Table of Contents
Belly Fat Reduce Tips In Telugu 2024
బెల్లి ఫ్యాట్ : ఫ్రెండ్స్ ప్రస్తుత మనం ఉన్నటువంటి సమాజంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ బెల్లి ఫ్యాట్. దీనిని మన భాషాలో చెప్పాలి అంటే ఉబకాయం అని అంటారు. ఇది కొందరికి మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడి వలన వస్తుంది, మరి కొందరిలో సహజంగానే ఉంటుంది.
అధికంగా బరువు పెరగటం, శారీరక శ్రమ లేకపోవడం, కూర్చొని ఉండడం, నిద్రపోవడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం యాక్టివ్‌గా ఉండాలి.
ఈ బెల్లి ఫ్యాట్ ని తగ్గించాలి అంటే అంత సులభంగా ఏమి అవ్వదు. కానీ ఈ ఆర్టికల్ లో తెలియచేసే టిప్స్ ని పాటిస్తే చాలా సులభంగా ఈ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే రెండు విధాలుగా తగ్గించుకోవచ్చు అవి: 1.పండ్లు తిని తగ్గించుకోవచ్చు 2.వ్యాయామాలు చేయటం వలన తగ్గించుకోవచ్చు.ఈ క్రింద మనం వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం
A .పండ్లు తిని బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవటం :
ఫ్రెండ్స్ మీకు తెలుసా మనకి ఇష్టమైన పండ్లను తింటూ ఈ బెల్లి ఫ్యాట్ని అతి సులభంగా తగ్గించుకోవచ్చు. అసలు ఆ పండ్లు ఏంటి? వాటిని ఏ సమయంలో ఎలా తినాలో క్రింద వివరంగా తెలుసుకుందాం.
1.పుచ్చకాయ:
ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయను మనలో చాలా మంది ఎక్కవగా ఇష్టపడుతుంటారు. ఇది మనకి వేసవి కాలంలో ఎక్కువగా తోరుకుతుంది.ఈ కాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీని వలన మన బాడీలోని డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. కాబట్టి మనకు చాలా వరకూ ఆకలి అవ్వదు. దీనివలన మన శరీర బరువు కూడా మన అదుపులోకి వస్తుంది. ఈ కాయ బాడీలోని వెస్ట్ కొవ్వులని కూడా తగ్గిస్తుంది.
2.బొప్పాయి:
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ పండుని తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి, సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
3.ద్రాక్ష:
దాక్ష పండ్లు బరువును బాగా తగ్గిస్తాయి. గ్రీన్ ద్రాక్ష కన్నా నల్ల ద్రాక్ష ఎక్కువగా బరువు తగ్గించగలదు. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలో చెడు వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. వీటిలోని పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివలన త్వరగా బరువు తగ్గుతారు.
4.అవకాడో:
ఫ్రెండ్స్ ఈ అవకాడో మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే ఇందులో ఉన్నటువంటి ఫ్యాట్స్ మనకి తొందరగా ఆకలి వేయనియ్యవు. దీనివలన మనం ఎక్కువ ఆహారం తిసుకోలెం.దీంతో శరీర బరువు కంట్రోల్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి పీచు జీర్ణక్రియని మెరుగ్గా చేసి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది.
5.నిమ్మకాయలు:
ఫ్రెండ్స్ మనకి నిమ్మకాయలు సంవత్సరమంతా దొరుకుతాయి. కొవ్వును ఐస్‌క్రీమ్‌లా కరిగించే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి.కానీ నిమ్మరసంలో పంచదార వేసుకుంటే మాత్రం బరువుపెరుగుతాం. అందువల్ల నీటిలో నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, అల్లం రసం కలుపుకొని తాగవచ్చు. రోజుకో నిమ్మకాయ చొప్పున 6 నెలలు వాడితే బాడీలో కొవ్వు మొత్తం మాయమవుతుంది. దీనివలన ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.
