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు.

AP CM Office Toll Free Number/Helpline Number (Spandana)

Spandana – ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మన రాష్ట్రంలోని ఎలాంటి శాఖ పరమైన అర్జీ అయిన సంభందించిన శాఖకు పంపవచ్చు.ఇందులో ఎలాంటి అవకతవకలకు తావు లేదు.

AP CM Toll Free Number – Complete Address and details

RTGS (Real Time Governance Society)
Block-1, A.P. Secretariat,
Velagapudi, Amaravati, Andhar Pradesh
e-mail : helpspandana-ap@ap.gov.in

Main Address Location:
Chief Minister Grievance Redressal System (CMGRS),
Tadepally, Vijayawada, Andhra Pradesh.
Phone: 1100 / 1800-425-4440
Email: helpspandana-ap@ap.gov.in
pపని గంటలు : 8 am- 6pm

AP Grievance Registration Links 

ఆన్‌లైన్ లో కంప్లైంట్ లను ఎంటర్ లింక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కంప్లైంట్లను స్పందన (పబ్లిక్ ఇష్యూస్ సాల్వింగ్ ప్లాట్‌ఫామ్) కోసం రూపొందించిన ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా పంపవచ్చు. కాబట్టి, మీ సమస్యలను ఎంటర్ చేయడానికి మరియు పరిష్కరించడానికి ఈ క్రింది లింక్‌ల ద్వారా వెళ్ళండి.

Citizen Online Registration:  Click Here

Spandana Online Guide (Brochure):  Click Here

ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 1. ఆదార్ నెంబర్ తో పాన్ కార్డ్ ని ఒక్క రోజులోనే పొందడం ఎలా ?
 2. కొత్త రేషన్ కార్డు మీకు వస్తుందో లేదో వెంటనే ఇలా చెక్ చేస్కొండి
 3. YSR Pelli Kanuka ఎలా అప్లై చేయాలి ? ఫుల్ డీటెయిల్స్

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మన తెలుగు వారి కోసం,మన తెలుగు వారి “తెలుగు న్యూస్ పోర్టల్” వెబ్సైట్లో ఇలాంటి ముఖ్యమైన ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే కింద కామెంట్ చేయండి.మేము తప్పకుండ తగిన పోస్ట్ చేస్తాము.