April month current bill status
ఏప్రిల్ మంత్ కరెంట్ బిల్లు కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నెలలో మనకు మార్చి నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు జనరేట్ అవ్వదు.అంటే మామూలుగా గడిచిపోయిన నెలకు సంబంధించిన కరెంట్ బిల్లును జరుగుతున్న నెలలో పే చేస్తూ ఉంటాం. అంటే మార్చి నెలలో మనం వాడిన కరెంటు మొత్తానికి దానికి సంబంధించిన బిల్లును ఏప్రిల్ నెలలో కట్టాలి. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో కరెంట్ బిల్లు రీడింగు తీయరు కాబట్టి ఫిబ్రవరి నెలలో కరెంట్ బిల్లు ఎంత అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ కి టెన్ పర్సెంట్ అడిషనల్ గా కలిపి ఆ బిల్లును మార్చి నెల బిల్లుగా లెక్కలోకి తీసుకుంటారు.మీకు అర్థం కాకపోతే ఈ ఉదాహరణ చదవండి. ఫిబ్రవరిలో మీకు వచ్చిన కరెంటు బిల్లు 300 రూపాయలు అయితే దీనికి టెన్ పర్సెంట్ కలిపి అంటే 330 రూపాయలు తీసుకుంటారు.
వివరణ :
అంటే చాలామంది ప్రజలు మీటర్ రీడింగ్ చేయకుండా కరెంట్ బిల్లు తీసుకోవడం అంటే ఎక్కువ బిల్లు కట్టాల్సి వస్తుందేమో అని డౌట్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక ప్రకటన చేసింది. ఏమంటే కరోనా వైరస్ కారణంగా గడిచిన మూడు నెలలకు కరెంట్ బిల్లు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదు. ఈ మూడు నెలల కరెంట్ బిల్లు జూన్ నెల చివరిలో కడితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు కానీ, పెనాల్టీ కానీ విధించరు. లేదా ఫైన్ వెయ్యడం కానీ, కరెంటు కనెక్షన్ కట్ చేయడం కానీ ఉండదు. అంటే ఏప్రిల్, మే, మరియు జూన్ నెలకు సంబంధించి కరెంట్ బిల్లు కట్టకపోయినా మీకు ఎలాంటి ఫైన్ ఉండదు.
దీనంతటికీ సంబంధించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కాబట్టి చాలామంది డౌట్స్ అడుగుతుంటే విద్యుత్ శాఖ తరపున వాళ్ళు నాల్గవ తేదీ అంటే ఏప్రిల్ 4వ తేదీకి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు దాన్ని ఒక మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరికీ పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఎలాంటి సమాచారం రాకపోయినట్లయితే ఇప్పటికే చాలా మంది ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపంలో కానీ లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా గాని అఫీషియల్ యాప్ ద్వారా కానీ మన యొక్క కరెంట్ బిల్లు తెలుసుకుని పే చేయవచ్చు అని కూడా చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు.
అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఫిబ్రవరి నెల కరెంటు బిల్లు తీసుకుని అందులో ఉన్న అమౌంట్ కు మరొక టెన్ పర్సెంట్ అమౌంట్ ని యాడ్ చేసి ఆ మొత్తం అమౌంట్ వివిధ రకాల డిజిటల్ ట్రాన్సాక్షన్ యాప్ లు ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు అని చెబుతున్నారు. లేదంటే ఒకవేళ మే నెలలో కరెంట్ బిల్లు రీడింగ్ తీయడం జరుగుతుంది కనుక అప్పుడైనా ఆ మే నెల బిల్లు ప్రకారం మనం కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు. అయితే చాలామంది మార్చి లో ఒక 100 యూనిట్లు, ఏప్రిల్ లో ఒక 100 యూనిట్లు మొత్తం కలిపితే రెండు వందల యూనిట్లకు కరెంట్ బిల్ చార్జెస్ ఎక్కువగా వస్తుంది కదా అని అనుమానం పడుతున్నారు . అయితే దీనికి పరిష్కారంగా మన కరెంట్ బిల్లు సంబంధించిన సర్వీస్ నెంబర్ ను ఆన్లైన్లో చెక్ చేస్తే మార్చి నెల కి సంబంధించి ఎంత కరెంటు బిల్లు వచ్చింది అనేది చూపిస్తుంది, కాబట్టి పే చేసేవాళ్ళు చేయవచ్చు.
అంతేకానీ బిల్లు చెల్లించనంత మాత్రాన ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి అడిషనల్ చార్జ్ వేయదు. ఐదవ తేదీ తర్వాత మీరు ఇలా చేసినట్లయితే మీ కరెంటు బిల్లు ఎంత అనేది తెలుస్తుంది.మొత్తానికి గడుస్తున్న మూడు నెలలకు సంబంధించి కరెంటు బిల్లులు చెల్లించకపోయినప్పటికీ మీకు ఎలాంటి అడిషనల్ చార్జ్ పడదు.నాల్గవ తేదీ తర్వాత విద్యుత్ శాఖ వారు ప్రతి ఒక్కరికీ మార్చి నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది దీని ఆధారంగా మన కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు.
ఫోన్ పే, పేటీఎం ఇతర బ్యాంకుల కు సంబంధించిన యాప్ లో మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయగానే కరెంట్ బిల్లు ఎంత అనేది చూపిస్తుంది. దీని ఆధారంగా మనం సులువుగా కరెంట్ బిల్ ప్లే చేయవచ్చు.నాల్గవ తేదీ మీకు మార్చి నెలకు సంబంధించి ఎంత కరెంటు బిల్లు అనేది వచ్చిన తర్వాత, మెసేజ్ రూపంలో వచ్చిన తర్వాత కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే ఆన్లైన్లో కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి అనేది మీకు వివరంగా తెలియ జేస్తాను. ఈ కరెంట్ బిల్లులకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ వస్తే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మీకు వివరణ ఇస్తాను.
మీకు ఉపయోగపడే ఇతర లింక్స్ :
- ఏప్రిల్ 4 నుండి మీ కోసం 3 ఫ్రీ సిలిండర్లు – కేంద్రం కీలక నిర్ణయం
- మీకు జన్ధన్ అకౌంట్ ఉందా? అయితే మీరు డబ్బులు డ్రా చేయలేరు?