Table of Contents
డయాబెటిక్ వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి | Best Food For Diabetes In Telugu
Best Food For Diabetes In Telugu :- మధుమేహం చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్దుతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు, రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.
మధుమేహం ఉన్న వారు ఆహరం లో జాగ్రత్త తీసుకొని ఉంటారు, డయాబెటిక్ వారు ఎక్కువగా చెక్కర పద్ధార్థాలు ఉన్న ఫుడ్ తి తిసుకోకుడదు అని వైదులు తెలియచేస్తారు. వీరు ఆహరం విషయం లో మాత్రం చాల జాగ్రత్త పడవలసి ఉంటది.
మధుమేహం వ్యాధి ఒక స్లో పాయిజన్ లాంటిది. నిర్లక్ష్యం చేస్తే త్వరగానే ఆయుష్షును మింగేస్తుంది. జాగ్రత్తగా ఉంటే కొన్నాళ్లు ఎక్కువ జీవించేందుకు అవకాశం ఇస్తుంది. అందుకే ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.
ఏది పడితే అది తినేస్తే.. చక్కెర స్థాయిలు పెరిగిపోయి ఆస్పత్రిపాలయ్యేలా చేస్తుంది. అలాగని నోటిని కట్టేసుకోవక్కర్లేదు. డయాబెటిస్ బాధితులు కూడా తినేందుకు అనేక ఆహారాలు ఉన్నాయి.
ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకొందం. ఎలాంటి ఆహరం తీసుకోవడం వలన ఈ మధుమేహాని నియంత్రించవచ్చు అనేది కనుగొంధం.
డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి పండ్లు తినాలి
- నేరేడు పండు
- ఆపిల్
- పుచ్చకాయ
- బొప్పాయి
- స్ట్రాబెర్రీ
- నారింజ
- అవోకాడో
- దానిమ్మపండు
- చెర్రీస్
నేరేడు పండు :- డయాబెటిస్ ఉన్న వారికి నేరేడు పండు ఉత్తమ ఫలాలలో ఒకటిగా చెప్పవచ్చు వీటిలో సమృద్ధిగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఉంటాయి.
ఒక సగం గిన్నెనేరేడు తినడం ద్వారా, మీరు 62 కేలరీలు మరియు కార్బోహైడ్రేట్ల 16 గ్రాముల మాత్రమే పొందుతారు. ఇన్సులిన్ పరిమాణం మరియు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి నేరేడు పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆపిల్ :- ఈ పండు అంటే అందరికీ ఆపిల్ అత్యంత ఇష్టపడే పండు. యాపిల్లో పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఉన్నాయి. యాపిల్ పెక్టిన్ అని పిలువబడే ఒక రసాయని కలిగి ఉంటుంది అది రక్తంలో ఉన్న చక్కెరను 50% తగ్గిస్తుంది.
ఆపిల్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 38 మాత్రమే. కేవలం 54 కేలరీలు మరియు 14 గ్రామ కార్బోహైడ్రేట్లు చిన్న యాపిల్ లో ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఎరుపు రంగులో ఉన్న యాపిల్ కన్నా పచ్చ{green}రంగులో ఉన్నాయి మంచిది.
పుచ్చకాయ :- పుచ్చకాయ లో షుగర్ గుల్క్కోచ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్రక్టోజ్ యొక్క సహజ చక్కెర శక్తి మార్పు కారణంగా, డయాబెటిక్ కొంత పరిమాణం లో తినవచ్చు, పుచ్చకాయలో కార్టెనోయిడ్లను రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం యొక్క దుష్ప్రభావాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
బొప్పాయి :- డయాబెటిక్ రోగులకు బొప్పాయి చాలా ఉపయోగకరమైన పండు. అధిక స్థాయిలో రక్తంలో చక్కెర ఉన్న రోగులు ఖచ్చితంగా బొప్పాయి తినాలి. బొప్పాయి తీసుకోవడం ద్వారా, రక్త చక్కెర తగ్గుతుంది.
బొప్పాయిలో కారోటీన్ మరియు పాపైన్ అనే ఎంజైమ్ ఉండడం కారణంగా హృద్రోగం, మూత్రపిండ వ్యాధి మరియు వయసు పైబడుట వంటి దుష్ప్రభావాల నుండి దూరం చేస్తుంది.
నారింజ :- డయాబెటిక్ పేషెంట్స్ ప్రతిరోజూ ఒక నారింజని తినాలి అని అంటున్నారు నారింజ యొక్క గ్లైసెమిక్ సూచిక 35 నుంచి 50 మధ్య ఉంటుంది. ఆరెంజ్స్ శరీరానికి చక్కెర జీర్ణక్రియను పెంచే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నారింజ పుష్కలంగా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది.
