కిడ్నీ లో రాళ్లు ఉన్నవారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి !

0
Best Food For Kidney Stones In Telugu

కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి  | Best Food For Kidney Stones In Telugu

Best Food For Kidney Stones In Telugu:- కిడ్నీ లో స్టోన్స్ ఎలా పడుతాయి అనేది చాల మందికి తెలిస్యక పోవచ్చు, అయ్యితే మనం రోజు తినే ఆహరం లోనే ఏదో ఒక రుప్పం లో స్టోన్స్ అనేవి పడుతాయి. కానీ మనకు తెలియకపోవచ్చు.ఆహరం

కిడ్నీ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఈ మధ్యకాలంలో కిడ్నీ సమస్యలతో ఎక్కువమంది అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కిడ్నీ అనేది ఫిల్టర్ లా పనిచేస్తుంది, శరీరంలోని టాక్సిన్స్ ను అలాగే అదనపు నీటిని యూరినేషన్ ద్వారా బయటికి పంపిస్తుంది.

అయితే, ఈ మధ్య కాలంలో ఎక్కువమంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూరిన్ లోనున్న క్రిస్టల్స్ పేరుకుపోవడం ద్వారా గట్టిగా రాళ్ళల్లా ఏర్పడతాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ పాత్ కి బ్లాకేజ్ ని క్రియేట్ చేయడం ద్వారా మీకు నొప్పిని కలిగిస్తాయి.

కిడ్నీ రాళ్లకు అనేక కారణాలు ఉన్నాయి మరియు మీ మూత్ర నాళంలో ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చు; మీ మూత్రపిండాల నుండి మీ మూత్రాశయం వరకు, తరచుగా మూత్రం కేంద్రీకృతమై ఉన్నప్పుడు రాళ్ళు ఏర్పడతాయి, ఖనిజాలు స్ఫటికీకరణ మరియు కలిసి ఉంటాయి.

ఈ కిడ్నీ రాళ్లలో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రువిట్ స్టోన్ అనేది మూత్రనాళా ఇన్ఫెక్షన్ను కలుగచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్టోన్ అనేది ద్రవరూప పానీయాలను అస్సలు తీసుకోకపోయినా, ఎక్కువగా తీసుకున్నా వారిలో వస్తుంది.

చాలామందికి ఏర్పడే కిడ్నీ రాళ్లలో ఎక్కువగా కాల్షియం స్టోన్స్ మాత్రమే ఏర్పడతాయి. ఇది సాధారణంగా కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఈ ఆక్సలేట్ అనేది సహజంగా తీసుకొనే ఆహార పదార్థాల సమ్మేళనాల ద్వారా కాలేయ సహాయంతో రోజువారీగా తయారవుతుంది.

కిడ్నీ లో రాళ్లు ఉన్నపుడు ఎలాంటివి తిసుకోకుడదు 

ఉప్పు తగ్గించాలి :-కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆహారంలో ఉప్పును తగ్గించాలి. జంక్ ఫుడ్ తినడం మానుకోవాలి, ఇది కాకుండా చైనీస్, మెక్సికన్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహారాల అసలు తినకండి.

మాంసం తీసుకోవడం తగ్గించండి :-కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్‌ ఆహారాలు తినడం మానుకోవాలి. నాన్-వెజ్ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, నాన్-వెజిటేరియన్ డైట్‌లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది ఇది స్టోన్ పరిమాణం పెరిగే అవకాశాలను పెంచుతుంది.

చాక్లెట్లు  తినరాదు:- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు చాక్లెట్లు తినకూడదు. చాక్లెట్లు  తినడం వలన చాక్లెట్‌లో ఆక్సలేట్ ఉంటుంది దీనివల్ల కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి. అందుకే వీటిని తినడం ప్రమాదం.

విటమిన్ సి:- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను పరిమితం చేయాలి. విటమిన్ సి లో ఉండే ఆక్సలేట్ కాల్షియంను నిల్వ చేస్తుంది. అలాగే పాలకూర, తృణధాన్యాలు, చాక్లెట్, టమోటాలలో ఆక్సలేట్‌లో పుష్కలంగా ఉంటుంది, అందుకే వీటిని తినడం మానుకోవాలి.

కిడ్నీ స్టోన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు 

కిడ్నీ లో రాళ్లు పడినాయి అనే విషయం ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవాలో తెలుసుకొందం.

  • పక్కటే ఎముకల కింద వైపు మరియు వెనుక భాగంలో ఎక్కువగా నొప్పి రావడం.
  • దిగువ కడుపునొప్పి మరియు గజ్జలకు వ్యాపించే నొప్పి.
  • అలలుగా వచ్చి తీవ్రతలో హెచ్చుతగ్గులకు లోనయ్యే నొప్పి.
  • మూత్రవిసర్జనలో నొప్పి రావడం. 
  • పింక్, ఎరుపు లేదా గోధుమ రంగు మూత్రం రావడం. 
  • మేఘావృతమైన లేదా దుర్వాసనతో కూడిన మూత్రం రావడం. 
  • వికారం మరియు వాంతులు సంభవించడం. 
  • నిరంతరం మూత్ర విసర్జన తో బాధపడడం. 
  • సాధారణం కంటే తరచుగా మూత్రవిసర్జన సంభవించడం. 
  • చిన్న మొత్తంలో మూత్రవిసర్జన  రావడం. 

కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎం తినాలి 

కొన్ని కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి, కిడ్నీ లో రాళ్లు పోవడానికి ఎలాంటి ఆహరం తీసుకోవడం వలన రాళ్అలు పోతాయి అనేది తెలుసుకొందం.

 ఖర్జూరాలు:- ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి.

పుచ్చకాయ:- పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం లో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి ఈజీ గా చెక్ పెట్టచ్చు.

​లెమన్, ఆలివ్ ఆయిల్ :- లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్ గా బైటికి వెళ్ళిపోతాయి.

తులసి :- తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారౌతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ లోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలు గా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది. బేసిల్ పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది.

దానిమ్మ రసం :- దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది, ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ :- యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది.

రెగ్యులర్ గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని అక్కర్లేని పదార్ధం బైటికి పోతూ ఉంటుంది.

గమనిక :- పైన పేర్కొన్న ఆహార పదార్థాలు మీరు తినే ముందు వైదుడిని సంప్రదించండి.

 ఇవి కూడా చదవండి :-