అజిత్రోమైసిన్ 500 mg టాబ్లెట్ ఉపయోగాలు,దుష్ప్రభావాలు తెలుసుకుందాం!

0
azithromycin 500 mg tablet in telugu

Table of Contents

Azithromycin 500 mg  Tablets In Telugu: అజిత్రోమైసిన్ (Azithromycin) అనేది ఒక యాంటీ బయోటిక్. ఇది వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల కలిగే అనేక రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. జలుబు, ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ విషయంలో ఈ టాబ్లెట్  సిఫారసు చేయబడదు ఎందుకంటే ఇది కేవలం బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు మాత్రమే  వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ఈ టాబ్లెట్ ని  ఎక్కువగా ముక్కు, గొంతు, టాన్సిల్స్, చెవులు, ఊపిరితిత్తులు మరియు చర్మం మొదలైన వాటి యొక్క బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్ గ ఉపయోగిస్తారు.ఈ ఔషధాన్ని కొన్నిసార్లు మలేరియాను నయం చేయడానికి కూడా  ఉపయోగిస్తారు. ఈ టాబ్లెట్ అనేక పేగు ఇన్ఫెక్షన్లు మరియు లైంగిక సంక్రమణకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది.

Azithromycin 500 mg  Tablets in telugu

Azithromycin 500 mg  Tablets Uses In Telugu:-అజిత్రోమైసిన్ 500mg టాబ్లెట్ వలన కలిగే ప్రయోజనాలు 

మనం ఇప్పుడు అజిత్రోమైసిన్ 500 mg టాబ్లెట్ వలన ఏమి ప్రయోజనాలు ఉన్నాయి,ఈ టాబ్లెట్ ని దేనికి వాడవచ్చు అని  వివరంగా తెలుసుకుందాం.

  • గొంతు ఇన్ఫెక్షన్
  • సైనస్ ఇన్ఫెక్షన్
  • చర్మం అంటువ్యాధులు
  • ఎముక రంధ్రాల యొక్క వాపు
  • చెవి ఇన్ఫెక్షన్
  • బ్యాక్తిరియాల్ ఇన్ఫెక్షన్
  • రొమ్ము పడిసిం
  • ఎగువ శ్వాసకోశ మార్గ సంక్రమణ
  • బ్రోన్కైటిస్

  • మూత్రనాళం ఇన్ఫెక్షన్

పైన పేర్కొన్న ఇన్ఫెక్షన్ లకు ఈ టాబ్లెట్స్ ని ఉపయోగిస్తారు.

Azithromycin 500 mg  Tablets Side Efeects In Telugu:-అజిత్రోమైసిన్ 500mg టాబ్లెట్ వలన కలిగే దుష్ప్రభావాలు 

అజిత్రోమైసిన్ టాబ్లెట్ వలన ఈ క్రింద పేర్కొనబడిన సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయి.

  • వాంతులు
  • విరోచనాలు
  • వికారం
  • కడుపు నొప్పి
  • ఛాతి నొప్పి
  • తలతిరగడం
  • నిద్రలేమి
  • దద్దుర్లు
  • అతిసారం
  • కడుపులో అధిక అపాన వాయువు
  • చర్మం యోక్క ఫోటోసెన్సిటివిటీ
  • ఆకలి లేకపోవడం
  • ఉబ్బరం
  • భయము
  • బలహీనత
  • పొత్తి కడుపు నొప్పి

అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ ను ఎవరు వేసుకోకూడదు:

ఈ టాబ్లెట్స్ ని అలర్జీ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. గుండె, కాలేయం, ముత్ర పిండాల సమస్యలు ఉన్నా, గర్భవతులు అయిన ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు డాక్టర్ సలహా తప్పని సరిగా తీసుకోవాలి.

గమనిక:-పైన పేర్కొన్న సంచారం మాకి నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము.మీరు ఈ టాబ్లెట్స్ ని వాడేముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.

FAQ:

  1. For what azithromycin 500 mg is used?
    ఈ టాబ్లెట్ ని  ఎక్కువగా ముక్కు, గొంతు, టాన్సిల్స్, చెవులు, ఊపిరితిత్తులు మరియు చర్మం మొదలైన వాటి యొక్క బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్ గ ఉపయోగిస్తారు.ఈ ఔషధాన్ని కొన్నిసార్లు మలేరియాను నయం చేయడానికి కూడా  ఉపయోగిస్తారు.
  2. How fast does azithromycin 500mg work?
    మీరు మీ మొదటి మోతాదు తీసుకున్న వెంటనే అజిత్రోమైసిన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఓరల్ అజిత్రోమైసిన్ మీ శరీరంలో దాని పూర్తి ఏకాగ్రతను చేరుకోవడానికి సాధారణంగా 2 నుండి 3 గంటల సమయం పడుతుంది.
  3. When should I take azithromycin 500 morning or night?
    మీరు అజిత్రోమైసిన్ క్యాప్సూల్స్ తీసుకుంటే,మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మీరు మీ మోతాదులను తీసుకోవాలి. దీనర్థం ఏదైనా ఆహారానికి ఒక గంట ముందు వాటిని తీసుకోండి లేదా రెండు గంటల తర్వాత వేచి ఉండండి. మీరు మాత్రలు లేదా లిక్విడ్ ఔషధాలను తీసుకుంటే వీటిని ఆహారానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు
  4. What should you avoid while taking azithromycin?
    అజిత్రోమైసిన్ మీ హృదయ స్పందనను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి అదే దుష్ప్రభావాన్ని కలిగి ఉన్న ఇతర మందులతో తీసుకోకపోవడమే మంచిది. మీరు మీ హృదయ స్పందనను ప్రభావితం చేసే మందులను తీసుకుంటే మీ వైద్యుడికి చెప్పండి.
  5. Is azithromycin good for sore throat?
    అజిత్రోమైసిన్ అనేది స్ట్రెప్ థ్రోట్ చికిత్స చేయగల యాంటీబయాటిక్.అయితే ఈ ఇన్ఫెక్షన్‌కు ఇది సాధారణ ఎంపిక కాదు.

ఇవి కూడా చదవండి: