బాస చేప పరిచయం | Basa Fish In Telugu 2022
బాస చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు
మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటుంది. అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ అనేది ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో మనకి లభిస్తాయి. PRICE : 200 నుండి 255 ధర వరకు మనకు అందుబాటులో కలదు.
బాస చేపని తినడం వలన ఉపయోగాలు
ఈ చేపలు మనుషులకు అవసరమైన ప్రోటీన్లు మరియు పోషకాలకు అందించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ చేపలలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నందువలన బరువు తగ్గాలి అనుకునేవారు ఈ చేపని ఆహారంగా వారంలో మూడు రోజులకి ఒకసారి తినవచ్చు.
ఖనిజాలు .
బాస చేపలలో జింక్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జింక్ మరియు పొటాషియం రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడానికి,గాయపడిన కణజాలాలను నయం చేయడానికి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను మెరుగు పరచడానికి అవసరం.
రక్త పోటు
బాస చేపలలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల బాస చేపలలో 48 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకోవలసి ఉంటుంది.
మొదడుకి మంచిది
ఈ చేపలు మన మెదడుకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి మంచిది అని మనకి తెలుసు. ఇది DHA నాడీ కణాల పెరుగుదలకు డైరెక్ట్ గా సహాయం చేస్తుంది. మన మెదడు సాధారణంగా మరియు సమర్ధవంతంగా పనిచేయడానికి DHA ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాం చాలా అవసరం.
అవసరమైనంత DHA నీ దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు జ్ఞాపక శక్తిని, అభ్యాస శక్తిని మనం సమర్థవంతంగా పెంచుకోవచ్చు. DHA యొక్క సంపూర్ణ ప్రయోజనాలను మనం పొందాలి అంటే ఈ చేపలను తినాలి.
బరువు తగ్గడం
బాస చేపలలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ కేలరీలు తీసుకోవాలి అనుకునేవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్. ప్రోటీన్లు ఎక్కువగానూ మరియు కాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వును తగ్గించడంలో ఈ చేపలు ఉపయోగపడతాయి.
బాస చేపని తినడం వలన కలిగే దుష్ప్రభావాలు
- చేపలు నీరు లేదా ఆహారాన్నితీసుకునేటప్పుడు కొన్ని హానికరమైన రసాయనాలను కూడా తిని ఉండే చాన్స్ ఉంది.
- ఈ రసాయనాలు మీ మెదడు మరియు నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తాయి.
- కాబట్టి మనం చేపలను పెంచే నీరు శుభ్రంగా మరియు రసాయనాలు,కాలుష్యాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి .
- అంతేకాదు చేపల పెంపకందారులు చెరువులోని సూక్ష్మజీవులను వదిలించుకోవడానికి వివిధ రకాల రసాయనాలు మరియు మందులను కూడా చెరువులలో ఉపయోగిస్తారు.
- బాసా వంటి చేపలు ఈ హానికరమైన రసాయనాలన్నింటినీ తమ శరీరంలోకి ఆహారంగా తీసుకుంటాయి. అందువల్ల చేపలు విషపూరితంగా మారేదానికి అవకాశం ఉంది.
- యూరోపియన్ దేశాలు అయిన జర్మనీ దేశాలకు ఎగుమతి చేయబడిన బాస చేపలలో ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యేటువంటివి బ్రియో బ్యాక్టీరియాను కనుగొన్నారు.
- ఈ చేపలను బాగా శుభ్రం చేసి ఎక్కువ వేడిలో వంట చేసుకోవడం మంచిది. మనం ఎక్కువ వేడిలో చేపలను ఉడికించినట్లయితే చేపల నుండి విషాన్ని వేరు చేయవచ్చు. అప్పుడు మనం ఆహారంగా తీసుకోవచ్చు.
FAQ:
- Is basa a good fish to eat?
బాసా అనేది ఆగ్నేయాసియాకు చెందిన తెల్లటి చేప.ఇది అధిక-నాణ్యత ప్రోటీన్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క అద్భుతమైన మూలం. - What is basa fish taste like?
బాసా చేపల ఆకృతి కాడ్ మరియు టిలాపియా లాగా ఉంటుంది.అయితే ఇది కొన్ని ఇతర రకాల తెల్ల చేపల వలె ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండదు. ఈ రకమైన చేపలు తేలికపాటి రుచిని కల్గి ఉంటాయి. - What is basa fish called in English?
బాసా చేప ఒక క్యాట్ ఫిష్, దీనిని శాస్త్రీయంగా పంగాసియస్ బోకోర్టీ అని పిలుస్తారు. - Is basa full of mercury?
అవును.వీటిలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. - Is basa fish high in cholesterol?
ఈ రకమైన చేపలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి