AP ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ పట్టా ఎలా ఉందొ తెలుసా ? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

4

AP illa pattalu 2020 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ ఇళ్ల పథకానికి సంబంధించి ఇళ్ల పట్టాలు వచ్చే ఉగాది నాటికి రెడీగా ఉన్నాయి. దాదాపు 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మరి ఇళ్ల పట్టాలు lottery ద్వారా ఇవ్వడం జరుగుతోంది, ఈ లాటరి లో కనుక మీ పేరు వచ్చినట్లయితే వచ్చే ఉగాదినాటికి ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ తో పాటు పట్టా ఇవ్వడం జరుగుతుంది.

మరి మనకు అందించే ఈ పట్టా యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ పట్టా ఎవరి పేరు మీద ఇస్తున్నారు, ఈ పట్టాలో ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి, పట్టా పొందిన తర్వాత ఇంటిపై సంపూర్ణ హక్కు మనకు ఎప్పుడు వస్తుంది… ఇలాంటి పూర్తి డిటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఇళ్ల పట్టాలు ఎలా ఉంటాయి? ( ap illa pattalu)

మనకు ఇచ్చే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ బాండు చాలా దట్టంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనం వర్షంలో తడిచినప్పుడు చిరిగి పోకుండా మంచి క్వాలిటీతో తయారుచేస్తారు. అలాగే ఈ బాండ్ మొదటి పేపర్లో పది రూపాయల స్టాంప్ ముద్రించబడి ఉంటుంది. ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ కూడా అలోట్ చేయబడి ఉంటుంది. తర్వాత పేపర్లో ఎవరు ఈ పట్టాను పొందారు లాంటి ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి.

దాంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ అఫీషియల్ సీల్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ లో పట్టా రిజిస్ట్రేషన్ డేట్, స్టాంపు సీరియల్ నెంబరు, అలాగే తాసిల్దార్ గారి అఫీషియల్ స్టాంపు తర్వాత సైన్ ఉంటాయి. ఇక్కడ మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తానికి తహసీల్దార్ గానే హెడ్. అంటే ఏపీ ఇళ్ల పట్టాల కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం తాసిల్దార్ గారికి ఇవ్వడం జరిగింది.

ఇక తర్వాతి పేపర్లో చూసినట్లయితే లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఉంటాయి. పట్టా పొందిన వారి పేరు, వయస్సు, గ్రామము, ఆధార్ నెంబరు, మండలము, జిల్లా మరియు పట్టానెంబరు ప్రింట్ చేయబడి ఉంటుంది. ఇక ఈ పట్టకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా కింద పాయింట్ల వారిగా విడిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏంటో తెలుసుకుందాం.

ap illa pattalu bond

  1. ఈ పట్టా మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొరకు మొత్తం మనం చెల్లించాల్సిన ఖర్చు కేవలం 20 రూపాయలు మాత్రమే.
  2. ఇందులో పది రూపాయలు బాండ్ పేపర్ కు మరియు ₹10 రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి నందుకు.
  3. ఇక మీ ఇంటి స్థలము వంశపారంపర్యంగా అనుభవించవచ్చు అంటే మనము, తర్వాత మన పిల్లలు, వాళ్ల పిల్లలకు చెందిన విధంగా ఈ పట్టా రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుంది.
  4. మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఇంటి పట్టా అని ఏ బ్యాంకు లో నైనా తనఖా పెట్టుకుని లోన్ కి అప్లై చేసుకోవచ్చు.
  5. ఇక ఈ పట్టా వచ్చిన తేదీ నుండి ఐదు సంవత్సరాల తరువాత పూర్తి హక్కు మనకే చెల్లుతుంది. అంటే ఇంటి స్థలాన్ని మనం అమ్ముకోవచ్చు లేదా మరొకరి ఇలాంటి స్థలం కొనుక్కోవచ్చు.
  6. ఇప్పుడు మంజూరు చేయబడిన స్థలంలో ప్రస్తుతం అమలులో ఉన్న రూల్స్ ఆధారంగానే ఇంటిని నిర్మించుకోవాలి, అంతే కాని మనకు నచ్చిన విధంగా ఇంటిని కట్టుకోకూడదు.

మరి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను, ఇంటి పట్టా మనకు ఏవిధంగా అందిస్తారు ,ఎలా ఉంటుంది తదితర అంశాలు అన్నీ. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను.

4 COMMENTS