Table of Contents
బల్లి శరీరంపై పడితే ఏమవుతుంది ?? బలిశాస్త్రం ఏమి చెబుతోంది ??
Balli sastram Introduction In Telugu : భారతీయ సంప్రదాయంలో ఎన్నో శకునాలు నమ్ముతుంటారు. వీటిల్లో బల్లి శకునాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. బల్లి శరీరంపై పడే చోటుని బట్టి అది మంచి శకునమా లేక అపశకునమా అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ బల్లి శాస్త్రం శకునాలు, పురుషులకు స్త్రీలకు వేరు వేరుగా ఉంటాయి. జ్యోతిష్యం లో ని గౌలి పటన శాస్త్రం ఈ బల్లి పడితే కలిగే శుభం అశుభాలు గురుంచి వివరిస్తుంది.
బల్లిని చూసి చిన్న వయసులో చాలా భయపడే వాళ్లం. వయస్సు పెరిగిన తరువాత బల్లి అంటే అసహ్యం పుడుతుంది. కొన్ని జంతువులను చూస్తే ముట్టుకొని పట్టుకోవాలనిపిస్తుంది. వాటిని దగ్గరకు తీసుకొని పెంచాలనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే చాలా వికారం పుడుతుంది. అలా వికారం పుట్టించే జంతువుల్లో బల్లి ప్రథమమని చెప్పుకోవచ్చు.
మన శరీరంపై బల్లి పడితే మన పెద్దలు ఇంట్లో ఎంత హడావిడి చేస్తారో, ఎంత ఆందోళనకు గురవుతారనేది మనకి తెలిసిన విషయమే. బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఏమౌతుందోనని గౌలి పఠన శాస్త్రం స్పష్టంగా వివరించింది. ఈ గౌలి పఠన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన పండితులు పూర్వం మన పెద్దలకు చెబితేనే వారిప్పుడు మనకు చెబుతున్నారు.పెద్ద బాల శిక్ష పుస్తకంలో కూడా ఈ బల్లి శాస్త్రం గురించి, బల్లి శరీరం మీద పడితే కలిగే ఫలితం గురించి వివరించడం జరిగింది
ప్రస్తుతం పిల్లలు లేని ఇళ్ళు అయినా ఉంటాయేమో కానీ, బల్లి లేని ఇల్లు మాత్రం చాలా అరుదు. బల్లి శాస్త్రం, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా చెప్పబడింది. ఇప్పుడు మనం మీకు బల్లి ఎక్కడ పడితే ఏమి జరుగుతుంది. లాభాలు, నష్టాలు. దోష నివారణ ఎలా చేసుకోవాలి, లాంటి వివరాలను వివరంగా తెలుసుకుందాం.
బల్లి ఎవరి శరీరం పై పడితే ఏమి జరుగుతుంది ?? కలిగే మంచి చెడులు ఏమిటి ??
◆ పసిపిల్లలు, ఉపనయనం కానీ మగవాళ్ళు, ఇంకా పెళ్లి కాని వాళ్ళ శరీరం మీద బల్లి పడితే దానివల్ల కలిగే మంచి లేదా చెడు పలితాలు తల్లిదండ్రులకు వర్తిస్తాయని చెబుతున్నారు పండితులు.
◆ బల్లి తలపై పడి అది వెంటనే కింద పడకుండా అలాగే నేరుగా కాలి వరకు పాకితే కష్టాలు వస్తాయని బల్లిశాస్త్రం చెబుతోంది. అదే ఇందుకు విరుద్ధంగా కాలి నుండి తలవరకు పైకి పాకితే అనుకున్నవి జరుగుతాయని, అది శుభసూచకమని చెబుతున్నారు.
◆ బల్లి కేవలం పాదాలపై మాత్రమే పడితే వాళ్ళు ప్రారంభించిన వ్యాపారం కానీ లేదా అప్పటికే కొనసాగుతున్న వ్యాపారం కానీ అభివృద్ధి బాటలో సాగడం ఖాయం.