స్ట్రాబెర్రీ :- డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు విటమిన్లు మరియు ఫైబర్ స్ట్రాబెర్రీ లో సమృద్ధిగా ఉంటాయి.కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు బేరిలో తక్కువగా ఉంటాయి, కానీ అధిక ఫైబర్ వల్ల, ఇది మధుమేహం మరియు బరువు తగ్గాలి అనుకునేవారికి అద్భుతమైన పండ్లుగా చెప్పుకోవచ్చు.
అవోకాడో:- ఇది మెక్సికోలో పెరిగే ఒక యాపిల్-లాంటి పండు, పోషక లక్షణాల కారణంగా భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందింది. మధుమేహంతో గుండె జబ్బు నుండి డయాబెటిక్ రోగులను అవోకాడో రక్షిస్తుంది.
దానిమ్మపండు:-దానిమ్మపండు తీపి, కానీ దానిమ్మపండులో విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కలిగి ఉంటుంది. దానిమ్మ రసం తీసుకుని తాగడంకన్నా డయాబెటిక్స్ ఉన్నవారు దానిమ్మ గింజలు తింటే మంచిది, దానిమ్మపండు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
చెర్రీస్ :- చెర్రీస్ యొక్క గ్లైసెమిక్ సూచిక 20 మాత్రమే. చెర్రీస్ పండులో ఆంథోసనియానిన్స్ అని పిలువబడే ఒక రసాయని కలిగి ఉంటుంది ఇది శరీరంలో మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, ఇది రక్త చక్కెర నియంత్రణలో ఉండటానికి అనుమతిస్తుంది. ప్రీ-డయాబెటిక్ నివారించడానికి సహాయపడుతుంది.
డయాబెటిక్ పేషెంట్లకు ఎలాంటి ఆహరం తీసుకోవాలి
చేపలు: మధుమేహ వ్యాధిగ్రస్తులు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
పప్పు దినుసులు :- డయాబెటిక్ పేషెంట్ల డైట్ లో పప్పు దినుసులు ఎక్కువగా తినాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి, పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకొని మధుమేహం రాకుండా చూస్తాయి.
కూరగాయలు : కురగాయాలలో అన్ని రకాల ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్ ,పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్కిప్, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట బ్రాడ్‌బీన్స్, తెల్ల గుమ్మడి, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
బాదం: మధుమేహం ఉన్న వారు బాదం తినడం వలన చాలా మంచివి. చెక్కెర ఎక్కువగా కాకుండా అడ్డుకొంటుంది.
బెర్రీస్: బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ బెర్రీస్ తినడం వలన మంచివి.
డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తినకూడదు
ఇప్పుడు కాలంలో చాల మంది డయాబెటిక్ తో బాధపడుతున్నారు, ఈ మధుమేహం పేషెంట్స్ కి డాక్టర్ వాళ్ళు ఎలాంటి ఆహరం తీసుకోవాలి, ఎలాంటి ఆహరం తినకూడదు అనేది వారికి తెలియచేస్తారు, అయ్యితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తినకూడదు అనేది తిసుకొంధం.
- డయాబెటిక్ వాళ్ళు అన్నీ తినయడానికి వీల్లేదు, పండ్లు ఆరోగ్యానికి మంచిదని ఏవి పడితే అవి తినకూడదు.
- మీకు తెలియకుండా కొన్ని పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి.
- బంగాళ దుంపలు, చిలకడ దుంపలు, బీట్ రూట్, క్యారెట్‌లకు దూరంగా ఉండాలి. వీటిని తక్కువగా తీసుకోవాలి.
- మామిడి పండ్లు, ద్రాక్ష, అరటి పండ్లు, కర్జూరాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి.
- తీపి పదార్థాలను అస్సలు తినొద్దు. అలాగే, నూనె వంటకాలు, అన్నం మితంగా తీసుకోవాలి.
- ఆహార వేళలను కూడా మధుమేహ బాధితులు కచ్చితంగా పాటించాలి.
- ఏ ఆహర పదార్థం అయ్యిన ఒకేసారి ఎక్కువగా తినేయకూడదు.
- సమయానికి ఆహారాన్ని తీసుకోకపోతే ప్రమాదకరం. లో-షుగర్ వల్ల నీరసం ఆవహిస్తుంది.
- భోజన వేళలు పాటించకపోతే హైపోగ్లైసీమియా లేదా హైపర్గ్లైసీమియాకు గురయ్యే ప్రమాదం ఉంది
- ఆహారాన్ని అప్పుడప్పుడు తినడం వల్ల చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగడం, తగ్గడం జరగదు.
గమనిక :- పైన పేర్కొన్న ఆహార పదర్థాలు మీరు తినే ముందు వైదుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-
- గ్లైసిన్ అంటే ఏమిటి ? గ్లైసిన్ ఉపయోగించడం వలన లాభాలు ఏమిటి ?
- డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎలాంటి ఆహరం తినాలి ?