ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు – అర్హులైన వారు అప్లై చేసుకోవాలన్న మంత్రి బొత్స

4

Ration card apply in AP

కరోనా నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా తిండి లేకుండా పస్తులతో పడుకోవద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు లేకున్నా అర్హులైతే అలాంటి వారికి బియ్యం అందజేయాలని ఆయన తెలిపారు. దీంతో.. వీలైతే ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. రేషన్ సరుకుల పంపిణీలో ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులు లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా వాటిని అధిగమించేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ సరుకులు తో పాటు రూ.వెయ్యి నగదు సాయం అందని వారికి కూడా త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి రెండో విడత రేషన్ సరుకులు పంపిణీ మొదలు పెడతామని చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుకూలంగా, రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా రేషన్‌ కార్డు దారులకు కూపన్లు అందిస్తున్నామన్నారు. కూపన్లు తీసుకున్న వారు ,ఈ కూపన్ల మీద ఉన్న సమయానికి వచ్చి రేషన్ సరుకులు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరూ కూడా గుంపులుగా రాకుండా ఉండేలా స్ధానిక అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు తీసుకోవాలని ఆయన కోరారు.

 ఏపీ ప్రభుత్వం దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డును అందజేస్తోంది. ఇందులో ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పడుతుంది.కానీ ప్రస్తుతం ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డు పొందేందుకు ముందుగా, రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం నింపాలి. ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో దొరుకుతాయి. లేకపోతే మీసేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారంను నింపాక, దానికి అవసరమయ్యే ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ లు వంటివి తెలిపే ఇతర డాక్యుమెంట్లు తప్పకుండా జత చేయాల్సి ఉంటుంది.

ఆ అప్లికేషన్ ను తీసుకెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, ఫీజు చెల్లించాలి. మీసేవ నిర్వాహకులు ఇచ్చే నంబరుతో కూడిన స్లిప్‌ను భద్రపర్చుకోవాలి. ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మీకు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది. అప్పుడు స్లిప్ తీసుకెళ్లి మీసేవలో అందజేసి రేషన్ కార్డును పొందవచ్చు.

అంతేకాకుండా.. ‘స్పందన’ యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.లాక్ డౌన్ పాటించాలని, అందరూ కలిసి కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు వ్యక్తి గతంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి.

you may like this links:

  1. ఏప్రిల్ 4 నుండి మీ కోసం 3 ఫ్రీ సిలిండర్లు – కేంద్రం కీలక నిర్ణయం

4 COMMENTS