◆ కుడి అరికాలు మీద బల్లి పడితే అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎడమ అరికాలు మీద పడితే అనుకోని విధంగా డబ్బులు రావడం జరుగుతుందని బల్లి శాస్త్రం చెబుతోంది.
◆ పాదాలకు వెనుక భాగంలో కాలి మడమల మీద బల్లి పడితే, చాలా పెద్ద నేరాలు చేసి జైలు శిక్ష వంటి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి.
◆ పాదముల సందులలో బల్లి పడితే ఏదో ఒక కారణం వల్ల అనారోగ్యం సంభవిస్తుంది.
◆ స్త్రీల బల్లి శాస్త్రం ప్రకారం పాదాల వెనక భాగంలో బల్లి పడితే సమస్యలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
◆ పెళ్ళయ్యి పిల్లలున్న వారి కాలి వేళ్ళ మీద బల్లి పడితే వారి పిల్లలకు ఏదో ఒక కారణం వల్ల ప్రమాదాలు జరుగుతాయి.
◆ కుడి పాదము వేళ్ళ మీద గాని గోళ్ళమధ్యగాని బల్లి పడితే సిరిసంపదలు చేకూరుతాయి. అయితే గోళ్ల మధ్య కాకుండా గోళ్ళమీద పడితే ప్రమాదాలు జరుగుతాయి.
◆ పాదాలకు ఎడమవైపున క్రిందభాగంలో బల్లి పడితే వ్యాపారాలలో లేదా ఇతర విషయాలలో ఎదో ఒక విధంగా నష్టం జరుగుతుంది. అదే పాదాలకు కుడివైపున పై భాగంలో పడితే ధన లాభం, పాదం పైన మధ్యలో బల్లి పడితే ప్రమాదాలు సంభవిస్తాయి.
◆ కుడి పిరుదుపై బల్లి పడితే ధన లాభం ఉంటుందని, ఎడమ పిరుదు పై పడితే ధననష్టము కలుగుతుందని. మోకాళ్ళ మీద బల్లి పడితే ఏదైనా మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం.
◆ తొడకు వెనుక భాగంలో బల్లి పడితే విషప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తొడకు ముందు భాగంలో బల్లి పడితే సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉంటారు. తొడ లోపలిభాగం అనగా కాళ్ళ మధ్య సందులో తొడ భాగంలో బల్లి పడితే ఆడవాళ్లు సంతోషంగా ఉండే సంఘటనలు జరుగుతాయి.
◆ కుడితొడ మీద బల్లి పడితే పిల్లలకు ప్రాణహాని కలుగుతుంది.
◆ తొడల మీద బల్లిపడితే పిల్లల వల్ల మంచి పనులు జరుగుతాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తొడల మొదట బల్లిపడితే అనారోగ్యం కలిగి నీరసము, నిస్సత్తువ తో ఇబ్బంది పడతారు.
◆ తొడ గజ్జల మీద బల్లి పడితే అనారోగ్యం కలుగుతుంది.
◆ కుడి మోకాలు మీద బల్లి పడితే ఇతర నుండి ప్రమాదం జరుగుతుంది.
◆ మగవాళ్ల వృషణాలపై బల్లి పడితే పిల్లలు కలగడంలో ఇబ్బంది ఎదురవుతుంది.
Balli Sastram For Female In Telugu: ఆడవాళ్ల శరీరంలో ఏ భాగాలపై బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుంది.అలాగే బల్లి శాస్త్రం వలన స్త్రీ లకు కలిగే అశుభాలు మరియు బల్లి శాస్త్రం వలన స్త్రీ లకు కలిగే శుభాలను ఇప్పుడు తెలుసుకుందాం.
S.NO | స్త్రీ శరీర భాగం | కలిగే ఫలితములు (శుభా,అశుభాలు |
1 | తలా మీద | ప్రాణభయం |
2 | కొప్పు పైన | రోగ భయం |
3 | పిరుదుల మీద ( పిక్కల మీద) | బంధువులను కలుసుకుంటారు |
4 | ఎడమ కన్ను | భర్త నుండి ప్రేమ ఎక్కువగా పొందుతారు |
5 | కుడి కన్ను | మనోవ్యధ( మానసికంగా బాధపడతారు) |
6 | వక్షముల మీద | సుఖము |
7 | కుడి చెంప | కొడుకు వల్ల మేలు జరుగుతుంది |
8 | కుడి చెవి | ధనలాభం |
9 | పై పెదవి | విరోధములు( గొడవలు జరిగి శత్రువులు తయారవుతారు) |
10 | కింద పెదవి | వస్తులాభం |
11 | రెండు పెదాలు | కష్టములు ఎదురవుతాయి |
12 | స్తనముల మీద | అధిక దుఃఖం( ఎక్కువ బాధ పడే సంఘటనలు జరుగుతాయి) |
13 | వీపు మీద | మరణ వార్త వింటారు |
14 | గోళ్ల పైన | గొడవలు జరుగుతాయి |
15 | కుడి భుజం | భర్తతో సంసార సుఖం అనుభవిస్తారు |
16 | బాహువులు(భుజాలు) | ఆభరణాలు పొందుతారు |
17 | ఎడమ భుజం | సుఖం కలుగుతుంది |
18 | తొడల మీద | వ్యభిచారం |
19 | మోకాళ్ళ మీద | కష్టాలు కలుగుతాయి |
20 | కుడి కాలిపై | శత్రువులకు గుణపాఠం కలిగే సంఘటనలు జరుగుతాయి |
21 | కాలి వేళ్లపై | కొడుకుల వల్ల మేలు జరుగుతుంది. |
Balli Sastram For Male In Telugu : మగవాళ్ల శరీరంలో ఏ భాగాలపై బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుంది ?అలాగే బల్లి శాస్త్రం వలన పురుషులకు కలిగే అశుభాలు మరియు బల్లి శాస్త్రం వలన పురుషులకు కలిగే శుభాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల బల్లి శాస్త్రం ప్రకారం ఎం జరుగుతుందో కింద తెలిపాము. ఇంకా ఒక్కసారి బాగా చదివి అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ లో తెలుపగలరు.
S.NO | పురుషుల శరీర భాగం | కలిగే పలితాలు (శుభా,అశుభములు) |
1 | తలమీద | గొడవలు జరుగుతాయి |
2 | బ్రహ్మరంధ్రం | ప్రాణానికి ప్రమాదం |
3 | ముఖము | ధనలాభం |
4 | ఎడమకన్ను | మంచి జరుగుతుంది |
5 | కుడికన్ను | ఓటమి ఎదురవుతుంది |
6 | నుదురు | బంధువులతో శత్రుత్వం కలుగుతుంది |
7 | కుడిచెంప | దుఃఖం కలుగుతుంది |
8 | ఎడమచెవి | లాభం |
9 | పై పెదవి | గొడవలు జరుగుతాయి |
10 | కింద పెదవి | ధనలాభం |
11 | రెండు పెదాలపై | చావు భయం కలుగుతుంది. |
12 | నోటియందు | అనారోగ్యం కలుగుతుంది. |
13 | ఎడమమూపు | చేసే పనుల్లో విజయం సాధిస్తారు |
14 | వేళ్లపై | స్నేహితులు ఇంటికి వస్తారు. |
15 | కుడి భుజం | కష్టాలు కలుగుతాయి. |
16 | ఎడమ భుజం | అవమానాలు ఎదురవుతాయి. |
17 | తొడలపై | వస్త్ర నాశనం జరుగుతుంది. |
18 | కుడిపాదం | సుఖం చేకూరుతుంది. |
19 | ఎడమ పాదం | కష్టాలు కలుగుతాయి. |
20 | పాదాల వెనుక | ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. |
21 | కాలి వేళ్లపై | జబ్బులు కలిగే ప్రమాదం ఉంది. |
గమనిక:-పైన పేర్కొన్న అంశాలు అన్ని ఇంటర్నెట్ లో మాకి దొరికిన సమాచారం ఆధారంగా చేసుకొని తెలిపాము.మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె మీరు నమ్మే స్వామిజిలను కలిసి తెలిసుకోండి.
ఇది కూడా చదవండి :-