కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి !

0
Best Food For liver In Telugu

ఎలాంటి ఆహరం తినడం వలన లివర్ ఆరోగ్యంగా ఉంటది| Best Food For liver In Telugu 

Best Food For liver In Telugu :- ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం పై తప్పకుండా శ్రద్ధ చూపించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏదోఒక వ్యాధి వలన లేదా రోగం వలన బాధపడుతున్నారు. అందుకనే అనారోగ్య సమస్యలు పరిపడకుండా మంచి జీవనాని అనుసరించాలి.

అదే విధంగా సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఆరోగ్యనికి సంభందించిన ఏ చిన్న సమస్య వచ్చిన తక్షణమే వైద్యం చేపించుకోవాలి, రోజు వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికీ సమయం కేటాయించాలి. అలాగే మన హెల్త్ జాగ్రతగా చూసుకొంటూ ఉండాలి అప్పుడే మనం, మన ఆరోగ్యం బాగుంటది.

అయ్యితే ఇప్పుడు లివర్ కి సంబంధించి ఎలాంటి ఆహరం తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకొందం.

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి. కొన్ని సార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటిని ట్రీట్‌మెంట్‌తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

లివర్ చాలా పనులను చేస్తూ ఉంటుంది. కాబట్టి లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి అని చెప్పారు ప్రితిక. లివర్ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన టిప్స్ ని ప్రితికా పంచుకోవడం జరిగింది, వీటిని అనుసరిస్తే లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

లివర్ ని మంచిగా ఉంచుకోవడం కోసం ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. అలానే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని ఎవరు చెప్పారు. అయితే లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

కాలేయం అంటే ఏమిటి 

మానవ ఉదరములో కాలేయము ఎరుపు రంగు యొక్క స్థానము. కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి డయాఫ్రమ క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది, దీనినే కాలేయం అంటారు. 

లివర్ ఆరోగ్యంగా ఉండనికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి 

యాపిల్ :- యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది.

ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా.

యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యారెట్ :- ఈ దుంపల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ కాలేయం చురుకుగా పనిచేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ రెండు వెజిటేబుల్స్ లివర్ క్లీనింగ్ లో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

గ్రీన్ టీ :- టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఇందులోని ‘ఇజీసీజి’,’కాటెచిన్స్’ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.

ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గుతాయి. అందుకు యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే కారణం. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి.

నిమ్మకాయ :- నిమ్మకయలో అధిక శాతం విటమిన్ సి ఉంటది. ఈ విటమిన్ లివర్ శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. కబ్బాటి ప్రతి రోజు ఉదయాo ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి వేసుకొని త్రాగాలి.

అవోకడో :- ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి.

వెల్లులి :- వెల్లులి ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగువుతుంది.

సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.

బిట్ రూట్ :- బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి, డయాబెటిక్ లివర్ ను కాపాడును.

కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది, ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

సిట్రస్ పండ్లు :- సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచుతుంది.

చేపలు :- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్‌ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుంది.

ఆలివ్ ఆయిల్  :- ఎన్నో ఆరోగ్య గుణాలు ఆలివ్ ఆయిల్‌లో దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని తేలింది.

నట్స్ :- గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అన్నీ కూడా లివర్‌ని కాపాడతాయి.

క్యాబేజీ :- క్యాబేజీ కూడా కాలేయాని శుభ్రం చేస్తుంది. దినిని రోజు తీసుకోవడం వలన మీ కాలేయాని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇందులో ఉండే ప్రేతెక్య గుణాల వలన మీ లివర్ ని ఆరోగ్యం గా ఉంచుతుంది.

గ్రీన్ లిపీ వెజిటబుల్ :- శరీరానికి అవసరం అయ్యిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్స్, ప్రోటిన్స్ ఈ ఆకుకూరల లో ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటది, వీటిని ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరం లో ఉండే మలినాలు బయటకి పోతాయి.

బ్రేరీస్ :- బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్‌లోనూ ఆంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి.

ద్రాక్ష :- ద్రాక్షలోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్‌ని రక్షిస్తాయి.

కాఫీ :- ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు ఎంతో రిలాక్స్ అవుతాం. కాఫీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటది. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ కు క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. కాబట్టి కాఫీని రెగ్యులర్‌గా తాగడం అలవాటు చేసుకోవాలి.

గమనిక :- పైన పేర్కొన్న ఆహార పదర్థాలు మీరు తినే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-