6.అరటి పండ్లు:
మనకు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే ఫ్రూట్స్ లో ఈ అరటి పండ్లు ఒకటి, వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే పొటాషియం మన శరీరంలోని సోడియం లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఇది మన శరీరంలో వెస్ట్ కొవ్వును కూడా పేరుకుపోకుండా చేస్తుంది. మనం ఈ అరటి పండును తింటే ఎక్కువ సేపు ఆకలి కూడా వేయదు. కాబట్టి మనం వేరే ఏమి తినం దీనివల్ల మన బాడిలో ఈ బెల్లి ఫ్యాట్ ఏర్పడదు.
7.పైనాపిల్:
మనలో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ ని తగ్గించడంలో పైనాపిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల వేడి పెరుగుతుంది. దీంతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇది మన శరీరంలో ఉన్నటువంటి వెస్ట్ కొవ్వుని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన డీహైడ్రేషన్‌ని కూడా తగ్తగిస్గ్గితుంది స్తుంది.
8. ఆపిల్స్ :
ఈ బెల్లి ఫ్యాట్ ని తగ్గించడంలో ఆపిల్స్ కూడా బాగా పని చేస్తాయి.యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇవి తింటే మనకు చాలా సమయం వరకు ఆకలి కూడా వేయదు, యాపిల్ రోజూ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
B.వ్యాయామాలు ద్వారా బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోవడం:
ఫ్రెండ్స్ మనం మన ఇంట్లోనే ప్రతి రోజు కొన్ని వ్యాయామాలు చేయటం వలన అతి సులభంగా మన శరీరంలోని బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అవి ఏంటో క్లియర్ గా క్రింద తెలుసుకుందాం.
- వాకింగ్ బెల్లి ఫ్యాట్ ని తగ్గించడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది.స్పీడ్‌గా నడవడం, పరుగెత్తుతూ నడవటం వలన మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ని చాలా వరకూ తగ్గించే కార్డియో వర్కౌట్. రెగ్యులర్‌గా ఇలా నడవడం వలన మన నడుము చుట్టూ ఉన్న కొవ్వు చాల సులభంగా కరుగుతుంది.
2.సైక్లింగ్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి, మన శరీరంలోని కేలరీలను బర్న్ చేసేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇది మనం జిమ్‌లో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. సైకిల్ ని మనం అదేపనిగా తోక్కనవసరం లేదు ఇంట్లోకి సరుకులు తీసుకురావడం, సరదాగా బయటికి వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కడం లాంటివి చేయడం కూడా కార్డియో కిందకే వస్తాయి.
3.స్విమ్మింగ్ చేసి కూడా మనం చాలా వరకూ బెల్లీ తగ్గించుకోవచ్చు, ఎలా అంటే మనం స్విమింగ్ స్టార్ట్ చేసిన వెంటనే కేలరీలు ఖర్చవ్వడం ప్రారంభమవుతుంది. కాబట్టి దీనివలన కూడా తొందరగా బెల్లి ఫ్యాట్ ని దూరం చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో కూడా కొన్ని కిటుకులు ఉంటాయి. ఎలా చేస్తే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయో స్విమ్మింగ్ ఎక్స్‌పర్ట్‌ని కనుక్కుని వాటిని ట్రై చేస్తే బెటర్ రిసల్ట్ ఉంటుంది.
4. ఫ్రెండ్స్ బెల్లి ఫ్యాట్ ని తగ్గించడంలో కార్డియో వర్కౌట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా రోజుకి కనీసం 30 నిమిషాల పాటు ఏరోబిక్, కార్డియో చేయడం చాలా మంచిది. ఇందులో చాలా వర్కౌట్స్ ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.
5. మన శరీరంలోని బెల్లి ఫ్యాట్ ని తగ్గించేందుకు స్కిప్పింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. దీనిని చేయడం వలన కేలరీలు బర్న్ అవుతాయి. రెగ్యులర్‌గా చేయడం వల్ల షోల్డర్ పవర్, స్ప్రింటింగ్ పెరుగుతుంది. ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు కొద్దిసేపు స్పీడ్‌గా, మరికొద్ది సేపు నిదానంగా చేయడం చాలా మంచిది. ఇది ఇంట్లోనూ చేసుకోవచ్చు
గమనిక:- పైన పేర్కొన్న సమాచారం మొత్తం మాకి దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. వీటిని పాటించటం వలన ఫలితం వ్యక్తిగతం మాత్రమే. మీరు వీటిని పాటించే ముందు ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించండి.